Intinti Gruhalakshmi: లక్కీ ట్విస్టుతో లాస్యకు షాక్.. దివ్యకు విక్రమ్ కిస్.. ఆమెకు నిజం తెలుస్తుందా?
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!
14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:14వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు తండ్రి లేడని ఫ్రెండ్ అన్న మాటలను గుర్తు చేసుకున్న లక్కీ.. హాస్టల్ నుంచి పారిపోతాడు. ఈ విషయాన్ని వార్డెన్ లాస్యకు ఫోన్ చేసి చెప్తుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. లక్కీ హాస్టల్ నుంచి నేరుగా తులసి ఇంటికి వెళ్తాడు. అక్కడ నందూను పట్టుకుని ఈ డాడీనే కావాలి.. ఇక్కడే ఉంటా అంటాడు. నందూ ఎంత చెప్పినా ఆ బుడ్డోడు వినడు. అప్పుడు లాస్యకు నందూ ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆమె వచ్చి తులసిపై నిందలు వేస్తుంది. దీంతో తులసి ఆమెకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది.

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:15వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి వాళ్లపై నిందలు వేస్తూ చివరకు లక్కీని తీసుకుని లాస్య ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత విక్రమ్ తండ్రి ప్రకాశానికి క్లీన్ షేవ్ చేసి దివ్య బయటకు తీసుకు వస్తుంది. దీంతో విక్రమ్ తన తండ్రిని చూసి సంతోషిస్తాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి, ప్రకాశానికి అన్నం తినిపించేలా దివ్య ప్లాన్ చేసి ఇరికిస్తుంది. ఇదంతా చూసిన విక్రమ్ దివ్యకు థ్యాంక్స్ చెప్పానుకుని ఆగిపోతాడు. ఇక, లక్కీ విషయంలో తులసి, లాస్య మధ్య ఫోన్‌లో వాదన జరుగుతుంది. అప్పుడు నందూను మళ్లీ ఇచ్చేస్తావా అని లాస్య అడుగుతుంది.
16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:16వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య.. విక్రమ్‌ను రెచ్చగొడుతూ ఉండగా బసవయ్య చూసి రాజ్యలక్ష్మి వాళ్లకు చెప్తాడు. దీంతో ఎలాగైనా దివ్యకు చెక్ పెట్టాలని వాళ్లు అనుకుంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి 'లక్కీని అడ్డు పెట్టుకుని నందూకు దగ్గరై తులసికి షాక్ ఇవ్వు' అని లాస్యకు ప్లాన్ చెప్తుంది. అందుకు అనుగుణంగానే లాస్య వెళ్లి లక్కీకి ప్లాన్‌ను వివరిస్తుంది. దీంతో ఆ పిల్లాడు తప్పక ఒప్పుకుంటాడు. ఇక, ప్రకాశాన్ని తీసుకొచ్చి రాజ్యలక్ష్మికి దివ్య మరో షాక్ ఇస్తుంది. తర్వాత లాస్య కారులో లక్కీని తీసుకుని వెళ్లి తులసి వాళ్ల ఇంట్లోకి ఎవరూ చూడకుండా పంపుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:17వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్లాన్ ప్రకారం లక్కీని తీసుకొచ్చి తులసి వాళ్ల ఇంట్లో వదిలిన లాస్య.. ఆ తర్వాత తులసికి ఫోన్ చేసి నాటకం ఆడుతుంది. అది నిజమే అని నమ్మిన తులసి చాలా బాధ పడిపోతుంది. ఇక, అత్తకు ఎలాగైనా బుద్ది చెప్పాలని భావించిన దివ్య.. ప్రియ సహాయంతో ఆమె కింద పడిపోయేలా చేస్తుంది. తర్వాత వారం రోజుల పాటు రెస్ట్ తీసుకునేలా చేసి.. ఆస్పత్రి బాధ్యతలను విక్రమ్‌కు అప్పగించేలా చేస్తుంది. ఇక, తులసి ఇంట్లోనే ఉన్న లక్కీ దొంగతనంగా చిలిపి పనులు చేస్తుంటాడు. అది తెలియని నందూ వాళ్లు అయోమయంగా ఉంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

18 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:18వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్లాన్ ప్రకారం లక్కీని తులసి వాళ్ల ఇంటికి పంపిన లాస్య.. ఆ తర్వాత పోలీసులను తీసుకు వచ్చి నందూ వాళ్లే కిడ్నాప్ చేశారని అంటుంది. అప్పుడే లక్కీ ఇంట్లో కనిపిస్తాడు. దీంతో నందూనే తన కొడుకును తీసుకు వచ్చాడని అంటుంది. తర్వాత అందరూ ఇదే నమ్ముతారు. ఇక, ఆస్పత్రితో విక్రమ్, దివ్య కలిసి తన పరువు తీస్తున్నారని సంజయ్ తన తల్లికి చెప్తాడు. ఆ తర్వాత ప్రకాశం వచ్చి విక్రమ్ ఆస్పత్రికి వెళ్లినప్పటి నుంచి ఉత్సాహంగా కనిపిస్తున్నాడని అంటాడు. తర్వాత రాజ్యలక్ష్మి దగ్గర ఉన్న తాళాలను ఇవ్వమని అంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:19వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బీరువాలకు సంబంధించిన తాళాలను రాజ్యలక్ష్మి దగ్గర నుంచి తీసుకున్న ప్రకాశం వాటిని దివ్యకు అందజేస్తాడు. దీంతో ఆమె అత్త ముందే పనిమనిషికి డబ్బులు ఇచ్చేస్తుంది. ఇక, తులసి ఇంట్లో ఉన్న లక్కీకి ఫోన్ చేసిన లాస్య.. ఇంకో ప్లాన్ అమలు చేయమని చెప్తుంది. కానీ, దానికి ఆ బుడ్డోడు ఒప్పుకోడు. అసలు లక్కీ ఇంట్లోకి ఎలా వచ్చాడో తెలుసుకోవడం కోసం నందూ మంచిగా ఉన్నట్లు నటిస్తూ తనతో ఎవరో అబద్ధం చెప్పించారని తెలుసుకుంటాడు. అది చూసి అపార్థం చేసుకున్న తులసి.. నందూకు ఓ రేంజ్‌లో క్లాప్ పీకుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:ఆగస్టు 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో రాజ్యలక్ష్మికి బుద్ది చెప్పేందుకు దివ్య ప్లాన్ చేయడాన్ని హైలైట్ చేశారు. అలాగే, లక్కీని నందూకు దగ్గర చేసేందుకు లాస్య వేసిన ప్లాన్‌ను సైతం చూపించారు. ఈ రెండు అంశాలతో ఈ వారం సీరియల్ రంజుగానే సాగింది. ఇక, వచ్చే వారంలో విక్రమ్.. దివ్యకు ఫిదా అయిపోవడం.. ఆమెకు ముద్దుపెట్టి మరింత దగ్గర అవడం చూపించబోతున్నారు. దీంతో ఇకపై సీరియల్ మరింత జనరంజకంగా మారే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











