Intinti Gruhalakshmi: ఆమెకు అనుకోని ప్రమాదం.. తులసి, దివ్య దూరం.. లాస్య మాస్టర్ ప్లాన్‌తో ట్విస్ట్

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:28వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ ఎలాగోలా ఆస్పత్రికి వెళ్లేలా దివ్య ఒప్పిస్తుంది. అంతేకాదు, అతడు సూటు కూడా వేసుకుని రెడీ అవుతాడు. దీంతో రాజ్యలక్ష్మి తానే ఆస్పత్రికి వెళ్తానని అంటుంది. ఆ తర్వాత సంజయ్ కూడా వస్తానని అంటాడు. దీంతో విక్రమ్‌కు కోపం వచ్చి తల్లికి సున్నితంగా, తమ్ముడికి కోపంగా క్లాస్ పీకుతాడు. ఇక, తులసి ఇంట్లో ఉన్న లక్కీకి ఫోన్ చేసిన లాస్య.. ఇంటికి వచ్చేలా చేయమని అడుగుతుంది. కానీ, ఆ బుడ్డోడు మాత్రం నువ్వు వస్తే నేను హ్యాపీగా ఉండలేను కాబట్టి అస్సలు రావొద్దు అని కోలుకోలేని షాక్ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: August 28th to September 3rd Episodes highlights

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:29వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిని, నందూను కలపడానికి లక్కీ సహాయం చేస్తానని ముందుకు వస్తాడు. అప్పుడు నందూకు తన ప్లాన్లు చెప్తుంటాడు. దీంతో నందూ ఆ బుడ్డోడిని హగ్ చేసుకుంటాడు. అప్పుడే వచ్చిన తులసి నందూను అపార్థం చేసుకుంటుంది. ఆ తర్వాత తులసి మంచి మూడ్‌లో ఉందని నందూను లక్కీ ఆమె గదిలోకి పంపిస్తాడు. కానీ, నందూ మాత్రం ఏమీ చెప్పకుండానే వచ్చేస్తాడు. తర్వాత అందరూ ప్లాన్ చేసుకుని పార్కుకు వెళ్తారు. అప్పుడు నందూ తులసికి ప్రపోజ్ చేయాలని అనుకోగా.. లాస్య ఆత్మహత్య చేసుకోబోయిందని తెలుస్తుంది.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:30వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అందరూ కలిసి పార్కుకు వెళ్లిపోవడంతో తులసిని తన గదిలోకి రమ్మని నందూ ఫోన్ చేస్తాడు. అప్పుడామె వెళ్లగా ప్రపోజ్ చేసేందుకు ఇబ్బంది పడుతుంటాడు. అలా చాలా సేపు మాట్లాడిన తర్వాత గులాబీ పువ్వు అందించబోతాడు. అంతలోనే దివ్య ఫోన్ చేసి లాస్య ఆత్మహత్యయత్నం చేసిందని తులసికి చెప్తుంది. ఇక, అందరూ ఆస్పత్రికి వెళ్లగా.. లాస్య కండీషన్ బాగానే ఉందని సంజయ్ చెప్తాడు. అనంతరం లాస్యను కూడా తనతో పాటు నందూ దగ్గరకు వచ్చేయమని లక్కీ అడుగుతాడు. దీంతో అంతా షాక్ అవుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: August 28th to September 3rd Episodes highlights

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:31వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్యను ఇంటికి రమ్మనందుకు పరందామయ్య, అనసూయలు నందూ, తులసిపై కోప్పడుతుంటారు. దీంతో తులసి ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వెళ్లిపోతుంది. దీంతో నందూకు వాళ్లు క్లాస్ పీకుతారు. అనంతరం లాస్య ఇంటికి వెళ్లిన తులసి ఆమెకు షాక్ ఇస్తుంది. అంతేకాదు, ఆస్పత్రిలో రాజ్యలక్ష్మి వాళ్లతో కలిసి వేసిన ప్లాన్ తనకు తెలిసిపోయిందని లాస్యకు చెప్తుంది. దీంతో తులసికి లాస్య ఎదురు తిరుగుతుంది. అదే సమయంలో నందూకు మళ్లీ భార్యనై అత్తింట్లో అడుగు పెడతాను అని తేల్చి చెప్పేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: August 28th to September 3rd Episodes highlights

01 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:01వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్య ఇంటికి వస్తే తమ బతుకు మళ్లీ రోడ్డున పడుతుందని పరందామయ్య వాళ్లు బాధ పడుతుంటారు. అంతలోనే అక్కడకు లాస్య వస్తుంది. ఇంట్లో తిష్ట వేయాలని ప్లాన్ చేస్తున్న ఆమెకు లక్కీ షాక్ ఇస్తాడు. మనం ఇక్కడ ఉండి వీళ్లను ఇబ్బంది పెట్టొద్దు వెళ్లిపోదాం అని అంటాడు. కానీ, తనకు డాడీ ప్రేమ కావాలని ఏడుస్తాడు. దీంతో నందూ ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఓదార్చుతాడు. ఆ తర్వాత లక్కీని తీసుకుని లాస్య.. రాజ్యలక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. కానీ, అక్కడ ఆమెను బసవయ్య, రాజ్యలక్ష్మి అవమానిస్తూ మాట్లాడతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: August 28th to September 3rd Episodes highlights

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:02వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లక్కీని తీసుకుని తన ఇంటికి వచ్చేసిన లాస్యకు రాజ్యలక్ష్మి ఝలక్ ఇస్తుంది. అంతేకాదు, మర్యాదగా మాట్లాడమంటూ మండిపడుతుంది. దీంతో లాస్య అక్కడి నుంచి వెళ్లిపోగా.. మళ్లీ ఆమె కోసం వెళ్తుంది. మరోవైపు, లక్కీ వెళ్లిపోవడంతో నందూ వాళ్లు బాధ పడుతుంటారు. ఆ తర్వాత తులసి.. దివ్యతో వరలక్ష్మి వ్రతం చేయించాలని అనుకుంటుంది. అందుకోసం రాజ్యలక్ష్మికి ఫోన్ చేయగా.. లాస్య కోరిక మేరకు ఒప్పుకుంటుంది. అనంతరం ఆ వ్రతంలో తులసిని, దివ్యను విడదీసే ప్లాన్ ఉందని రాజ్యలక్ష్మికి లాస్య చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: August 28th to September 3rd Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో నందూ ఇంట్లో ఉన్న లక్కీ అతడికి సహాయం చేయాలని అనుకోవడాన్ని చూపించారు. అలాగే, ఆ తర్వాత మార్పు వచ్చి ఆ బుడ్డోడు తల్లికే షాక్ ఇచ్చేస్తాడు. అందుకు అనుగుణంగానే రాజ్యలక్ష్మి కూడా లాస్యకు ఝలక్ ఇవ్వడంతో ఆమె బతుకు రోడ్డున పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా తల్లి, కూతుళ్లను వేరే చేసే ప్లాన్ చెప్పి మళ్లీ రాజ్యలక్ష్మి మనసు దోచేస్తుంది. దీంతో వచ్చే వారం మరింత రంజుగా సాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X