Intinti Gruhalakshmi Weekly Roundup: తులసి లైఫ్‌లోకి కొత్త విలన్.. చంపేస్తా అంటూ.. కథలో ట్విస్ట్
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఫ్రిడ్జ్ తాళం కోసం వచ్చిన అంకితకు లాస్య పెట్టిన కండీషన్స్ గురించి శృతి చెబుతుంది. దీంతో లాస్యతో అంకిత గొడవకు దిగుతుంది. ఆ తర్వాత అందరూ ఒక్కటై లాస్యతో వాగ్వాదానికి దిగుతారు. ఆ సమయంలో శృతి ఆమె మీద అరుస్తూ కింద పడిపోతోంది. ఆమెను పరీక్షించిన అంకిత ప్రెగ్నెంట్ అయిందని చెబుతుంది. దీంతో శృతి ఈ విషయం తులసికి ఫోన్ చేసి చెబుతుంది. ఆ వెంటనే ఆమె అక్కడకు వస్తుంది. ఆ సమయంలో అందరూ సంతోషంగా ఉండడంతో లాస్యకు కోపం వస్తుంది. దీంతో గొడవకు దిగుతుంది.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శృతి ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే స్వీట్లు పట్టుకుని తులసి ఆ ఇంటికి వెళ్తుంది. కానీ, లాస్య మాత్రం ఆమెను లోపలికి రానివ్వకుండా అడ్డుకుని అవమానించి పంపేస్తుంది. దీంతో తులసి ఏడుస్తూ ఇంటికి చేరుతుంది. ఆమెను చూసిన సామ్రాట్ ధైర్యం చెప్పి ఓదార్చుతాడు. అంతేకాదు, ఏమైందో తెలుసుకుంటాడు. ఆ తర్వాత తులసిని తీసుకుని సామ్రాట్ లాస్య ఇంటికి వెళ్తాడు. కానీ, అక్కడ వాళ్లను వెళ్లిపోమని లాస్య, నందూ గొడవ పడతారు. కానీ, తులసి మాత్రం అస్సలు వెళ్లేది లేదని ధీటుగా సమాధానం చెప్తుంది.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తులసితో లాస్య, నందూ గొడవ పడతారు. ఆ సమయంలో ప్రేమ్ మాటలకు నందూకు కోపం వస్తుంది. దీంతో అతడిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తులసి, సామ్రాట్ అడ్డుకుంటారు. తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనంతరం నందూను పరందామయ్య తిడతాడు. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత తులసిని సామ్రాట్ ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. అనంతరం కాఫీ తీసుకొస్తానని వెళ్లి చేయి కాల్చుకుంటాడు. దీంతో తులసి బాధ పడుతుంది. ఇక, నందూను లాస్య మరోసారి తులసిపై రెచ్చగొడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అవమాన భారంతో ఇంటికి వచ్చిన తులసి బాధ పడుతూ ఉంటుంది. అంతలోనే అక్కడకు దివ్య, ప్రేమ్, శృతి, అంకిత, అభిలు వస్తారు. వాళ్లతో సరదాగా మాట్లాడుకున్న తర్వాత సామ్రాట్ డెకరేషన్ చేసి ప్రేమ్, శృతితో కేక్ కట్ చేయిస్తాడు. మరోవైపు, ఇంట్లో వాళ్లంతా ఎక్కడికి వెళ్లారా అని లాస్య, నందూ అనుకుంటారు. అప్పుడే పరందామయ్య ఫోన్ నుంచి దివ్యకు కాల్ చేసిన లాస్య వాళ్ల గురించి తెలుసుకుంటుంది. ఆ వెంటనే వాళ్లు తులసి ఇంట్లో ఉన్నారని నందూకు చెప్తుంది. దీంతో వాళ్లిద్దరూ కోపంగా అక్కడికి బయలుదేరుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
30వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఇంట్లో సంబరాలు చేసుకుంటోన్న సమయంలో శృతి ఓ బెలూన్‌పై కాలు వేసి కింద పడిపోతుంది. దీంతో ఆమె కడుపునకు దెబ్బ తగులుతుంది. అప్పుడు అందరూ కంగారు పడి ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్తారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన నందూ, లాస్య కోపంగా చిందులు వేస్తారు. అనంతరం అభి ద్వారా విషయం తెలుసుకున్న నందూ.. నేరుగా ఆస్పత్రికి చేరుకుంటాడు. ఆ వెంటనే తులసిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. అనంతరం ఆమెను కొట్టబోతుండగా సామ్రాట్ వచ్చి అడ్డుగా నిల్చుని వాళ్లకు షాక్ ఇచ్చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
31వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలోనే సామ్రాట్, తులసితో నందూ గొడవ పడతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి శృతి సేఫ్‌గానే ఉందని, ఆమె గర్భానికి ఎలాంటి ప్రమాదం లేదని చెబుతుంది. దీంతో తులసి ఒక్కసారిగా నందూపై విరుచుకుపడుతుంది. వెన్నుపోటు అంటే ఏంటో సరైన ఉదాహరణలు చెప్పి అతడికి, లాస్యకు బిగ్ షాక్ ఇస్తుంది. అనంతరం ఇంటికి వెళ్తూ నందూ తీరుపై సామ్రాట్ దగ్గర అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక, చివర్లో శృతి కోసం తులసి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం నచ్చని నందూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అనసూయ మాత్రం మాజీ కోడలికే సపోర్ట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
డిసెంబర్ 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో శృతి ప్రెగ్నెంట్ అని తెలియడం, ఆ తర్వాత ఆమె కింద పడి ఆస్పత్రిలో చేరడాన్ని బాగా హైలైట్ చేశారు. అలాగే, తులసి కూడా మాజీ భర్తకు ధీటుగా బదులిచ్చింది. తులసి ఇంట్లోకి కొత్త వారసుడు వస్తున్నాడన్న సంబరాలు మొదలైన సమయంలోనే ఆమె లైఫ్‌లోకి కొత్త విలన్ ఎంట్రీ ఇవ్వడాన్ని రాబోయే ఎపిసోడ్‌లలో చూపించబోతున్నారు. దీంతో వచ్చే వారం నుంచి సీరియల్ మరింత రంజుగా సాగే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











