Intinti Gruhalakshmi Serial Weekly Roundup: ఆ అమ్మాయి ఎంట్రీతో ట్విస్ట్.. నందూకు తెలిసిన నిజమేంటో తెలుసా?
తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది.
దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 10వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య పెళ్లి సందర్భంగా తులసి ఇంటికి ప్రేమ్, మాధవి వాళ్లు వస్తారు. వాళ్లను చూసిన తర్వాత అందరూ సంతోషిస్తారు. కానీ, తులసి మాత్రం తన పుట్టింటి వాళ్లు ఎవరూ రాలేదని బాధ పడుతూ ఉంటుంది.
అది తెలుసుకున్న నందూ ఆమె కోరికను ఎలాగైనా తీర్చాలని డిసైడ్ అయిపోతాడు. అందుకోసం ఏకంగా తులసి వాళ్ల అమ్మగారి ఇంటికి వెళ్లిపోతాడు. అక్కడ వాళ్లు అవమానించేలా మాట్లాడినా మౌనంగా ఉంటాడు. ఆఖరికి తాను తులసి విషయంలో తప్పు చేశానని ఒప్పుకుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 11వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి అమ్మగారి ఇంటికి వెళ్లిన నందూ.. తనను క్షమించమని వేడుకుంటాడు. తులసి విషయంలో ఎన్నో తప్పులు చేశానని ఒప్పుకుంటాడు. ఏడుస్తూ వేడుకుంటూ వాళ్లను తనతో వచ్చేందుకు ఒప్పిస్తాడు.
ఇక, దివ్య కోసం విక్రమ్ కొరియర్ పంపించగా.. అందులో ఉన్న లెటర్ చూసి ప్రేమ్ చదువుతూ ఆమెను ఏడిపిస్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు. అనంతరం.. తులసి తల్లి, తమ్ముడిని నందూ ఇంటికి తీసుకు వస్తాడు. అది చూసి తులసి ఎంతగానో సంతోషిస్తుంది. దీంతో అందరూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 12వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ అందరి ముందు నలుగు పెట్టించుకోడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి నీ పెళ్లి గ్రాండ్‌గా చేయడం లేదు అనగా.. తనకు కూడా ఇలాగే చేసుకోవడం ఇష్టం అంటాడు.
మరోవైపు, దివ్యను కూడా పెళ్లి కూతురుని చేస్తారు. అప్పుడు ఆమెకు బట్టలు పెట్టడానికి మాధవి వాళ్లు రాగా.. వాళ్లను ఆపి దీపక్ వాళ్లతో పెట్టిస్తాడు నందూ. అది చూసి తులసి సంతోషిస్తుంది. అనంతరం దివ్య, తులసి మధ్య ఎమోషనల్ మాటలు కనిపిస్తాయి. చివర్లో దివ్యకు విక్రమ్ వీడియో కాల్ చేయగా.. అతడి మాటలను అందరూ వినేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 13వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ అందరి ముందు నలుగు పెట్టించుకోడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి నీ పెళ్లి గ్రాండ్‌గా చేయడం లేదు అనగా.. తనకు కూడా ఇలాగే చేసుకోవడం ఇష్టం అంటాడు. మరోవైపు, దివ్యను కూడా పెళ్లి కూతురుని చేస్తారు.
అప్పుడు ఆమెకు బట్టలు పెట్టడానికి మాధవి వాళ్లు రాగా.. వాళ్లను ఆపి దీపక్ వాళ్లతో పెట్టిస్తాడు నందూ. అది చూసి తులసి సంతోషిస్తుంది. అనంతరం దివ్య, తులసి మధ్య ఎమోషనల్ మాటలు కనిపిస్తాయి. చివర్లో దివ్యకు విక్రమ్ వీడియో కాల్ చేయగా.. అతడి మాటలను అందరూ వినేస్తారు.

14 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 14వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బసవయ్య రెచ్చగొట్టడంతో విక్రమ్ నా జీవితంలోకి ఎవరు వచ్చినా అమ్మ స్థానం తర్వాతే. నాకు అమ్మ మాట తర్వాతే ఏదైనా అంటాడు. ఆ తర్వాత విక్రమ్ తండ్రి దగ్గరకు వెళ్లగా ఆయన ఎమోషనల్ అవుతాడు. మరోవైపు నందూ.. దివ్యను చూసి ఎమోషనల్ అవగా.. ఆమె కూడా ఏడ్చేస్తుంది.
అలా పెళ్లి ఇంట్లో అందరూ ఈ సీన్స్ చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. ఇక, ప్రియ ఎలాగైనా ఫోన్ చేసి దివ్యకు అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. అంతలోనే రాజ్యలక్ష్మి అక్కడకు వచ్చి ఆమెను బంధించాలని అనుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 15వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రియను ఒక గదిలో బంధించిన రాజ్యలక్ష్మి.. ఆమెకు ఎవరూ సహాయం చేయొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరోవైపు, తులసి వాళ్ల ఇంట్లో పెళ్లి హడావిడి కనిపిస్తుంది. అందరూ కలిసి కల్యాణ మండపానికి చేరుకుంటారు.
ఆ సమయంలో లాస్య, రాజ్యలక్ష్మితో క్లోజ్‌గా ఉండడంతో నందూకు అనుమానం వస్తుంది. ఇక, పనిమనుషులను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసిన ప్రియ.. ఇంట్లో నుంచి తప్పించుకుని వస్తుంది. పెళ్లికి ముందే విక్రమ్, దివ్య కోసం ఆరాటపడుతూ అందరిలో నవ్వులు పూయిస్తుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: ఏప్రిల్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య పెళ్లి ఏర్పాట్లను బాగా హైలైట్ చేశారు. అదే సమయంలో దివ్య వాళ్లకు నిజం చెప్పాలని ప్రియ చేసిన ప్రయత్నాలు కూడా చూపించారు.
మొత్తానికి ఈ వారం దివ్య, విక్రమ్‌ను పెళ్లి పీటలు అయితే ఎక్కించేశారు. కానీ, వచ్చే వారం మాత్రం ప్రియ వచ్చి నందూతో అసలు విషయం చెప్పడం.. ఆయన పెళ్లి ఆపేందుకు పరిగెత్తుకుంటూ రావడం ప్రోమోలో చూపించారు. దీంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారబోతుంది.


Click it and Unblock the Notifications











