For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Weekly Roundup: లాస్య ట్రాప్‌లో సామ్రాట్.. తులసికి కొత్త కష్టాలు.. కథలో మలుపు

  |

  తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

  29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  29వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. భూమి పూజ కోసం వచ్చిన ప్రేమ్.. తన తల్లికి సామ్రాట్ చేస్తోన్న సహాయంపై మాట్లాడతాడు. ఆ వెంటనే సామ్రాట్‌ను హగ్ చేసుకుని.. ఎప్పటికీ అండగా ఉండేలా మాట తీసుకుంటాడు. ఆ తర్వాత దీపక్ కూడా అక్కడకు వస్తాడు. అతడు కూడా సామ్రాట్‌కు ధన్యవాదాలు తెలుపుతాడు. అదే సమయంలో తులసి మాజీ భర్త గురించి అతడు మాట్లాడుతూ విమర్శలు చేస్తుంటాడు. దీంతో అక్కడే ఉన్న నందూ తన పేరు చెప్తాడేమో అని టెన్షన్ పడుతుంటాడు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో తులసిపై సామ్రాట్ ప్రశంసలు గుప్పిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: దీపక్ ఎంట్రీతో మారిన సీన్.. సామ్రాట్‌ను హత్తుకోవడంతో!

  30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  30వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రెస్‌మీట్‌లో తులసిని మాజీ భర్త ఎవరు అని రిపోర్టర్లు ప్రశ్నిస్తారు. కానీ, దానికి ఆమె సమాధానం చెప్పదు. అయినప్పటికీ ప్రశ్నిస్తుంటారు. కానీ, తులసి మాత్రం సమాధానం దాటవేస్తుంది. తర్వాత సామ్రాట్, తులసి కలిసి పూజ చేస్తుంటారు. అది చూసిన నందూ, లాస్య ఆగ్రహంగా ఉంటారు. అనంతరం శృతి.. మా ఆంటీకి ఎందుకు సహాయం చేస్తున్నారు? మీరు ఆమెను ఇష్టపడుతున్నారా? అని సామ్రాట్‌ను సూటిగా ప్రశ్నిస్తుంది. దీనికి ఆయన తులసి అంటే గౌరవం అంటాడు. తర్వాత అభి అక్కడకు వచ్చి నానా గొడవ చేస్తాడు.

  31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


  31వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. భూమి పూజ జరుగుతున్న ప్రదేశానికి కోపంగా వచ్చిన అభి నానా గొడవ చేస్తాడు. అస్సలు చదువు, అర్హతలు లేని మా మామ్‌కు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? దీని వెనుక మీ ఉద్దేశం ఏంటి? అని సామ్రాట్‌ను ప్రశ్నిస్తాడు. దీంతో దీపక్ ఎంట్రీ ఇచ్చి నందూను, అభిని తిడతాడు. అప్పుడు నందూ కోపంతో అతడిపై విరుచుకు పడతాడు. దీంతో నందూ, తులసి మాజీ భార్యభర్తలన్న విషయం సామ్రాట్‌కు తెలుస్తుంది. తర్వాత ఇంట్లో అభి, ప్రేమ్ మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు తులసి వచ్చి అభిని ఏమీ అనొద్దని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: గొడవలో నోరు జారిన నందూ.. సామ్రాట్‌కు నిజం తెలియడంతో ట్విస్ట్

  1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  1వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఇంటికి వచ్చిన నందూ, లాస్య.. ఆమె కావాలనే అలా చేసిందని ఆరోపిస్తారు. అంతేకాదు, దీపక్‌ను ప్లాన్ ప్రకారమే తనపైకి రెచ్చగొట్టిందని నందూ ఆరోపిస్తాడు. అప్పుడు తులసి ఎంత చెప్పినా వాళ్లు మాత్రం అస్సలు వినరు. దీంతో తులసి.. నందూ, లాస్యకు ధీటుగా సమాధానం చెబుతూ షాకిస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్లందరూ ఆమెకు చప్పట్లు కొట్టి అభినందిస్తారు. ఇక, సామ్రాట్.. తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో పాపం ఆమెకు ఏమౌతుందా అని తన బాబాయి ముందు బాధను వ్యక్తం చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: నందూ, లాస్యకు తులసి ఝలక్.. ప్లాన్ చేసింది ఆమెనే అంటూ!

  2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  2వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి తనకు వార్నింగ్ ఇవ్వడంతో నందూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడతను లాస్యతో అసలు ఆమె వల్ల నాకెందుకు ఇలా అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు లాస్య అభిని రెచ్చగొట్టిన విషయం చెప్పకుండా.. మీ అమ్మా నాన్నలకు దూరంగా ఉండు అని నందూకు సలహా ఇస్తుంది. తర్వాత అనసూయ నందూకు ఫోన్ చేసి సామ్రాట్‌ దగ్గర నిజం ఒప్పుకోమని అంటుంది. అనంతరం ఇంటికి తిరిగొచ్చిన అంకిత అభికి ఫుల్‌గా క్లాస్ పీకుతుంది. అంతేకాదు, సామ్రాట్‌కు నిజం చెప్పమని డిమాండ్‌ను చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: తులసిపై నందూ, లాస్య మరో ప్లాన్.. అంకిత ఎంట్రీతో అభికి బిగ్ షాక్

  3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  3వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. భూమి పూజ దగ్గర జరిగిన గొడవ తర్వాత సామ్రాట్, తులసి ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే తులసి.. సామ్రాట్‌కు బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉండను అంటూ ఓ మెసేజ్ చేస్తుంది. అది చూసిన సామ్రాట్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడు సామ్రాట్ బాబాయి తులసికి సపోర్ట్ చేస్తాడు. అనంతరం ప్రేమ్, శృతి సరదాగా గొడవ పడతారు. ఇక, చివర్లో తులసి.. నందూ ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో సామ్రాట్ దగ్గర తన మాజీ భర్త అని నిజం దాయమన్నది మీరే అని ఒప్పుకోవాలంటూ నందూను ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌కు షాకిచ్చిన తులసి.. నందూ ఇంటికి వెళ్లడంతో అవమానం

  ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

  ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

  ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో లాస్య ప్లాన్ ప్రకారం అభి భూమి పూజ దగ్గరకు వచ్చి గొడవ చేస్తాడు. దీంతో అది కంప్లీట్ అవకుండానే అందరూ వెళ్లిపోతారు. ఆ తర్వాత ఇదే విషయంపై తులసి ఇంట్లో గొడవలు జరుగుతాయి. మరోవైపు సామ్రాట్ కూడా తులసి తీరుపై అసహనంగా ఉంటాడు. ఇక, దీన్ని క్యాష్ చేసుకుని సామ్రాట్‌, తులసి మధ్య దూరం పెంచాలని లాస్య, నందూ ప్లాన్ చేస్తుంటారు. దీంతో వచ్చే వారం తులసికి కష్టాలు మొదలయ్యేలా మారింది.

  English summary
  Intinti Gruhalakshmi August 29th to September 3rd Episodes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X