For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Weekly Roundup: తులసికి వరుసగా రెండు షాక్‌లు.. శృతి వల్ల మలుపు తిరగబోతున్న కథ

  |

  ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

  19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


  19వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఊరిలో తిరిగి.. ఫ్రెండ్స్‌ను కలిసిన తర్వాత తులసి, సామ్రాట్ కారులో ఇంటికి బయలుదేరుతారు. ఆ సమయంలో తులసి తన విడాకుల గురించి బాధ పడుతుంది. దీంతో ఆమెను ఓదార్చిన సామ్రాట్.. ఇంట్లో సర్‌ప్రైజ్ ఉందని చెప్తాడు. అనంతరం ఆమె పరందామయ్యకు ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకుంటుంది. కానీ, లాస్య చేసే పనుల గురించి మాత్రం ఆయన చెప్పడు. మరోవైపు, సామ్రాట్ ముందుగానే చెప్పినట్లే తులసి కోసం ఆమె తల్లి ఇంటికి వస్తుంది. దీంతో సామ్రాట్‌కు ఫోన్ చేసిన తులసి థ్యాంక్స్ అని చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ సర్‌ప్రైజ్.. నిజం చెప్పిన శృతి.. ఆమె రాకతో షాక్

  20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  20వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన తల్లిని ఇంటికి వచ్చేలా చేసిన సామ్రాట్‌కు తులసి ఫోన్ చేసి ధన్యవాదాలు చెబుతుంది. దీంతో అతడు ఎంతో సంతోషంగా ఉంటాడు. అలాగే, తులసితో కలిసి తిరిగినవి అన్నీ గుర్తు చేసుకుని సంతోషిస్తాడు. ఆ సమయంలో వాళ్ల బాబాయి వచ్చి సామ్రాట్ ప్రేమలో పడ్డాడని అనుకుంటాడు. మరోవైపు, తన దగ్గరకు వచ్చిన తల్లితో తులసి మనసు విప్పి మాట్లాడుతుంది. అలాగే, తన తండ్రి గురించి కూడా మాట్లాడుతుంది. ఇక, కాలేజ్ పార్టీలో డ్యాన్స్ వేయడానికి నేర్పించమని దివ్య తన వదినలు అంకిత, శృతిని కోరుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్ ప్రవర్తనలో మార్పు.. నువ్వే జీవితాన్ని ఇచ్చావన్న తులసి

  21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


  21వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు ఎంతో ఇష్టమైన వాక్‌మెన్‌ను తులసికి సామ్రాట్ గిఫ్టుగా ఇస్తాడు. దీంతో అతడిపై సరస్వతి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అనంతరం ఇంటర్వ్యూకు వెళ్లి నిరాశగా తిరిగి వచ్చిన నందూకు లాస్య కొన్ని బిల్లులు కట్టాలని చెబుతుంది. దీంతో ఆమెనే మేనేజ్ చేయమని చెప్తాడు. ఇక, ట్యాబ్లెట్లు అయిపోవడంతో పరందామయ్య, అనసూయ బాధ పడుతుంటారు. వాళ్ల మాటలు విని నందూ ఫీల్ అవుతాడు. అప్పుడే తులసి వాళ్లకు మందులు పంపుతుంది. దీంతో నందూ.. తులసికి థ్యాంక్స్ అని మనసులోనే చెప్పుకుని బాధ పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి థ్యాంక్స్ చెప్పిన నందూ.. నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ!

  22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  22వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు పార్టీ కావాలని అడిగిన సామ్రాట్‌కు తులసి కొన్ని అనుభవాలను కళ్లకు అద్దినట్లుగా చూపించాలని అనుకుంటుంది. ఇందులో భాగంగానే ఓ 500 రూపాయలతో ప్రయోగం చేస్తుంది. తర్వాత కళ్లకు గంతలు కట్టి ఓ పరీక్ష పెడుతుంది. వీటిలో అతడు ఓడిపోవడంతో తులసి కొన్ని సూచనలు చేస్తోంది. మరోవైపు నందూ తన పరిస్థితిని తలుచుకుని బాధ పడతాడు. మళ్లీ సామ్రాట్ దగ్గరకు వెళ్తే పరువు పోతుందని అనుకుంటాడు. ఇక, చివర్లో నందూ ఉన్న రెస్టారెంట్‌కే తులసి, సామ్రాట్ వస్తారు. దీంతో అతడు షాక్ అవుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: అడ్డంగా బుక్కైన నందూ.. ఉద్యోగం కోసం మళ్లీ సామ్రాట్ దగ్గరకు!

  23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  23వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ రెస్టారెంట్‌లో పర్స్ మర్చిపోయానని చెప్పడంతో అక్కడి మేనేజర్ నోటికొచ్చినట్లు తిడుతుంటాడు. ఆ సమయంలో తులసి, సామ్రాట్ వస్తారు. అప్పుడు అతడికి క్లాస్ పీకిన తులసి.. నందూ డబ్బులు కూడా కట్టేస్తుంది. అనంతరం శృతి, అంకిత.. దివ్య ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారని, ఎలాంటి ఓవర్ యాక్టింగ్ చేయొద్దని చెప్తారు. తర్వాత వాళ్లు రాగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ, లాస్య ఏదేదో మాట్లాడుతుంది. ఇక, సామ్రాట్‌కు తులసి ఓ చాలెంజ్ ఇస్తుంది. తర్వాత అనాథాశ్రమానికి తీసుకెళ్తుంది. దీంతో అతడు సంతోషిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: అతడిని కొత్త చోటుకు తీసుకెళ్లిన తులసి.. లాస్యకు కోడళ్లు షాక్

  24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

  24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


  24వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య వాళ్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా పరందామయ్య వచ్చి సౌండ్ పెట్టమంటాడు. దీంతో వాళ్లు పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తుండగా లాస్య వచ్చి పాటలు ఆపుతుంది. దీంతో దివ్య ఆమెతో గొడవకు దిగుతుంది. అప్పుడే నందూ రాగా.. అతడికి లాస్య అబద్ధం చెప్తుంది. దీంతో నందూ దివ్యనే తిడతాడు. ఆ తర్వాత ప్రేమ్, అభికి దివ్య ఆ విషయాలు చెప్తుంది. ప్రేమ్ గొడవ చేద్దామంటే పరందామయ్య ఆపుతాడు. ఇక, దివ్యకు తులసి ఫోన్ చేయగా.. ఆమె ఏడుస్తుంది. దీంతో కూతురిని తులసి ఓదార్చుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

  Intinti Gruhalakshmi Today Episode: వాళ్లకు మరో షాకిచ్చిన లాస్య.. అంకితకు నిజం తెలియడంతో రచ్చ

  ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

  ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

  డిసెంబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో నందూ ఉద్యోగం లేక ఖాళీగా ఉండడం, ఇంటి పెత్తనాన్ని లాస్య తన చేతిలోకి తీసుకోవడం వంటి అంశాలను హైలైట్ చేశారు. అలాగే, సామ్రాట్‌కు తులసి హితబోధలు చేసేవి కూడా చూపించారు. ఇక, వచ్చే వారం మాత్రం శృతి ఆరోగ్యం గురించి టెన్షన్ పెట్టబోతున్నట్లు రెండు మూడు రోజులుగా ప్రోమోలో చూపిస్తున్నారు. అలాగే, పరందామయ్య వల్ల లాస్య బండారం బట్టబయలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

  English summary
  Intinti Gruhalakshmi December 19th to 24th Episodes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X