Intinti Gruhalakshmi: మారిన విక్రమ్ మనసు.. దివ్య, తులసికి గుడ్ న్యూస్‌లు.. లక్కీ మాయమవడంతో ట్విస్ట్
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.
తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 07వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వంటగదిలో పని చేసుకుంటున్న తులసి దగ్గరకు వెళ్లిన నందూ చాటుగా చూస్తుంటాడు. దీంతో ఆమె అతడికి వినిపించేలా తిడుతుంటుంది. తర్వాత రాములమ్మను పిలిచి విషయం అడగ్గా 'తులసమ్మను పెళ్లి చేసుకుంటా' అన్నారు కదా.. అందుకే ఆమె కోపంగా ఉన్నారు అని చెప్తుంది. ఇక, దివ్య ఆస్పత్రికి వెళ్లేందుకు బయలుదేరగా.. రాజ్యలక్ష్మి వాళ్లు ఎగతాళి చేస్తారు. అంతలోనే విక్రమ్ వచ్చి దివ్యకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తాడు. చివరకు దాన్ని రాజ్యలక్ష్మి చేత్తో ఇచ్చేలా దివ్య ప్లాన్ చేసి అందరికీ షాక్ ఇచ్చేస్తుంది.

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 08వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి వచ్చిన దివ్యకు అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలుకుతారు. అది చూసిన రాజ్యలక్ష్మి బ్యాచ్‌కు కంగారెత్తిపోతుంది. తర్వాత దివ్య ఉద్యోగులకు హామీలు ఇస్తుండడంతో అత్త ఎంట్రీ ఇచ్చి.. తను కూడా ఇక్కడ ఉద్యోగి మాత్రమే అని చెబుతుంది. ఉద్యోగంలోకి రాగానే తులసి క్యాంటీన్ ఓనర్‌తో గొడవకు దిగుతుంది. అతడు రెండు ఇడ్లీలు తక్కువగా పెడుతున్నాడని ప్రశ్నిస్తుంది. దీనికి కాంట్రాక్టర్ అయిన అతడు దివ్యపై ఎదురు తిరుగుతాడు. అంతేకాదు, కాళ్లు విరగ్గొడతానంటూ అందరి ముందరే వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 09వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనను చూస్తూ నందూ ఏదేదో ఊహించుకోవడం గమనించిన తులసి అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. అంతేకాదు, మన మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని తేల్చి చెప్పేస్తుంది. ఇక, ఆస్పత్రికి వచ్చిన విక్రమ్‌కు దివ్య క్యాంటీన్‌లో జరిగిన గొడవ గురించి వివరిస్తుంది. అంతేకాదు, కాంట్రాక్టర్ మాణిక్యం.. సంజయ్‌తో చెప్తానన్నది కూడా చెప్తుంది. దీంతో విక్రమ్‌కు కోపం వచ్చి అతడి కాంట్రాక్టును రద్దు చేయమని చెప్తాడు. ఇక, క్యాంటీన్ కాంట్రాక్టును తులసి వాళ్లకు ఇవ్వాలని దివ్య ప్లాన్ చేసి.. ఆమెకు ఫోన్ చేసి వివరిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 10వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ తనకు లైన్ వేస్తున్నాడని గ్రహించిన తులసి అతడికి క్లాస్ పీకుతుంది. అంతేకాదు, మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని తేల్చేస్తుంది. ఇక, మాణిక్యం కాంట్రాక్టు రద్దు కావడంతో ఆస్పత్రిలో టెండర్ వేయడానికి ఎవరూ రాకుండా అడ్డుకుంటూ ఉంటాడు. కానీ, తులసి వాళ్లు మాత్రం అతడిని ఎదురించి లోపలికి వస్తారు. దీంతో రాజ్యలక్ష్మి బ్యాచ్‌కు కోలుకోలేని షాక్ తగులుతుంది. తులసి వాళ్లు టెండర్‌ను రాజ్యలక్ష్మి వద్దని అంటుంది. కానీ, విక్రమ్ మాత్రం తన నిర్ణయం అయిపోయిందని అందరికీ ట్విస్ట్ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
11 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 11వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలో పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంటీన్ కాంట్రాక్టును తులసి వాళ్లకు ఇస్తున్నట్లు విక్రమ్ చెప్తాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత దివ్య ఆస్పత్రిలో తులసి తనకు సలహాలు ఇస్తుందని సంతోషిస్తుంది. ఇక, తులసి వాళ్లను ఎలాగైనా కాంట్రాక్టు వద్దని పారిపోయేలా చేయాలని రాజ్యలక్ష్మి అనుకుంటుంది. దీనికి లాస్య మంచి ప్లాన్ చెబుతానంటుంది. చివర్లో నందూ.. తులసికి ఎంతో ఇష్టమైన పాత టేపు రికార్డర్‌ను బహుమతిగా ఇవ్వడంతో ఆమె సంతోషిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 12వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య ఫొటోను చూస్తూ తన తల్లిని అన్న మాటలను గుర్తు చేసుకున్న విక్రమ్ ఫోన్‌ను విసిరేస్తాడు. అప్పుడు దివ్య అతడిని బుజ్జగించే ప్రయత్నం చేయగా.. విక్రమ్ ఎమోషనల్ అవుతాడు. ఇక, క్యాంటీన్‌లో తులసి వాళ్ల ఫుడ్ బాగుందని అందరూ మెచ్చుకుంటారు. అది చూసిన విక్రమ్ చాలా సంతోషిస్తాడు. ఆ సమయంలోనే దివ్య ఆస్పత్రిని దగ్గరుండి పర్యవేక్షించమని అతడికి చెప్తుంది. ఇక, లాస్య మాజీ భర్త వచ్చి లక్కీకి తనకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని తేల్చేస్తాడు. దీంతో ఆ చిన్నారి బాధ పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: ఆగస్టు 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో రాజ్యలక్ష్మి ఆస్పత్రిలో క్యాంటీన్ కాంట్రక్టర్ దివ్యకు ఎదురు తిరగడంతో రచ్చ జరుగుతుంది. దీంతో విక్రమ్ కొత్త కాంట్రాక్ట్ కావాలని అడగడం.. తులసి వాళ్లు టెండర్ వేయడం.. వాళ్లకే క్యాంటీన్ ఇవ్వడం జరిగాయి. ఇదంతా దివ్యకు ఫేవర్‌గా జరగడంతో సీరియల్ అంతా హ్యాపీగా సాగింది. అదే సమయంలో లక్కీ హాస్టల్ నుంచి పారిపోయి లాస్యకు మరో షాక్ ఇస్తాడు. దీంతో వచ్చే వారం అంతా మరింత ఆసక్తికరంగా సాగనుంది.


Click it and Unblock the Notifications











