Intinti Gruhalakshmi Weekly Roundup: ఆమె ప్లాన్ వర్కౌట్.. నందూ కెఫే మూసివేత.. రసవత్తరంగా మారిన కథ
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది.
దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గాయత్రి దగ్గర అభి డబ్బులు తీసుకోవడంతో తులసి క్లాస్ పీకుతుంది. మరోవైపు, నందూ తనను పట్టించుకోవడం లేదని బాధ పడుతోన్న లాస్యకు అతడి జేబులో నెక్లెస్ కనిపిస్తుంది. దీంతో తన కోసమే అది తెచ్చాడని అనుకుంటుంది. కానీ, నందూ మాత్రం దాన్ని తులసికి ఇవ్వాలని అనుకుంటాడు. ఇందుకోసం తులసితో కలిసి వెళ్లాలని తన కారును పాడు చేసుకుంటాడు. అలాగే, లాస్య రాకుండా ఉండేందుకు ఆమె చీరను చెడగొడతాడు. కానీ, తులసికి ఇవ్వాలని అనుకున్న అతడి ప్లాన్ మాత్రం బెడిసి కొడుతుంది.

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
14వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ పాకెట్‌లో నెక్లెస్ తనకు ఇవ్వడానికే తెచ్చాడని అనుకున్న లాస్య అతడిని ఉడికించేలా మాట్లాడుతుంది. కానీ, నందూ మాత్రం దాని గురించి బయట పెట్టడు. దీంతో లాస్య వాలంటైన్స్ డేన ఇస్తాడేమో అనుకుంటుంది. కానీ, నందూ మాత్రం తులసికి నెక్లెస్ ఇవ్వడానికి తిప్పలు పడుతుంటాడు. అప్పుడామెను క్యారమ్స్ ఆడడానికి రమ్మనగా అందరూ వస్తారు. ఇక, ఉదయాన్నే ఇవ్వాలని అనుకోగా సామ్రాట్ వస్తాడు. ఇక, కెఫేలో ప్రేమ్ వాళ్ల బ్యాచ్ వచ్చి డెకరేషన్ చేస్తుంది. అనంతరం అక్కడ వాలంటైన్స్ డే జరుపుతారు.

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
15వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ్ తన తల్లి తులసికి గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు. ఆ తర్వాత కెఫేలో అందరూ పార్టీ చేసుకుంటారు. ఆ సమయంలోనే లాస్య తనకు నందూ నెక్లెస్ ఇస్తాడని అనుకుంటూ ఉంటుంది. అలాగే, నందూ.. తులసికి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటాడు. అంతలో సామ్రాట్ అక్కడకు వస్తాడు.
ఇక, సాయంత్రం పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు తనకు నందూ నెక్లెస్ కొన్నాడని లాస్య అందరికీ చెబుతుంది. దీంతో నందూ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆమె మెడలో ఆ నెక్లెస్‌ను అలంకరిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద క్లిక్ చేయండి.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ కొనుక్కొని వచ్చిన నెక్లెస్‌ను లాస్య తన మెడలో అలంకరించుకుంటుంది. ఆ తర్వాత అందరూ గేమ్ ఆడగా.. తులసి మాత్రమే మిగులుతుంది. దీంతో ఆమెను కూడా ఆడమంటారు. అప్పుడామెకు పార్ట్‌నర్‌కు గులాబీ పువ్వు ఇవ్వాలని వస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లు అందరికీ అందిస్తుంది.
ఇక, అభి తనకు ఇచ్చిన డబ్బులను గాయత్రికి ఇచ్చేస్తాడు. అంతేకాదు, తన సొంత డబ్బుతోనే అంకితను యూఎస్ తీసుకెళ్తా అంటాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి నందూ కెఫేను మూయించాలని కన్నింగ్ ప్లాన్లు రెడీ చేసుకుంటుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

17 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
17వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గాయత్రి ప్లాన్ ప్రకారం నందూ కెఫేలో ఒక మనిషి పనిలో చేరుతాడు. అతడితో కలిసి కెఫేను మూయించే విధంగా గాయత్రి ప్లాన్ చేస్తుంది. ఇక, కెఫేలో తనకు నచ్చినట్లు జరగడం లేదని నందూతో లాస్య గొడవకు దిగుతుంది. మరోవైపు, అభి మారిపోవడంతో అంకిత చాలా సంతోషిస్తుంది.
ఆ సమయంలో బంగారం తెచ్చి ఇవ్వగా.. అభి మాత్రం వద్దని చెబుతాడు. అంతేకాదు, తన సొంత డబ్బులతో యూఎస్ తీసుకెళ్తానని అంటాడు. ఇంట్లో పూజ సందర్భంగా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
18వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఇంట్లో పూజకు అంతా సిద్ధం అవుతుంది. కానీ, ఆమె మాత్రం ఈసారి గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. నేను పూజ చేయను అంటుంది. అప్పుడే లాస్య వచ్చి పూజ చేస్తానని అనడంతో నందూ ఆమెను పద్దతిగా లేవని అంటాడు. ఆ సమయంలోనే నందూ కెఫేలోకి ఫుల్ ఇన్‌స్పెక్టర్లు రావడంతో నందూ, లాస్య, తులసి అక్కడికి వెళ్లిపోతారు. తర్వాత శాంపిల్స్ తీసుకుని వెళ్తూ తేడా వస్తే కెఫే మూసేస్తాం అంటారు. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత లాస్య.. నందూ, తులసిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో నందూ కొత్త కెఫే బిజినెస్‌నే మళ్లీ మళ్లీ హైలైట్ చేశారు. అంతేకాదు, అతడు తులసి కోసం నెక్లెస్ తీసుకోవడం.. అనుకోని పరిస్థితుల కారణంగా దాన్ని అతడు లాస్యకు ఇవ్వడం చూపించారు. ఇవన్నీ పక్కన పెడితే.. అభి మీద కోపంతో గాయత్రి నందూ కెఫేను మూసేయించాలని ప్లాన్ చేస్తుంది. అందుకు తగ్గట్లే తన మనిషిని వర్కర్‌గా పెట్టడం, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను పంపడం చేస్తుంది. దీంతో వచ్చే వారం కథ రసవత్తరంగా మారింది.


Click it and Unblock the Notifications











