Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్ లవ్ స్టోరీలో ట్విస్ట్.. శత్రువులుగా ప్రేమ జంట.. తులసికి షాక్

తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


20వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను బసవయ్య ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ వెంటనే రాజ్యలక్ష్మి కూడా అతడితో ప్రేమగా మాట్లాడినట్లు నటిస్తూ పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దీంతో అతడు ఓకే అనేస్తాడు. మరోవైపు, తులసి, నందూకు పెళ్లిరోజు పార్టీ జరుగుతుంది. ఇందులో ఇద్దరూ కేక్ కట్ చేసిన తర్వాత నందూ ఆమె కోసం ఓ డైమండ్ నెక్లెస్‌ను గిఫ్టుగా తెచ్చి ఇస్తాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత నందూ తన తప్పులను పరోక్షంగా ప్రస్తావిస్తూ తులసికి సారీ చెప్తాడు. అయినప్పటికీ ఆమె కూడా ఘాటుగానే మాట్లాడి షాకిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


21వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పెళ్లి గురించి దేవుడు వెటకారంగా మాట్లాడడంతో విక్రమ్ తనకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటానని తేల్చి చెబుతాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి కూరగాయలు తెచ్చేందుకు వెళ్లగా.. అక్కడ దివ్య కనిపిస్తుంది. దీంతో ఆమెతో విక్రమ్ మాట్లాడతాడు. ఆ సమయంలోనే భాగ్య వీళ్లిద్దరినీ చూసి తన ఫోన్‌లో ఫొటోలు తీసుకుంటుంది. ఇక, తులసికి జ్వరం రావడంతో నందూ చలించిపోతాడు. ఆమెకు సపర్యలు చేయడంతో పాటు సూప్‌ను తయారు చేసి ఇస్తాడు. దీంతో లాస్య అదంతా చూసి తెగ కుళ్లుకుంటూ కెఫేకు ఒంటరిగా వెళ్లిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


22వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యను విక్రమ్ తన కారులో తీసుకు వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ సమయంలో గాయపడిన కుర్రాడికి విక్రమ్‌ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు. అంతేకాదు, ప్రేమ గురించి కూడా సరైన అర్థాలను చెబుతాడు. దీంతో దివ్య ఫ్లాట్ అయిపోతుంది. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత దివ్య తన తల్లిదండ్రులు క్లోజ్‌గా ఉండడం చూసి ఎంతగానో సంతోష పడుతుంది. దివ్య తాను పని చేస్తున్న ఆస్పత్రిలో ఓ పేషెంట్ కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారని తెలుసుకుని.. రాజ్యలక్ష్మికి విషయం చెప్తుంది. అలాగే, బాధితులకు డబ్బు ఇప్పిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


23వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసికి ఎందుకు దగ్గర అవుతున్నావని నందూను లాస్య సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో తాను ఇష్టం లేకున్నా వాసుదేవ్ కోసం యాక్టింగ్ చేస్తున్నానని చెప్తాడు. ఇక, దివ్యపై సంజయ్, రాజ్యలక్ష్మి కోపంగా ఉంటారు. ఆ సమయంలోనే విక్రమ్ వచ్చి ఆ అమ్మాయి ఎవరో తెలియక ఉద్యోగం నుంచి తీసేయమంటాడు. అనంతరం దివ్యతో కలిసి వెళ్తుండగా రౌడీలు వస్తారు. దీంతో వాళ్లందరినీ విక్రమ్ కొట్టేస్తాడు. ఇక, లాస్య అడగడంతో విక్రమ్ గురించి మొత్తం వివరాలను తెలుసుకున్న భాగ్య.. ఫోన్ చేసి మరీ అతడి బ్యాగ్రౌండ్ చెప్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

24 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

24 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


24వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి నిద్ర లేవగానే నందూ పక్కన పడుకుని కనిపిస్తాడు. దీంతో ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఫైల్స్ గురించి టెన్షన్ పడుతుండగా.. వాసుదేవ్ వచ్చి అవన్నీ నందూ కంప్లీట్ చేసేశాడని చెబుతాడు. మరోవైపు, దివ్య మాత్రం విక్రమ్ ఆలోచనలోనే ఉండి అతడి మెసేజ్ చేస్తుంది. కానీ, అప్పుడే రాజ్యలక్ష్మి వచ్చి రెండు రోజులు మామిడి తోటకు వెళ్లమంటుంది. దీంతో కావాలనే విక్రమ్.. దివ్యను దూరం పెడతాడు. ఇక, ఆస్పత్రిలో నర్స్ దివ్య దగ్గరకు వచ్చి సంజయ్ చేసిన మోసం గురించి వివరిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


25వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రియ ద్వారా సంజయ్ నిజస్వరూపం తెలుసుకున్న దివ్య.. వాళ్లను పబ్లిక్‌లో పెట్టాలని డిసైడ్ అయిపోతుంది. అందుకు తగ్గట్లుగానే ఆస్పత్రి ముందు టెంట్ వేసి మరీ ధర్నాకు దిగుతుంది. ఇది చూసి దేవుడు టెన్షన్ పడుతాడు. అప్పుడే విక్రమ్ అతడికి ఫోన్ చేసి దివ్య గురించి అడగ్గా.. ఏమీ ఆలోచించకుండా ఉండమని చెప్తాడు. మరోవైపు, బిజినెస్ డీల్‌పై సంతకం చేసి ఇచ్చిన వాసుదేవ్‌కు నిజం చెప్పాలని నందూ అనుకుంటాడు. అందుకు తగ్గట్లుగానే తులసితో విడాకులు, డీల్ కోసం నాటకం ఇవన్నీ అతడికి చెప్పేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


మార్చి 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో నందూ, తులసి భార్యభర్తలుగా యాక్టింగ్ చేయడాన్ని బాగా హైలైట్ చేశారు. అయితే, ఈ నాటకానికి శనివారంతో ముగింపు వేసేశారు. ఇక, రాజ్యలక్ష్మి, సంజయ మీద దివ్య పోరాటం చేయడం ఈ వారం కథను మరింత రసవత్తరంగా మార్చింది. వచ్చే వారంలో దివ్య వాళ్లకు బుద్ధి చెప్పే సన్నివేశాలను చూపించబోతున్నారు. దీంతో విక్రమ్ సహా వాళ్లకు దివ్య శత్రువులా మారబోతున్నట్లు అర్థం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X