Intinti Gruhalakshmi: దివ్య పెళ్లి చూపుల వెనుక మోసం.. ఆమె ప్లాన్ బట్టబయలు.. కథలో మరో బిగ్ ట్విస్ట్
జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దిగాలుగా ఉన్న విక్రమ్‌ను రాజ్యలక్ష్మి పిలిచి ఏమైందని అడుగుతుంది. అప్పుడతను ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవట్లేదని, ఆ ఆస్పత్రిని మూసేయాలని అంటాడు. అనంతరం దివ్య కోసం ఇంట్లో వాళ్లందరూ వేచి చూస్తుంటారు. ఆమె రాగానే లాస్య స్వీట్ ఇచ్చి పెళ్లి సంబంధం గురించి చెబుతుంది. దీంతో దివ్యకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత విక్రమ్‌కు ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చిన టీచర్ కాస్త ఓవర్ చేస్తుంది. అప్పుడతను ఎలాగోలా ప్లాన్ చేసి ఆమె నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య పెళ్లి విషయంపై తులసితో లాస్య, నందూ మాట్లాడుతుంటారు. ఎలాగోలా పెళ్లి చూపులకైనా దివ్యను ఒప్పించమని ఆమెను అడుగుతారు. కానీ, ఆమె మాత్రం ఒప్పుకోదు. చివరకు ఎలాగోలా తులసిని వాళ్లిద్దరూ ఒప్పిస్తారు. మరోవైపు, విక్రమ్ వాళ్ల నాన్న అన్నం తినడం మానేయడంతో అతడు వెళ్లి బ్రతిమాలి తినిపిస్తాడు. ఆ సమయంలో ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లి.. విక్రమ్‌కు అసలు రాజ్యలక్ష్మి సొంత తల్లి కాదని చూపిస్తారు. అంతేకాదు, విక్రమ్ పేరు మీద ఉన్న ఆస్తిని కాజేయడానికి ఆమె ప్లాన్లు చేసినట్లు కూడా గతాన్ని చూపిస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
01వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను రాజ్యలక్ష్మి ఎలా ప్లాన్ చేసి మోసం చేసిందో.. తనకు పక్షవాతం ఎలా వచ్చిందో అతడి తండ్రి చూపిస్తాడు. ఆ తర్వాత దివ్యతో పెళ్లి విషయమై మాట్లాడేందుకు అందరూ ప్రయత్నం చేయగా.. దివ్య మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోతుంది. ఇక, ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఓ బాబును యాక్సిడెంట్ అయిందని తీసుకు వస్తారు. ఆ సమయంలో యాక్సిడెంట్ చేసింది విక్రమ్ అనుకుని దివ్య అతడితో గొడవకు దిగడంతో పాటు డబ్బులను కూడా లాక్కుంటుంది. తర్వాత నిజం తెలుసుకుని చాలా బాధ పడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద క్లిక్ చేయండి.

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
02వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను వెతుకుతున్న దివ్య దగ్గరకు వెళ్లిన పేషెంట్ తల్లి.. డబ్బు ఇచ్చేశారా అని అడుగుతుంది. అప్పుడామె అతడు దొరకలేదు అని చెబుతుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన విక్రమ్‌ను రాజ్యలక్ష్మితో పాటు అందరూ టెన్షన్ పెడతారు. అంతేకాదు, అతడు ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతారు. దీంతో విక్రమ్ భయపడిపోతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి అతడిని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఇక, దివ్య ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లిన తులసి.. పెళ్లి చూపుల గురించి చెబుతుంది. అంతేకాదు, ఎలాగోలా మాట్లాడి ఆమెను దానికి మాత్రం ఒప్పిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

03 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
03వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ మాటలను గుర్తు చేసుకుని దివ్య నవ్వుతూ ఉండగా.. శృతి అక్కడకు వెళ్లి ఆమెను ఆట పట్టిస్తుంది. దీంతో జరిగిందంతా ఆమెకు వివరిస్తుంది. ఆ తర్వాత దివ్య పెళ్లి చూపులకు రెడీ అవుతుంది. ఆ సమయంలో లాస్య యమ ఓవర్ యాక్షన్ చేయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు, విక్రమ్ తన తల్లి చీరను ఐరన్ చేస్తుంటాడు. తర్వాత సంజయ్ కూడా వచ్చి షర్ట్ ఇస్తాడు. అప్పుడు అతడి పరిస్థితిని చూసిన తాతయ్య.. విక్రమ్ గురించి బాధ పడుతుంటాడు. ఇక, పెళ్లి వాళ్లు రావడంతో తులసి ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
04వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఎలాగోలా పెళ్లి చూపుల కోసం దివ్యను రెడీ చేసి తులసి తీసుకు వస్తుంది. ఒకరిని ఒకరు చూసుకున్న తర్వాత పెళ్లి కొడుకుతో మాట్లాడతానని దివ్య అంటుంది. దీనికి అతడు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ మాట్లాడతారు. కానీ, అతడి మాటలతో దివ్యకు కోపం వస్తుంది. ఆ వెంటనే లోపలికి వచ్చిన తర్వాత తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది. దీంతో తులసిని లాస్య నిందిస్తుంది. మరోవైపు, రాజ్యలక్ష్మికి విక్రమ్ తాతయ్య షాక్ ఇస్తాడు. దీంతో ఆమె అన్నం తినడం మానేస్తుంది. అప్పడు విక్రమ్ తాతపై కోప్పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య పెళ్లి చూపుల స్టోరీని బాగా హైలైట్ చేశారు. ఆమెకు ఇష్టం లేకున్నా పెళ్లి చూపుల కోసం ఒప్పిస్తారు. అలాగే, విక్రమ్.. దివ్యను చూసి ఆమె ప్రేమలో పడడం.. ఆ తర్వాత ఆస్పత్రిలో ఇద్దరూ కలుసుకోవడం వంటి వాటిని చూపించారు. మొత్తానికి పెళ్లి చూపల నుంచి తప్పించుకున్న దివ్యకు లాస్య ప్లాన్ తెలుస్తుంది. దీంతో ఇంట్లో మరో రచ్చ సాగనుంది. దీన్ని వచ్చే వారం మొత్తం చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











