For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Weekly Roundup: సామ్రాట్, తులసి తీరుతో కథలో మలుపు.. నందూకు ఊహించని ఆఫర్

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతోన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. కోలీవుడ్ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 18 నుంచి జూలై 23 తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందో చూడండి!

  18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  18వ తేదీ సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి క్షమాపణ చెప్పేందుకు హనీ వాళ్ల ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఒంటరిగా ఎప్పుడూ రావొద్దని ఆ చిన్నారికి తులసి సలహాలు ఇస్తుంది. ఇక, హనీ వెళ్లిపోయే సమయంలో తన గోల్డ్ చైన్‌ను తులసి ఇంట్లోని గార్డెన్‌లో పడేసుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లగానే ఆ చైన్ కనిపించకపోవడంతో సామ్రాట్‌కు కోపం వస్తుంది. ఆ వెంటనే తులసి ఇంటికొచ్చి నానా రభస చేస్తాడు. తన పని వాళ్లతో ఆ ఇల్లంతా వెతికిస్తాడు. కానీ, చైన్ మాత్రం దొరకదు. దీంతో ఆ చైన్ తీసుకొచ్చి ఇవ్వాలని తులసిని సామ్రాట్ హెచ్చరిస్తాడు.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

  19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


  19వ తేదీ మంగళవారం వచ్చిన ఎపిసోడ్‌లో.. తమ ఇంటి గార్డెన్‌లో హనీ పోగొట్టుకున్న బంగారు గొలుసును తులసి తీసుకెళ్లి సామ్రాట్‌కు అందిస్తుంది. అయినప్పటికీ అతడు ఆమె మీద నిందలు వేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత శృతి.. ప్రేమ్ భార్యే అన్న విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ మప్పీ లహరి గుర్తిస్తాడు. అప్పుడే ప్రేమ్‌కు శృతి అక్కడ పని చేస్తున్న నిజం కూడా తెలిసిపోతుంది. మరోవైపు.. సంజన సహాయంతో తులసి ఓ డ్యాన్స్ స్కూల్‌కు వెళ్తుంది. అక్కడ హనీ.. తులసిని చూసి ఆమె దగ్గరకు రాబోతుంది. అంతలో సాంకేతిక లోపంతో లిఫ్టులో ఆమె చిక్కుకుపోతుంది.

  20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  20వ తేదీ బుధవారం ఎపిసోడ్‌లో.. హనీ లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిన సామ్రాట్.. తులసిని నిందిస్తూ మాట్లాడతాడు. అంతలో అతడి బాబాయ్ వచ్చి జరిగిన విషయాన్ని అతడికి వివరిస్తాడు. దీంతో నిజం తెలుసుకున్న సామ్రాట్ పశ్చాత్తాపపడుతుంటాడు. ఆ తర్వాత హనీని బయటకు తీసుకు వస్తారు. మరోవైపు, ప్రేమ్ ఫుల్లుగా తాగొచ్చి శృతితో గొడవ పెట్టుకుంటాడు. తన దగ్గర నిజం దాచడంతో తీవ్రంగా నిందిస్తాడు. అలాగే, అంకిత కూడా అభిని తిడుతుంటుంది. దీంతో వీళ్లను కలిపేందుకు తులసి కృష్ణాష్టమి పండుగను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటుంది.

  పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు

  21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  21వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ బాబాయి తులసి గురించి అసలు నిజాలను అతడికి వివరిస్తాడు. దీంతో అతడు చాలా పశ్చాత్తాపపడతాడు. అనంతరం తులసికి డబ్బు సహాయం చేయాలని అనుకుంటాడు. ఇక, ఇంట్లో కృష్ణాష్టమి చేయాలని అనుకుంటోన్న తులసి.. అభిని పిలుద్దామని అంకితతో చెబుతుంది. దీనికి ఆమెను ఒప్పిస్తుంది. మరోవైపు, ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శృతికి వాళ్ల అత్తయ్య సర్ధి చెబుతుంది. అనంతరం సామ్రాట్ తన దగ్గర పని చేసే మనిషితో తులసికి బ్లాంక్ చెక్‌ను పంపుతాడు. అది చూసిన ఆమెకు తీవ్రంగా కోపం వస్తుంది.

  22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


  22వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో... సామ్రాట్ పంపించిన బ్లాంక్ చెక్‌ను తులసి తీసుకెళ్లి ఆయనకు ఇచ్చేస్తుంది. ఆ సమయంలో తులసి అతడికి తన వ్యక్తత్వం ఎలాంటిదో వివరించి చెబుతుంది. అంతేకాదు, మనిషి విలువ డబ్బుతో కాదు.. మంచితనంతో కొలవండి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక, ప్రేమ్.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శృతి కోసం కౌశల్య ఇంటికి వెళ్తాడు. కానీ, అక్కడ ఆమె మాత్రం శృతి తన ఇంటికి రాలేదని చెప్తుంది. దీంతో అతడు నిరాశగా వెనుదిరుగుతాడు. చివర్లో సామ్రాట్.. నందూకు ఓ టాస్క్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమంటాడు.

  తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

  23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  23వ తేదీ శనివారం ప్రాసరం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ వాళ్ల బాబాయి హనీని తీసుకుని తులసి ఇంటికి వస్తాడు. ఆ చిన్నారికి సంగీతం నేర్పించమని అడుగుతాడు. దీనికామె కుదరదు అంటుంది. అప్పుడు ఆయన అభయం ఇవ్వడంతో ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ్.. శృతి కోసం రోడ్ల మీద వెతుకుతూ ఉంటాడు. మరోవైపు, తులసి.. అభికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. దీంతో అతడు రానని అంటాడు. అప్పుడు తులసి.. నువ్వు వచ్చి అంకితతో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకో అంటుంది. గాయత్రి కూడా అదే చెప్పడంతో అభి వెళ్లేందుకు సిద్ధం అవుతాడు.

  English summary
  Intinti Gruhalakshmi July 18th to 23rd Episodes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X