Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Intinti Gruhalakshmi Weekly Roundup: తులసికి ఫ్రెండ్స్ షాక్.. మళ్లీ ఆ ఇంటికే.. ఫోన్ రావడంతో ట్విస్ట్
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూసేయండి!

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
12వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గుడికి వెళ్లేందుకు బయలుదేరిన సామ్రాట్‌ను అసలు మీకు దేవాలయానికి వెళ్లమని ఎవరు చెప్పారని తులసి ప్రశ్నిస్తుంది. దీంతో ఆఫీస్‌లోని కొందరు చెప్పారని అంటాడు. ఆ తర్వాత ఆ గుడికి వెళ్లి పూజలు చేయించుకున్నాక.. ముడుపు కట్టమని పూజారి చెప్తాడు. దీంతో సామ్రాట్, తులసి ముడుపులు కడతారు. అయితే, తులసి ఏం కోరిక కోరిందో అని సామ్రాట్ చూస్తాడు. అదంతా చూసిన పూజారి.. ఆ కోరికను నువ్వే తీర్చాలి అని సామ్రాట్‌కు చెబుతాడు. ఇక, లాస్య తనను అవమానించిన విషయాన్ని ప్రేమ్‌కు శృతి చెప్పేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.
Intinti Gruhalakshmi Today Episode: తులసి కోరిక చూసి షాకైన సామ్రాట్.. ప్రేమ్‌కు నిజం చెప్పిన శృతి

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ
తేదీ
మంగళవారం
ప్రసారం
అయిన
ఎపిసోడ్‌లో..
తులసిని
ఏ
కోరిక
కోరుకున్నారో
చెప్పమని
సామ్రాట్
పదే
పదే
అడుగుతాడు.
కానీ,
ఆమె
మాత్రం
అస్సలు
చెప్పదు.
అనంతరం
ఇంటికి
వెళ్లిన
సామ్రాట్‌కు
హనీ
తనకు
ఫస్ట్
ర్యాంక్
వచ్చిందన్న
గుడ్
న్యూస్
చెబుతుంది.
దీంతో
ఈ
విషయాన్ని
అతడు
తులసికి
చెప్తాడు.
ఆ
తర్వాత
ఉదయాన్నే
ఓ
ఊరు
వెళ్దామని
ఆమెతో
అంటాడు.
మరోవైపు,
ప్రేమ్‌కు
ఫుడ్
ఆర్డర్
రావడంతో
లాస్య..
నందూకు
అబద్దాలు
చెబుతుంది.
దీంతో
శృతికి
నందూ
క్లాస్
పీకుతాడు.
తర్వాత
పరందామయ్య
తినే
వంటకాన్ని
లాస్య
లాక్కుని
తినేసి
ఇబ్బంది
పెడుతుంది.
ఈ
ఎపిసోడ్
కోసం
కింది
లింక్‌పై
క్లిక్
చేయండి.
Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ గుడ్ న్యూస్.. చేయకూడని తప్పు చేసిన లాస్య

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
14వ
తేదీ
బుధవారం
ప్రసారం
అయిన
ఎపిసోడ్‌లో..
తులసి
ముడుపులో
ఉన్నట్లుగా
ఆమె
కోరిక
తీర్చడం
కోసం
సొంతూరుకు
తీసుకెళ్లాలని
డిసైడ్
అయిన
సామ్రాట్
కారులో
తీసుకెళ్తుంటాడు.
కానీ,
ఆ
ఊరు
చూసిన
తులసి
గుర్తు
పట్టదు.
దీంతో
ఊరి
పేరు
ఉన్న
బోర్డు
దగ్గర
ఆపుతాడు.
ఆ
తర్వాత
తులసి
అది
చూసి
చాలా
సంతోషిస్తుంది.
ఆ
తర్వాత
ఆ
ఊరిలోనే
రోజంతా
తిరగాలని
అంటుంది.
దీంతో
సామ్రాట్
కూడా
ఓకే
అంటాడు.
మరోవైపు,
అంకిత
దగ్గర
వైద్యం
చేయించడం
కోసం
ఇంటికి
వచ్చిన
పేషెంట్ల
దగ్గర
లాస్య
500
రూపాయలు
వసూలు
చేస్తుంది.
ఈ
ఎపిసోడ్
కోసం
కింద
లింక్‌పై
క్లిక్
చేయండి.
Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్.. లాస్య వంకర బుద్ధి.. మామిడి తోటలో!

