Intinti Gruhalakshmi Weekly Roundup: ఆ ఇంటిది కాబోతున్న తులసి.. అలా బుక్కైన సామ్రాట్.. కథలో ట్విస్ట్
ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూసేయండి మరి!

5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
5వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో ఉన్న వాళ్లందరినీ ప్రసన్నం చేసుకోవాలని అనుకున్న లాస్య అత్తయ్య అది కావాలా? ఇది కావాలా? అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. కానీ, వాళ్లు మాత్రం సహకరించరు. దీంతో భాగ్య.. లాస్యను రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. అనంతరం సామ్రాట్, తులసి బస్సులో వెళ్తారు. ఆ సమయంలో సామ్రాట్ 2 వేల రూపాయల నోట్ ఇవ్వగా కండక్టర్ సీరియస్ అవుతాడు. అనంతరం అభికి ఒక బ్యాగ్ కొనాలని అనుకుంటారు. దానికోసం కోఠీకి వెళ్తారు. ఆ సమయంలో తులసి 2 వేల రూపాయల బ్యాగ్‌ను 500లకే కొనుగోలు చేస్తుంది.

6వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
6వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి అడిగిందని సామ్రాట్ రోజ్ మిల్క్ తీసుకు రావడానికి వెళ్తాడు. కానీ, తోపులాటలో అంతా పోగొట్టేసి వట్టి గ్లాసులతో బయటకు వస్తాడు. అనంతరం తన దగ్గరకు వచ్చిన భాగ్యను ఏదైనా సలహా చెప్పమని లాస్య అడుగుతుంది. దీంతో ఆమె ఏదో చెబుతుంది. ఆ తర్వాత లాస్య తన దగ్గర ఉన్న ఇంటి డాక్యూమెంట్లను పరందామయ్యకు ఇచ్చేస్తుంది. మరోవైపు, సామ్రాట్, తులసి బస్సులో వెళ్తుండగా.. ఓ కుర్రాడు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. దీంతో తులసి అతడికి బుద్ధి చెబుతుంది. అప్పుడు సామ్రాట్ అవాక్కవుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
7వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అత్తమామలకు ఇంటి డాక్యూమెంట్లను అందించిన తర్వాత లాస్య ఏడుస్తూ యాక్టింగ్‌ను మొదలు పెడుతుంది. అలా ఏడుస్తూ వాళ్లను పడేసే ప్రయత్నం చేస్తుంది. కానీ, పరందామయ్య మాత్రం అవి వద్దని ఆమెకే ఇచ్చేస్తాడు. అనంతరం నందూను బుట్టలో వేసుకునేందుకు లాస్య ప్లాన్ చేస్తుంది. కానీ, అతడు మాత్రం ఆమెతో గొడవ పడుతూ సీరియస్ అవుతాడు. మరోవైపు, సామ్రాట్, తులసి షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఆ తర్వాత తులసి.. పరందామయ్య ఇంటికి వస్తుంది. దీంతో అందరూ బాగా సంతోషిస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
8వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిని వస్తువులు ఎందుకు తెచ్చావని అభి ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె అతడికి క్లాస్ పీకుతుంది. అప్పుడే లాస్యతో నందూ గొడవ పడుతూ ఉంటాడు. అలా ఇద్దరూ చాలా సేపు వాగ్వాదానికి దిగుతారు. ఎంత చెప్పినా వినకపోయే సరికి లాస్య తన తలపై కొట్టుకుంటుంది. అప్పుడు పరందామయ్యతో పాటు ఇంట్లో వాళ్లంతా ఆపుతారు. అనంతరం తులసి.. లాస్యతో మాట్లాడి కొన్ని సలహాలు సూచనలు ఇస్తుంది. అలాగే, నందూతో కూడా మాట్లాడుతుంది. ఆ సమయంలో లాస్యపై అతడి కోపాన్ని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
9వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గొడవ పెట్టుకుంటుంటే ఆపిన తులసి.. ముందుగా లాస్యకు కొన్ని విలువైన సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత నందూతో మాట్లాడి అతడి మనసును కూడా మార్చుతుంది. దీంతో నందూ వెళ్లి లాస్యకు సారీ చెప్పి తన ఇంట్లో వాళ్లతో కలిసి ఉండమని చెప్తాడు. కానీ, లాస్య మాత్రం ఈ ఇంట్లోని వాళ్లను రోడ్డు మీదకు ఈడుస్తానని మనసులో అనుకుంటుంది. మరోవైపు, తులసి తన కోరికలను గుర్తు చేసుకుని తల్లికి ఫోన్ చేసి ఇంటికి వస్తానని అంటుంది. మరోవైపు, తనకు ఫస్ట్ ర్యాంక్ కావాలని సామ్రాట్‌ను హానీ కోరుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
10వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు ఎగ్జామ్స్‌లో ఫస్ట్ ర్యాంక్ కావాల్సిందే అని హనీ.. సామ్రాట్‌ను అడుగుతుంది. దీనికతడికి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు హనీ.. దేవుడిని మనసు పెట్టి అడిగితే ఏదైనా ఇస్తాడని తులసి ఆంటీకి చెప్పావుగా అలా అడుగు అంటుంది. తర్వాత తులసి తన తల్లి దగ్గరకు వెళ్లి కష్ట సుఖాలు మాట్లాడుకుంటుంది. అనంతరం సామ్రాట్‌ను కలవగా హనీ కోరిక గురించి ఆమెకు చెబుతాడు. దీంతో దేవుడిని నమ్మి కోరిక కోరుకోమని సామ్రాట్‌కు తులసి సూచిస్తుంది. ఇక, ఇంట్లో శృతిని లాస్య తన మాటలతో అవమానిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
డిసెంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో ఇంటిని తన పేరు మీద రాయించుకుందన్న కోపంతో నందూ.. లాస్యతో గొడవకు దిగుతాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేస్తుంది. వాళ్ల పంచాయతీని తులసి తీర్చి ఇద్దరినీ కలుపుతుంది. మరోవైపు, తులసి తన తల్లి దగ్గరకు వెళ్లగా కోర్టులో కేసు గెలిస్తే ఇల్లు మనకు వచ్చేస్తుందని గుడ్ న్యూస్ చెబుతుంది. ఇక, హనీ తన ఫస్ట్ ర్యాంక్ కోసం సామ్రాట్‌ను ఇబ్బంది పెడుతుంది. దీంతో తులసితో కలిసి గుడిలోకి వెళ్తాడు. అప్పుడు తులసి ఏ కోరిక రాసిందో చూసేందుకు ప్రయత్నించి దొరికిపోతాడు.


Click it and Unblock the Notifications











