Intinti Gruhalakshmi Weekly Roundup: ఒక్కటైన నందూ, తులసి.. ఆ విలన్స్ అంతా ఏకం.. మరిన్ని ట్విస్టులు
చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
06వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ కెఫే కోసం చూసిన రూమ్‌ను తులసి ఫ్యామిలీ మొత్తం చిటికెలే శుభ్రం చేసి పెడుతుంది. ఆ తర్వాత అనసూయ రెడీ చేసిన మెనూ విషయంలో డిస్కర్షన్ జరుగుతుంది. ఇక, ఇంట్లో అందరూ కూర్చుని కెఫే ఓపెనింగ్‌కు కావాల్సిన వస్తువుల గురించి రాస్తుండగా.. అభి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అభి మాటలతో నందూ ఒక్కసారిగా ఢీలా పడిపోతాడు. ఆ వెంటనే ఎమోషనల్‌గా మాట్లాడతాడు. అయినా అభి విమర్శిస్తూనే ఉంటాడు. దీంతో తులసి అతడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది.

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
07వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ కెఫే బిజినెస్‌ను అభి అవమానిస్తూ మాట్లాడడంతో తులసి ‘మీ నాన్న దొంగతనం చేసో.. ఎవరినో మోసం చేసే డబ్బు సంపాదించడం లేదు' అంటూ అతడికి క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత నందూ వెళ్లి అతడికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు, తమ విడాకులకు తులసి కారణం కాదని చెబుతాడు. ఇదంతా విన్న లాస్య అతడని తిట్టుకుంటుంది. ఇక, అభి మాటలతో తులసి బాధ పడుతూ ఉండగా.. పరందామయ్య వాళ్లు వెళ్లి ఆమెను ఓదార్చుతారు. అప్పుడు అభిని ఇంట్లో నుంచి వెళ్లిపోమందాం అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
08వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిని అందరూ నవ్వించే ప్రయత్నం చేస్తోన్న సమయంలో అభి వచ్చి ఆమెకు క్షమాపణ చెబుతాడు. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లంతా నందూ కొత్త కెఫే ఓపెనింగ్‌కు వెళ్తారు. అక్కడ పరందామయ్య, అనసూయతో రిబ్బన్ కటింగ్ చేయించి కెఫేను ఓపెనింగ్ చేయిస్తారు. ఆ సమయంలో లాస్య అన్నీ తానే చేస్తానని అంటుంది. ఇక, దీనికి గెస్టుగా వచ్చిన గాయత్రి.. నందూ, తులసి మధ్య ఏదో జరుగుతుందని లాస్యను రెచ్చగొడుతుంది. దీంతో ఆమె వెళ్లి తులసి పట్ల కఠువుగా ప్రవర్తించి ఇబ్బంది పెడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
09వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కెఫే ఓపెనింగ్ అయిన తర్వాత కస్టమర్లు రావడం లేదని అంతా అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తులసి ఓ ప్లాన్ వేస్తుంది. దీంతో అది వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఓ జంట వచ్చి ఒక ఆర్డర్ ఇస్తుంది. కానీ, అది చేయడం ఎవరికీ రాదని అంటారు. అప్పుడు తులసి అది రెడీ చేసి ఇస్తుంది. మొదటి అది బాలేదన్నట్లుగా కలరింగ్ ఇచ్చి సూపర్ ఉందని వాళ్లు అంటారు. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ, లాస్య మాత్రం కుళ్లుకుంటూ ఉంటుంది. ఇక, కెఫే ప్రమోషన్ కోసం తులసి సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

10 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
10వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ కెఫే ఓపెనింగ్ అయిన తర్వాత కస్టమర్లును మరింతగా ఆకట్టుకోవడం కోసం పాంప్లెట్లు పంచిపెట్టాలని తులసి ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ఇంట్లో వాళ్లంతా సహకరించాలని కోరుతుంది. కానీ, అభి మాత్రం దానికి ఒప్పుకోడు. పైగా అంకితను కూడా సహాయం చేయొద్దని అంటాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి గొడవ పడుతుంది. ఇక, తులసి ప్లాన్ వర్కౌట్ అవడంతో కెఫేకు కస్టమర్ల తాకిడి పెరిగిపోతోంది. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక, తులసి, నందూ దగ్గరవుతుండడంతో లాస్యకు అసహనం పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
11వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కెఫే బిజినెస్ సక్సెస్ అవడంతో నందూ.. ఇంట్లోని వాళ్లందరికీ గిఫ్టులు తెచ్చి ఇస్తాడు. ఆ సమయంలో తులసికి కూడా చీరను ఇస్తాడు. దాన్ని ఆమె తీసుకోవడంతో అందరూ సంతోషిస్తారు. అనంతరం మరో రెండు చోట్ల కూడా కెఫే బిజినెస్ పెడుతున్నట్లు తులసి చెబుతుంది. తర్వాత లాస్య తనకు నెక్లెస్ కావాలని అడుగుతుంది. ఇక, తన ఫ్రెండ్ ముందు తులసిపై నందూ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. అంతేకాదు, ఆమెకు నెక్లెస్ తీసుకున్నట్లు చెప్తాడు. ఇక, చివర్లో తమను విడగొట్టాలని ప్రయత్నిస్తుందని తులసిని అభి నిందిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో నందూ కొత్త కెఫే బిజినెస్‌ను హైలైట్ చేశారు. అంతేకాదు, అతడికి తులసి సహాయం చేసింది కూడా చూపించారు. అదే సమయంలో నందూ, తులసి మధ్య మళ్లీ బంధం బలంగా అవుతున్నట్లు కూడా కొన్ని సన్నివేశాలను చూపారు. అయితే, తులసికి లాస్య, గాయత్రి, అభి రూపంలో ఇబ్బందులు కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభి వల్ల తులసికి కొత్త చిక్కులు వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