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
15వ
తేదీ
గురువారం
ప్రసారం
అయిన
ఎపిసోడ్‌లో..
సామ్రాట్‌తో
కలిసి
తన
ఊరంతా
తిరుగుతుండగా
తులసికి
తన
సొంత
ఇల్లు
కనిపిస్తుంది.
దీంతో
ఈ
విషయాన్ని
అతడికి
చెబుతుంది.
అంతేకాదు,
ఆ
ఇల్లు
కోర్టు
కేసులో
ఉందని
అంటుంది.
అప్పుడు
సామ్రాట్
గేటు
ఓపెన్
చేసి
తులసిని
లోపలికి
తీసుకెళ్తాడు.
అలా
వెళ్లిన
ఆమె
తులసి
కోటను
శుభ్రం
చేస్తుంది.
ఆ
తర్వాత
ఇంటిని
చూసి
బాధ
పడుతుంది.
మరోవైపు,
అంకిత
తన
కోసం
వచ్చిన
వాళ్లకు
వైద్యం
చేస్తుంది.
అప్పుడు
వాళ్లు
లాస్య
500
తీసుకున్న
విషయం
చెప్పగా..
వాళ్లకు
అంకితే
ఆ
డబ్బులు
ఇచ్చేసి
పంపిచేస్తుంది.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి, సామ్రాట్ ఇంట్లో ఉండగానే ఒకరు అక్కడకు వెళ్తారు. ఆ వచ్చింది వాళ్ల సంగీతం టీచర్ అని ఆమె గుర్తిస్తుంది. అంతేకాదు, తాను కొత్తగా మ్యూజిక్ స్కూల్‌ను పెట్టబోతున్నానని, దాని ఓపెనింగ్‌ను రావాలని గురువును కోరుతుంది. దీనికాయన ఓకే అంటాడు. అనంతరం ఈ ఇంటిని తులసికి వచ్చేలా చేస్తానని సామ్రాట్ అంటాడు. ఇక, పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకున్నదని లాస్యతో అంకిత గొడవ పడుతుంది. దీంతో ఆమెను లాస్య అవమానించేలా మాట్లాడుతుంది. తర్వాత నందూకు లేనిపోనివి చెప్పి క్లాస్ పీకిస్తుంది.

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
17వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో దొరికిన పెట్టెలో పాత వస్తువులను చూసి తులసి సంతోషిస్తుంటుంది. అలాగే, అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటోంది. అలా ప్రతి విషయాన్ని సామ్రాట్‌కు వివరిస్తుంది. అప్పుడు వాక్‌మెన్ దొరకగా.. తన తల్లి పాట ఇందులో రికార్డు చేశానని చెబుతుంది. మరోవైపు, లాస్య తనను అవమానించడంతో అంకిత రగిలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో అభితో గొడవకు దిగుతుంది. ఇక, లాస్య ఇంట్లోని ఫ్రిడ్జ్‌కు తాళం వేయడంతో పరందామయ్య టీ లేక ఇబ్బంది పడతాడు. చివర్లో తులసి తన స్నేహితులను కలుస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
Intinti Gruhalakshmi Today Episode: ఫ్రెండ్‌ను కలిసిన తులసికి షాక్.. లాస్య వల్ల వాళ్ల మధ్య గొడవ

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
డిసెంబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో తులసి తన ఊరికి వెళ్లడం.. అక్కడ సామ్రాట్‌తో కలిసి మొత్తం తిరగడం.. అ క్రమంలోనే తన చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకోవడం వంటివి చూపించారు. మరోవైపు, లాస్య ఇంట్లో తన మాటే చెల్లుబాటు అయ్యేలా ప్లాన్ చేస్తుంటుంది. ఇందుకోసం పరందామయ్య, అనసూయను ఇబ్బంది పెట్టడంతో పాటు అంకిత, శృతిని ఘోరంగా అవమానిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లు తులసికి కంప్లైంట్ చేయాలని చూస్తారు.