Intinti Gruhalakshmi: లాస్య మరో కన్నింగ్ ప్లాన్.. దివ్య దిమ్మతిరిగే వ్యూహం.. కథలో సూపర్ ట్విస్టులు
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.
తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 21వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య కొట్టిన దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చిన లాస్య 'ఆ తులసి నా జీవితంతో ఆడుకుంటుంది. నా కొడుకును నా మాట వినకుండా చేస్తుంది' అని చెప్తుంది. దీంతో బసవయ్య కూడా తన అక్క గురించి చెప్తాడు. ఆ సమయంలో లాస్యకు, బసవయ్యకు మధ్య వాగ్వాదం జరగడంతో ఆమె మళ్లీ రానని చెప్పి వెళ్లిపోతుంది. ఇక, లక్కీ ద్వారా నందూ ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసిన లాస్య.. అతడికి ఫోన్ చేసి బ్రతిమాలినా ఒప్పుకోడు. ఆ తర్వాత లక్కీని తోసేయగా.. తలుపుకు తగలడంతో గాయపడతాడు.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 22వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ నెట్టేయడంతో కింద పడి గాయపడిన లక్కీకి తులసి గోరుముద్దలు పెడుతూ.. అసలేమైందో అడుగుతుంది. ఆ చిన్నారి నందూ తప్పు లేదని చెప్తాడు. అయినా తులసి మాత్రం నందూనే తిడుతుంది. ఇదంతా చూస్తున్న నందూను పరందామయ్య వాళ్లు పిలిచి క్లాస్ పీకడంతో పాటు తులసిని లైన్‌లో పెట్టమని చెప్తారు. ఇక, క్యాంటీన్‌లో ఉన్న తులసిని కలిసి ఓ నర్స్ తన కొడుకు ఆపరేషన్ గురించి చెప్తుంది. అప్పుడామె ఈ విషయాన్ని దివ్యకు చెప్పి ఓ ప్లాన్ కూడా వివరిస్తుంది. దీంతో దివ్య ఇంట్లో దాన్ని అమలు చేయబోతుంది.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 23వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మామ ప్రకాశాన్ని నడిపించడానికి దివ్య ప్రయత్నాలు చేస్తుంటుంది. తర్వాత రాజ్యలక్ష్మితో పాటు సంజయ్‌ను కూడా ఆస్పత్రికి రాకుండా చేయాలని ప్లాన్ చేసిన దివ్య.. అత్త పక్కన పూల కుండీ పడేలా చేస్తుంది. ఆ తర్వాత పంతులును పిలిపించి.. రాజ్యలక్ష్మికి ప్రాణగండం ఉందని ఆయనతో చెప్పిస్తుంది. అదే సమయంలో తల్లి ఆరోగ్యంగా ఉండడం కోసం సంజయ్ 101 రోజుల పాటు పూజలు చేయాలని కూడా పూజారి చెప్పేలా చేస్తుంది. దీంతో విక్రమ్ కూడా ఆయన మాటలు నమ్మి తమ్ముడితో పూజలు చేయాలని ఒప్పిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 24వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసితో లక్కీ ఏడుస్తూ తనకు డాడీ కావాలి అంటూ ఏడుస్తాడు. అప్పుడు నందూ గురించి చెడుగా చెప్పినా లక్కీ మాత్రం వినిపించుకోడు. ఆ తర్వాత నందూ వచ్చి లక్కీ వల్ల మన మధ్య దూరం పెరుగుతుందని తులసితో అంటాడు. దీంతో ఆమె అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. తర్వాత సంజయ్‌తో విక్రమ్ వాళ్లు దోష నివారణ చేయిస్తారు. అనంతరం అతడు అన్నం తింటుండుగా దివ్య వచ్చి ప్లేట్ లాక్కుంటుంది. అంతేకాదు, అతడిని కింద కూర్చుని తినాలని చెప్తుంది. దీంతో సంజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో అదే చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
25 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 25వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రాజ్యలక్ష్మికి వరుస షాక్‌లు ఇస్తున్న దివ్య.. 101 రోజులు పూర్తయ్యే సరికి ఎవరికీ కాకుండా పోతావు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత లాస్య.. తులసి వాళ్ల ఇంటికి వెళ్తుంది. లక్కీ కోసం వచ్చానని నాటకం ఆడుతుంది. కానీ, ఆ చిన్నారి మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోమంటూ తల్లికి షాక్ ఇస్తాడు. మరోవైపు, సంజయ్ తల్లి కోసం కష్టపడడం చూసిన విక్రమ్ బాధ పడుతుంటాడు. అప్పుడు దివ్య మాత్రం అతడిని ఓదార్చుతుంది. ఆ తర్వాత విక్రమ్‌ను కోటు వేసుకోమని దివ్య అడగ్గా.. అతడు మాత్రం ఆమె మాటలను అస్సలు వినిపించుకోడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 26వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రి బాధ్యతలు తీసుకోవాలని విక్రమ్‌ను దివ్య ఎంత రెచ్చగొట్టినా అతడు మాత్రం ఒప్పుకోడు. పైగా దివ్యనే ఆస్పత్రి వ్యవహారాలను చూసుకోమని చెప్తాడు. అంతేకాదు, తల్లి సలహాలు కూడా తీసుకోవాలని సూచిస్తాడు. ఇక, రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చిన లాస్య దివ్యను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తానని అంటుంది. దీంతో తులసి ఇంట్లోకి వెళ్లి ఆమెను దెబ్బకొడతానని చెప్తుంది. ఇక, తులసి, నందూ కలిసి గుడికి వస్తారు. అక్కడ పంతులు ఇద్దరూ భార్యభర్తలు అని పొరబడతాడు. దీంతో నందూ తెగ సంతోషిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: ఆగస్టు 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో రాజ్యలక్ష్మికి బుద్ది చెప్పేందుకు దివ్య ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమె కాళ్లకు గాయం చేసి ఇంట్లో కూర్చోబెడుతుంది. ప్లాన్ ప్రకారం నందూ ఇంట్లోకి వచ్చిన లక్కీ.. లాస్యకు దూరం అవుతూ అతడికి దగ్గరవ్వాలని అనుకుంటాడు. నందూ మాత్రం తులసిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాడు. మొత్తానికి ఈ వారం అంతా దివ్య డామినేషన్‌నే చూపించారు. వచ్చే వారం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది.


Click it and Unblock the Notifications











