Intinti Gruhalakshmi: తులసికి తెలిసిన నిజం.. మామ కోసం దివ్య పోరాటం.. రాజ్యలక్ష్మితో గొడవ పడడంతో!
తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!
24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 24వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి టెన్షన్ పడుతున్న నందూకు తులసి ధైర్యం చెబుతుంది. అప్పుడతను కూతురి మీద ప్రేమను బయట పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ లేకపోవడంతో బాధ పడుతున్న విక్రమ్‌ను వాళ్ల తాతయ్య రెచ్చగొడతాడు. దీంతో విక్రమ్ నేరుగా వెళ్లి దివ్య గదిలో దూరుతాడు. అప్పుడామె బలవంతంగా అతడిని బయటకు పంపిస్తుంది. ఇక, దివ్య, విక్రమ్‌ను కలవకుండా చేయాలని రాజ్యలక్ష్మి అనుకుంటూ ఉండగానే.. వాళ్లిద్దరూ చిలిపి పనులు చేస్తూ ఉంటారు. ఇక, చివర్లో రాజ్యలక్ష్మి వ్రతం పనులు మొత్తం దివ్యకు అప్పగిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 25వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్ క్లోజ్‌గా ఉండడంతో తట్టుకోలేకపోయిన రాజ్యలక్ష్మి వాళ్లను పిలిచి క్లాస్ పీకుతుంది. అంతేకాదు, దివ్యను వెళ్లి తలస్నానం చేసి రమ్మంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి దివ్య ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతారు. ఆ సమయంలో లాస్య వస్తానన్న వాళ్లంతా వద్దని చెబుతుంది. దీంతో ఆమెకు కోపం వస్తుంది. ఆ వెంటనే రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి.. ఇంటికి వచ్చిన నందూ వాళ్లను అవమానించమని చెబుతుంది. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరించేలా లాస్య మాట్లాడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 26వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వ్రతం చేయడానికి సమయం దగ్గర పడినా తులసి వాళ్లు రారు. దీంతో బసవయ్య భార్య దివ్యను దెప్పిపొడుస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత దివ్య కంగారులో దీపం కూడా సరిగా వెలిగించలేదు. అప్పుడే అక్కడకు తులసి వాళ్లు వస్తారు. వాళ్లను చూసి దివ్య ఏడుస్తుంది. పనులు చేయడం రావట్లేదు అంటుంది. ఇక, వ్రతం పూర్తైన తర్వాత దివ్య, విక్రమ్.. తులసి, నందూకు నమస్కరించబోతుండగా బసవయ్య అవమానిస్తాడు. దీంతో విక్రమ్ అతడిపై సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఈ విషయమై తులసి వాళ్లకు రాజ్యలక్ష్మి క్షమాపణలు చెప్తుంది.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 27వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఫస్ట్ నైట్‌కు ముహూర్తాలు లేకపోయినా చేయాలా అని రాజ్యలక్ష్మి ప్రశ్నించగా.. ఓకే అంటూ నందూ ఆమెకు షాకిస్తాడు. కానీ, తులసి అతడిని సముదాయించడంతో కామ్ అవుతాడు. ఆ తర్వాత దివ్యను రెచ్చగొట్టాలని రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. కానీ, ఆమె మాత్రం వాళ్లు ఊహించని విధంగా చేసి మన్ననలు పొందుతుంది. ఇక, ఇంటికి వెళ్తోన్న సమయంలో అనసూయకు కూడా రాజ్యలక్ష్మి వ్యవహార శైలిపై డౌట్ వస్తుంది. ఆ సమయంలో నందూ ఏదో ఆలోచిస్తూ యాక్సిడెంట్ చేయబోతుంది. దీంతో అంతా భయపడిపోతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

28 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 28వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి డ్యూటీకి వెళ్తానన్న దివ్యను రాజ్యలక్ష్మి వద్దంటుంది. అంతేకాదు, ఇంట్లో అందరితో సరదాగా తిరుగుతూ ఉండమంటుంది. అలాగే, వంట కూడా చేయమని సలహా ఇస్తుంది. దీంతో దివ్య తల్లికి ఫోన్ చేసి ఆమె సహాయంతో గుత్తి వంకాయ కూరను వండుతుంది. ఇక, నందూ తీరుపై తులసికి సందేహం వస్తుంది. కానీ, అతడు నిజం చెప్పడు. అలాగే, లాస్య అతడి దగ్గరకు రాగా.. పది లక్షల రూపాయలు కావాలని అడుగుతాడు. దీంతో గతంలో ఆ డబ్బును ఆమె వాడుకున్నది గుర్తు చేసుకుని.. రాజ్యలక్ష్మి దగ్గర తీసుకోవాలనుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 29వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌తో జీవితాంతం సంతోషంగా ఉంటానన్న దివ్యను చూసి ప్రియ జాలి పడుతుంది. ఆ తర్వాత మామగారికి అన్నం తినిపించడానికి వెళ్లగా.. రాజ్యలక్ష్మికి భయపడి ఆయన దివ్యపై కోప్పడతాడు. ఇక, లాస్య డబ్బు కోసం రాజ్యలక్ష్మి ఆస్పత్రికి వెళ్తుంది. ఆమెను చూసి తులసి, రాములమ్మ వెంటపడతారు. అప్పుడు డబ్బు తీసుకునేది కళ్లారా చూస్తారు. ఇక, దివ్య వండిన గుత్తి వంకాయ కూర చేదుగా ఉండడంతో విక్రమ్ షాక్ అవుతాడు. చివర్లో మామగారికి మంచి చేయడం గురించి దివ్య.. విక్రమ్‌తో మాట్లాడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే : ఏప్రిల్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ వాయిదా వేయడాన్ని చూపించారు. అలాగే, లాస్యను నందూ డబ్బులు అడగడం.. వాటి కోసం ఆమె రాజ్యలక్ష్మి దగ్గరకు రావడం.. చివరకు మనీ తీసుకుంటూ ఉండగా తులసి చూడడాన్ని హైలైట్ చేసి చూపించారు. దీంతో వచ్చే వారం ఎపిసోడ్లలో లాస్యను, రాజ్యలక్ష్మిని తులసి వాళ్లు నిలదీయబోతున్నారు. ఇదే విషయాన్ని ప్రోమోలో కూడా చూపించారు. దీంతో ఇది ఆసక్తికరంగా మారనుంది.


Click it and Unblock the Notifications











