Intinti Gruhalakshmi Weekly Roundup: అతడి ఫ్యామిలీలోకి తులసి.. ఆ ఇద్దరి మధ్య ప్రేమ.. షాక్‌లో నందూ
తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతోన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 25 నుంచి జూలై 30 తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందో చూడండి!

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కొత్త బిజినెస్ ఐడియాలను ప్రోత్సహించేందుకు నందూ, లాస్యకు సామ్రాట్ ఇచ్చిన ప్లాన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. దీనికి తులసి తన మ్యూజిక్ స్కూల్ ఐడియాతో వస్తుంది. ఆమెను అక్కడ చూసి లాస్య వెటకారం ఆడుతుంది. ఆ తర్వాత సామ్రాట్ బాబాయి చూసి పలకరిస్తాడు. అనంతరం సామ్రాట్ వచ్చి తులసి ఐడియాను వివరించమని అడుగుతాడు. ఆమె చెప్పిన ప్లాన్ విన్న వెంటనే పెట్టుబడి పెట్టమని నందూకు ఆర్డర్ వేస్తాడు. ఇక, తులసి ఇంట్లో వాళ్లు సంతోషపడుతోన్నప్పుడే అభి కూడా వస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ మంగళవారం వచ్చిన ఎపిసోడ్‌లో.. తులసి కోరిక మేరకు ఇంటికి తిరిగి వచ్చిన అభి.. అంకితను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ కూడా అక్కడకు చేరుకుంటాడు. అప్పుడతను శృతి గురించి వాళ్లకు అబద్ధం చెప్తాడు. ఇక, సంగీతం నేర్చుకునేందుకు వచ్చిన హనీ.. తనకు కృష్ణుడి వేషం వేయమని తులసికి రిక్వెస్ట్ చేస్తుంది. మరోవైపు, శృతి.. ప్రేమ్ కోసం ఇంటికి వెళ్లగా అతడు కనిపించడు. అప్పుడు వాళ్ల అత్త వచ్చి ఆమె మనసు మార్చి తీసుకెళ్తుంది. ఇక, హనీకి వేషం వేసేందుకు తులసి.. సామ్రాట్ ఇంటికి రాగా.. అక్కడ లాస్య, నందూ ఉంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ బుధవారం ఎపిసోడ్‌లో.. హనీకి డ్యాన్స్ నేర్పించేందుకు తులసిని సామ్రాట్ ఒప్పిస్తాడు. దీంతో ఆమె ఆ పాపకు డ్యాన్స్ నేర్పిస్తూ సామ్రాట్‌పై పడబోతుంది. దీంతో వెంటనే అతడు ఆమెను పట్టుకుంటాడు. అది చూసి నందూ షాక్ అవుతాడు. అప్పుడు అతడిని లాస్య మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే, తులసిని కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో నిందిస్తుంది. ఇక, అంకితను కన్విన్స్ చేసేందుకు అభి ప్రయత్నిస్తాడు. కానీ, ఆమె మాత్రం దానికి సుముఖంగా ఉండదు. దీంతో ప్రేమ్ కూడా అభికి కొన్ని విలువైన సలహాలు ఇస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లక్కీతో తులసి మాట్లాడుతుండగా నందూ, లాస్య వస్తారు. దీంతో సామ్రాట్ తను మీ కొడుకేనా అని అడుగుతాడు. అప్పుడు అవునని అంటారు. ఆ తర్వాత లక్కీ నేనే గెలుస్తా అంటూ సామ్రాట్‌కు షాకిస్తాడు. వాళ్లు వెళ్లిపోగానే లక్కీ మీకెలా తెలుసని సామ్రాట్ తులసిని ప్రశ్నిస్తాడు. కానీ, ఆమె సమాధానం దాటవేస్తుంది. అనంతరం హనీతో కలిసి పెర్ఫార్మెన్స్ చేయాల్సిన టీచర్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక, కాంపిటీషన్ ప్రారంభం కాగానే లక్కీ తన యాక్టింగ్‌తో అదరగొడతాడు. కానీ, హనీ టీచర్ మాత్రం కనిపించదు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో... హనీతో కలిసి పెర్ఫార్మెన్స్ చేయాల్సిన టీచర్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. దీంతో తులసి ఈ విషయాన్ని సామ్రాట్‌కు చెబుతుంది. అప్పుడు అతడు అక్కడ మొత్తం వెతుకుతాడు. కానీ, ఆమె కనిపించదు. దీంతో తులసి వెళ్లి ఆ టీచర్ స్థానంలో హనీతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. దీంతో సామ్రాట్ సంతోషించగా.. నందూ, లాస్య షాక్ అవుతారు. అనంతరం హనీ, లక్కీ విజేతలుగా నిలుస్తారు. అప్పుడు హనీ తనతో పాటు ప్రైజ్ తీసుకునేందుకు తులసిని కూడా స్టేజ్ మీదకు రావాలని కోరడంతో ఆమె కూడా వెళ్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
30వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కాంపిటీషన్‌లో విజయం సాధించిన తర్వాత హనీ ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ల తాతయ్య, తండ్రి సామ్రాట్‌తో ఆనందాన్ని పంచుకుంటుంది. ఆ సమయంలో సామ్రాట్.. తులసి గొప్పదనం గురించి బాబాయితో మాట్లాడతాడు. అనంతరం తులసి ఇంటికి నందూ, లాస్య మ్యూజిక్ స్కూల్ ప్లాన్ తీసుకుని వస్తారు. అప్పుడు వాళ్లను పరందామయ్య, అనసూయ అవమానిస్తారు. తులసి కూడా వింత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతుంది. కానీ, నందూ మాత్రం తులసి చెప్పినట్లు మర్యాద చూపిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

మొత్తంలో హైలైట్ అయింది ఇదే
జూలై 25 నుంచి జూలై 30 తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ కొన్ని మలుపులతో ఆసక్తికరంగానే సాగింది. ఈ వారం మొత్తంలో తులసి.. సామ్రాట్ ఫ్యామిలీకి మరింత దగ్గరైపోయింది. అంతేకాదు, హనీకి, ఆమెకు మధ్య ప్రేమ కూడా చాలా ఎక్కువైంది. అలాగే, తులసిపై సామ్రాట్‌కు కూడా గౌరవం పెరిగిపోయింది. కానీ, నందూ, లాస్యకు మాత్రం ఈ వారం మొత్తంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని చెప్పొచ్చు. వచ్చే వారం తులసి ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











