Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి దిమ్మతిరిగే ప్లాన్.. తులసి కోరిక తీర్చాలని నందూ ప్లాన్.. అంతలోనే!
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!
03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 03వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య తన ప్రేమ గురించి చెప్పగానే తులసి 'చాలామ్మా.. నువ్వు ఏది కోరుకున్నావో.. అదే నీ దగ్గరకు రాబోతుంది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు' అని అంటుంది. తర్వాత లాస్య వాళ్లను పెళ్లి చూపులకు ఒప్పించి రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి చెప్తుంది. దీంతో ఆమె దివ్యపై పగ తీర్చుకుంటానని అంటుంది. ఇక, పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత అంతా మాట్లాడుకుంటారు. అంతేకాదు, రాజ్యలక్ష్మి పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసి చెబుతుంది. దీనికి తులసి వాళ్లు కూడా ఓకే అనేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 04వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి రాజ్యలక్ష్మి, బసవయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పెళ్లి తర్వాత దివ్యకు చుక్కలు చూపిస్తానని రాజ్యలక్ష్మి అంటుంది. ఇవన్నీ చాటుగా విన్న ప్రియ.. దివ్యకు అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. ఇక, పెళ్లి చూపుల తర్వాత తులసి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే దివ్య మా అమ్మ నాన్న పెళ్లి పీటల మీద కూర్చొని నాకు కన్యదానం చేయాలి అని అడుగుతుంది. దీంతో అంతా షాక్ అవుతారు. తర్వాత దివ్యకు హెల్ప్ చేయాలనుకున్న ప్రియకు రాజ్యలక్ష్మి గట్టి వార్నింగ్ ఇస్తుంది.
05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 05వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యను ఎలాగైనా తన కాళ్ల దగ్గర పడేసుకుంటానని రాజ్యలక్ష్మి ప్రియకు చెబుతుంది. దీంతో ఆమె ఎలాగైనా ఈ విషయాన్ని దివ్యకు చెప్పాలని ప్లాన్ చేసుకుంటుంది. ఇక, దివ్య పెళ్లి జరగబోతుండడంతో తులసి ఇంట్లో ఎమోషనల్ సీన్స్ కనిపిస్తాయి. అప్పుడు నందూ.. దివ్య తనను పట్టించుకోవట్లేదని బాధ పడతాడు. దీంతో తన తండ్రి గురించి తెలుసుకున్న దివ్య.. నువ్వే నా రియల్ హీరో అంటుంది. ఇక, తులసి తమ ఇంటికి వస్తే అసలు విషయం చెప్పాలని అనుకున్న ప్రియ ప్లాన్‌ను రాజ్యలక్ష్మి ఫెయిల్ అయ్యేలా చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 06వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌కు రాజ్యలక్ష్మి అసలు ప్లాన్ గురించి చెప్పాలనుకున్న ప్రియ.. అతడికి కాఫీ ఇచ్చి మాట్లాడుతుంది. అప్పుడు విక్రమ్ ఆమెను ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఆ సమయంలోనే అసలు విషయం చెప్తుండగా బసవయ్య వచ్చి అడ్డుకుంటాడు. అనంతరం తులసి ఫ్యామిలీ అంతా పెళ్లి బట్టలు కొనేందుకు షాపింగ్‌కు వెళ్తుంది. అక్కడ పని చేసే వ్యక్తి తులసి, నందూను భార్యభర్తలని అనుకుంటాడు. దీంతో లాస్య అతడిపై ఫైర్ అవుతుంది. ఇక, షాపింగ్‌కు దొంగతనంగా వచ్చిన విక్రమ్.. దివ్యను పక్కకు రమ్మని సైగలు చేస్తుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

07 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 07వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. షాపింగ్ మాల్‌లో దివ్యను కలిసేందుకు విక్రమ్ ట్రయల్ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడికి ఆమెకు బదులు వేరే అమ్మాయి వస్తుంది. చీకట్లో చూసుకోని అతడు ఆమెతో రొమాన్స్ చేస్తాడు. చివర్లో అసలు విషయం తెలిసి షాకై పారిపోతాడు. తర్వాత విక్రమ్‌కు నచ్చినట్లుగానే దివ్యకు చీరలు కొంటారు. ఆ తర్వాత దివ్య, విక్రమ్ ట్రయల్ రూమ్‌లోకి వెళ్లి రొమాన్స్ చేస్తుంటారు. అప్పుడు అనసూయ పిల్లిలా అరవగా దివ్య బయటకు వచ్చి వాళ్లను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత విక్రమ్ కూడా దొంగలా వచ్చి సిగ్గు పడుతూ వెళ్లిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 08వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రియ ముందరే రాజ్యలక్ష్మి.. దివ్యను హింసిస్తానని ఫోన్‌లో మాట్లాడుతుంది. అది విన్న ప్రియ ఆమెను ఏమీ చేయొద్దని బ్రతిమాలుతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'నువ్వు సంజయ్‌కు విడాకులు ఇస్తే దివ్యను వదిలేస్తా' అంటుంది. తులసి కోసం నందూ ఓ చీరను తీసుకొచ్చి ఆమెకు గిప్టుగా ఇస్తాడు. ఆ తర్వాత దివ్యకు విక్రమ్ ఫోన్ చేసి కలుద్దామని అంటాడు. దీనికామె ఒప్పుకోకపోవడంతో గోడ దూకేసి వస్తాడు. దీంతో ఆమె దొంగోడు అనుకుని అరుస్తుంది. తర్వాత ఇంట్లో వాళ్లు విక్రమ్‌ను పట్టుకుంటారు. ఇక, తులసి ఇంటికి ప్రేమ్ వాళ్లు రీఎంట్రీ ఇస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే : ఏప్రిల్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య పెళ్లి గురించి ఏర్పాట్లను జరపడాన్ని చూపించారు. అదే సమయంలో దివ్యపై రాజ్యలక్ష్మి పగ ఎలా తీర్చుకోబోతుంది అన్నది కూడా హైలైట్ చేశారు. అలాగే, విక్రమ్‌కు నిజం చెప్పాలని ప్రియ చేసిన ప్రయత్నాలు కూడా చూపించారు. ఇక, వచ్చే వారంలో తులసి తన తల్లి కావాలని కోరుకోవడంతో నందూ ఆమెను తీసుకు రావడానికి వెళ్లడాన్ని చూపించారు. దీంతో నెక్ట్స్ వీక్ ఎమోషనల్‌గా సాగబోతుంది.


Click it and Unblock the Notifications











