Intinti Gruhalakshmi: ఫస్ట్ నైట్ జరగకుండా ప్లాన్.. విక్రమ్, దివ్య రొమాన్స్.. రాజ్యలక్ష్మికి షాక్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
17వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్ పెళ్లి పీటల మీద ఉన్న సమయంలోనే కన్యాదానం చేయడానికి నందూను రమ్మని పిలుస్తారు. కానీ, దానికి లాస్య ఒప్పుకోదు. పైగా నందూను తులసితో పంపించనని మొండిపట్టు పడుతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి కూడా తనకు మంచే జరుగుతుంది అనుకుంటుంది. అంతలోనే దివ్య మా అమ్మనాన్న కన్యాదానం చేయకపోతే పెళ్లి చేసుకోనని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో రాజ్యలక్ష్మి వెళ్లి లాస్యను బెదిరిస్తుంది. దీంతో చేసేందేంలేక లాస్య.. నందూను పంపిస్తుంది. ఆ తర్వాత ప్రియ కూడా కల్యాణ మండపం దగ్గరకు వస్తుంది.

 intintigruhalakshmi

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
18వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యపై పగ తీర్చుకునేందుకు రాజ్యలక్ష్మి వేసిన ప్లాన్ గురించి ప్రియ.. నందూకు చెబుతుంది. దీంతో అతడు పెళ్లిని ఆపేందుకు ప్రయత్నం చేయగా.. అది విఫలం అవుతుంది. అంటే అప్పటికే దివ్య మెడలో విక్రమ్ తాళి కట్టేస్తాడు. అది చూసి నందూ చాలా బాధ పడతాడు. అంతేకాదు, తన మనసులోనే కూతురి భవిష్యత్ గురించి చింతిస్తూ ఉంటాడు. ఆ తర్వాత విక్రమ్‌తో తన కూతురిని మంచిగా చూసుకుంటానని ప్రామిస్ చేయమంటాడు. అయితే, అప్పుడు రాజ్యలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేయడంతో నందూ వెనక్కి తగ్గుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 intintigruhalakshmi

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

19వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య పరిస్థితిని తలుచుకుంటూ నందూ వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరూ ప్రియ, విక్రమ్ ఫస్ట్ నైట్‌కు ముహూర్తం పెడుతూ ఉంటారు. ఆ సమయంలో నందూ అక్కడకు రావడంతో మాట్లాడిస్తారు. కానీ, అతడు మాత్రం మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత తులసి, నందూ కలిసి రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక, ఇంట్లోకి వెళ్లే సమయంలో విక్రమ్‌ను ఇరికించాలని బసవయ్య అనుకుంటాడు. ఆ తర్వాత తన తండ్రి దగ్గరకు దివ్యను విక్రమ్ తీసుకెళ్లగా.. ఆయన సంతోషిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 intintigruhalakshmi

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మామను చూడగానే దివ్య చలించిపోతుంది. అంతేకాదు, ఇకపై ఆయన బాధ్యతను తాను తీసుకుంటానని విక్రమ్‌కు తేల్చి చెబుతుంది. అనంతరం లాస్య.. రాజ్యలక్ష్మితో మాట్లాడడం చూసి నందూ సందేహిస్తాడు. కానీ, ఆమె అబద్ధాలు చెబుతుంది. ఆ తర్వాత నందూ, తులసి.. రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లి.. ఫస్ట్ నైట్ కోసం దివ్య, విక్రమ్‌ను పంపించమని అడుగుతారు. కానీ, దీనికి రాజ్యలక్ష్మి ఒప్పుకోదు. దీంతో వాళ్లకు అవమానం జరుగుతుంది. అంతేకాదు, మగ పెళ్లి వాళ్ళ పద్ధతులు ఏవైతే అవే ఫాలో అవ్వాలి అంటూ గట్టిగానే డిమాండ్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 intintigruhalakshmi

21 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
21వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మా ఆచారం ప్రకారం ఫస్ట్ నైట్ మగ పెళ్లి వాళ్ల ఇంట్లోనే జరగాలని రాజ్యలక్ష్మి తేల్చడంతో తులసి, నందూ ఓకే అంటారు. తర్వాత దివ్యను పిలవమని అడగ్గా తను పడుకుంది అంటారు. దీంతో తులసి వాళ్లు బాధగా వెళ్లిపోతారు. తర్వాత దివ్యకు ప్రియ నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ, అంతలోనే తులసి వాళ్లు వచ్చినట్లు దేవుడు దివ్యకు చెప్తాడు. అప్పుడామె వెళ్లగా వాళ్లు వెళ్లిపోయారని చెప్తారు. ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పడంతో అంతా బాధ పడతారు. రాజ్యలక్ష్మి మాత్రం ఫస్ట్ నైట్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య పెళ్లి అయిపోవడంతో ప్రేమ్ దంపతులు వాళ్ళ ఊరు బయలుదేరడానికి రెడీ అవుతారు. ఆ సమయంలో అందరూ ఎమోషనల్ అవుతుంటారు. అప్పుడు తులసిని మంచిగా చూసుకుంటానని నందూ ప్రేమ్‌కు హామీ ఇస్తాడు. తనను కలవకుండా వెళ్లారని దివ్య ఫోన్ చేయగా.. ఆమెకు రాజ్యలక్ష్మి అబద్దం చెప్పిందని అర్థం అవుతుంది. ఇక, విక్రమ్ కనిపించకపోయే సరికి రాజ్యలక్ష్మి టెన్షన్ పడుతుంటుంది. అతడు రాగానే ఊపిరి పీల్చుకున్న ఆమె.. ఫస్ట్ నైట్ వాయిదా వేసినట్లు చెప్పి విక్రమ్‌కు షాక్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

intinti-gruhalakshmi

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఏప్రిల్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య, విక్రమ్ పెళ్లిని బాగా హైలైట్ చేశారు. అదే సమయంలో నందూకు రాజ్యలక్ష్మి పగ తీర్చుకోవాలనుకున్న నిజం తెలిసింది. దీంతో ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. ఇక, విక్రమ్, దివ్యల ఫస్ట్ నైట్ జరగకుండా చేయాలని రాజ్యలక్ష్మి ప్లాన్ చేసుకుంటుంది. అందుకు అనుగుణంగానే వ్రతం అంటూ నాటకం ఆడుతుంది. కానీ, వాళ్లిద్దరూ క్లోజ్ అవడాన్ని కొత్త ప్రోమోలో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X