Intinti Gruhalakshmi Weekly Roundup: దివ్య కోసం ఆ హీరో.. తులసికి మాత్రం విలన్‌గా.. సూపర్ ట్విస్ట్
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
20వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కెఫేలోని ఫుడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన తర్వాత తులసి చాలా టెన్షన్‌గా కనిపిస్తుంది. అంతా మంచే జరగాలని ఆమె పూజ చేసి ఉపవాసం ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే శాంపిల్స్‌కు పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. దీంతో చందూను గాయత్రి ఫోన్ చేసి తిడుతుంది. దీంతో తనకు తులసి సహాయం చేసిందని ఆమెకు చెప్పి షాకిస్తాడు. ఇక, అభి, అంకిత అమెరికా వెళ్లిపోడానికి సిద్ధం అవుతూ ఉంటారు. అది తెలిసినప్పటి నుంచి తులసి బాధగా ఉంటుంది. మరోవైపు, తులసికి దగ్గరవుతున్నాడని నందూను లాస్య ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
21వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటింటి గృహలక్ష్మి కథను మూడేళ్లు ముందుకు తీసుకు వెళ్లారు. ఇందులో కెఫేలో వచ్చే లాభాల్లో తులసికి వాటా ఇస్తానని నందూ అంటాడు. కానీ, దీనికి ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఆ తర్వాత ఇంట్లోని వాళ్లంతా కూర్చుని ఉండగా.. నందూకు ప్రేమ్ వాటర్ తెచ్చి ఇవ్వడంతో అతడు ఎమోషనల్ అవుతాడు. అనంతరం డాక్టర్ చదివేందుకు వెళ్లిన దివ్య తిరిగి వస్తుందని తెలుస్తుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. తులసి ఏకంగా గుడిలో 108 కొబ్బరి కాయలు కొడుతుంది. తర్వాత అందరూ కలిసి ఆమె కోసం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
22వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య వస్తుందని నందూ, లాస్య కారులో.. తులసి స్కూటీపై ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడామె పాపకు ఎగిరిపోయిన బెలూన్లను పట్టుకుని ఇస్తుంది. ఆ తర్వాత అవి కట్ చేసిన కుర్ర బ్యాచ్ దగ్గరకు వెళ్లి క్లాస్ పీకుతుంది. ఇక, బయటకు వచ్చిన వెంటనే తులసిని చూసి సంతోషిస్తుంది. అలాగే, తండ్రిని కూడా పలకరిస్తుంది. కానీ, లాస్యకు ఝలక్ ఇస్తుంది. అనంతరం తన లగేజ్‌ను నందూ కారులో పెట్టి.. తులసితో స్కూటీపై వెళ్తుంది. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత దివ్య అందరితో సంతోషంగా మాట్లాడుతూ డ్యాన్సులు కూడా చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద క్లిక్ చేయండి.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అభితో వీడియో కాల్ మాట్లాడుతోన్న సమయంలో అమ్మ కోరిక తీర్చడానికి క్లినిక్ పెడతాను అని దివ్య అంటుంది. దీంతో లాస్య వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు నందూ నిజంగా దివ్య చెప్పిన లాంటి పనే చేస్తానంటూ షాకిస్తాడు. అనంతరం దివ్య.. రాజ్యలక్ష్మీ అనే ఆస్పత్రికి ఇంటర్వ్యూకు వెళ్తుంది. అక్కడ వాళ్లు పక్కా కమర్షియల్‌గా ఆలోచిస్తూ ఉంటారు. అనంతరం దివ్య ఇంటర్వ్యూకు వచ్చిందని ఓ వ్యక్తి చెప్తాడు. దీంతో ఎండీ రాజ్యలక్ష్మి ఆమెను సీక్రెట్‌గా ఇంటర్వ్యూ చేయండి.. నేను మానిటర్‌లో నుంచి చూస్తాను అని చెప్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

24 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి ఇంటర్వ్యూకు వెళ్లిన దివ్యను ఓ పేషెంట్‌కు సర్జరీ చేయమని అడుగుతారు. ఈ విషయం తులసితో చెప్పగా ఆయన ఆశీర్వదించి పంపిస్తుంది. అనంతరం అదే ఆస్పత్రిలో బిల్ కట్టలేదని సర్జరీ చేయకపోవడంతో తులసి వాళ్లకు ఎదురు తిరుగుతుంది. అంతేకాదు, అక్కడే కూర్చుని నిరసన తెలుపుతుంది. దీంతో ఎండీ రాజ్యలక్ష్మి దిగొచ్చి మంచి నటిస్తూ నాటకం ఆడుతుంది. అనంతరం దివ్య సర్జరీ కరెక్టుగా పూర్తి చేయడంతో ఆమెకు ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత సీరియల్‌లో కొత్త కుర్రాడిని పరిచయం చేశారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కొత్తగా పరిచయమైన విక్రమ్ అనే కుర్రాడు తన ప్రియుడు కోసం తల్లితో గొడవ పడుతోన్న అమ్మాయికి క్లాస్ పీకుతాడు. అంతేకాదు, ఆమె లవర్ నిజస్వరూపం బయటపెట్టి బుద్ది వచ్చేలా చేస్తాడు. అనంతరం కారులో వస్తున్న సమయంలో దివ్యను చూసి ఫ్లాటైపోతాడు. మరోవైపు, దివ్యకు లాస్య ఓ పెళ్లి సంబంధం చూస్తుంది. ఆ విషయం తులసికి తెలిసి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కానీ, అబ్బాయి తండ్రి మాటలతో తులసి అంగీకరిస్తుంది. ఇక, చివర్లో విక్రమ్.. దివ్య పని చేయబోతున్న ఆస్పత్రి ఎండీ రాజ్యలక్ష్మి కొడుకే అని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో కథను మూడేళ్లు ముందుకు తీసుకు వెళ్లారు. అంతేకాదు, దివ్య డాక్టర్ చదువు పూర్తి చేసి ఇంటికి రావడాన్ని హైలైట్ చేసి చూపించారు. ఆ తర్వాత ఆమె ఇంటర్వ్యూకు వెళ్లడం.. అక్కడ తులసి గొడవ పడడం.. దివ్య కోసం కొత్త హీరో రావడం అంతా కొత్తగా ఆసక్తికరంగా చూపించారు. అయితే, దివ్య కోసం వచ్చిన హీరో ఎండీ కొడుకు కావడం సూపర్ ట్విస్ట్ అనిపించింది. అతడే తులసికి విలన్‌గా మారబోతున్నాడని తెలిసింది.


Click it and Unblock the Notifications











