Intinti Gruhalakshmi Weekly Roundup: దివ్యపై అత్యాచారం.. అలా కనిపెట్టిన తులసి.. వాళ్ల రాకతో ట్విస్ట్

ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.

తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

16వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసితో చేసిన ఛాలెంజ్‌కు అనుగుణంగా ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలని లాస్య ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం నందూను సలహాలు అడుగుతుంది. ఆ తర్వాత ఇంట్లో అన్ని పనులు చేస్తున్నట్లు నటిస్తుంది. ఆ సమయంలో నందూకు సాంబార్ వడ్డిస్తూ అతడి షర్ట్ మీద పడేస్తుంది. దీంతో అతడు కోపంగా వెళ్లిపోతాడు.

తర్వాత అనసూయ కాళ్లు పడుతూ ఆమెను ఇబ్బంది పెడుతుంది. ఇక, ఆఫీసులో తులసి తన కోరికలను సామ్రాట్‌కు చెప్తుంది. దీంతో తులసికి అతడు అమెరికన్ ప్రాజెక్టును డీల్ చేయమని అప్పగిస్తున్నట్లు చెబుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

17వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ అమెరికన్ ప్రాజెక్టు అప్పగిస్తానని చెప్పడంతో తులసి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. ఆ సమయంలో అంకిత మాట్లాడిన మాటలు శృతిని బాధ పెడతాయి. దీంతో తులసితో పాటు అంకిత వెళ్లి శృతికి క్షమాపణలు చెబుతారు. ఆ తర్వాత ప్రేమ్ కరిగిపోయిన ఐస్‌క్రీం తెచ్చి ఇవ్వడంతో అందరూ సరదాగా నవ్వుకుంటారు.

ఆ తర్వాత నందూ ఇంటర్వ్యూకు వెళ్తుండగా తులసి చేతిలో హారతి పళ్లెం లాస్య లాక్కుంటుంది. ఇక, తనకు కొత్త ల్యాప్‌టాప్ కొనివ్వాల్సిందే అని తులసితో దివ్య గొడవకు దిగుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

18వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటర్వ్యూ కోసం నందూ కారులో వెళ్తుండగా బ్యాంక్ వాళ్లు ఆపి తాళం తీసుకుని వెళ్లిపోతారు. ఇక, సామ్రాట్ మాత్రం తులసికి ఓ మీటింగ్‌లో పాల్గొనాలని చెబుతాడు. దీంతో ఆమె కొందరితో సమావేశం అవుతుంది.

అప్పుడు వాళ్లు ఇంగ్లీష్‌‌లో మాట్లాడుతుండడంతో తెలుగులో చర్చించమని వాళ్లకు క్లాస్ పీకుతుంది. దీంతో అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు. ఫలితంగా మీటింగ్ సక్సెస్ అవుతుంది. మరోవైపు, దివ్యను బుట్టలో వేసుకునేందుకు లాస్య ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ఆమెకు స్వయంగా ల్యాప్‌టాప్ కొనిస్తానని హామీ ఇస్తుంది.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

19వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన కారును బ్యాంకు వాళ్లు తీసుకెళ్లిపోయారన్న విషయాన్ని నందూ ఇంట్లోని వాళ్లకు చెబుతాడు. దీంతో తులసి అతడిని ఓదార్చుతూనే క్లాస్ పీకుతుంది. అనంతరం లాస్య వచ్చి అతడిని లక్షన్నర కావాలని అడుగుతుంది. దీనికతడు కుదరదు అని చెప్పడంతో దివ్యకు తన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌ను ఇస్తుంది.

ఆ సమయంలో ఆమెను మరింతగా రెచ్చగొట్టి తులసి మీద కోపాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. తర్వాత దివ్య తన తల్లికి అబద్ధం చెప్పి ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్లాలని అనుకుంటుంది. అందుకు లాస్య కూడా సహాయం చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

20 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసికి అబద్ధం చెప్పిన దివ్య.. లాస్య సహాయంతో ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్తుంది. అక్కడ ఇద్దరు కుర్రాళ్లు ఆమెకు డ్రింక్‌లో మత్తు మాత్రలు వేసి తాగిస్తారు. దీంతో దివ్యకు మత్తుగా ఉంటుంది. ఇక, తను ఎంత సేపటికీ రాకపోవడంతో ఇంట్లో వాళ్లు టెన్షన్ పడుతుంటారు.

అప్పుడు లాస్య ద్వారా నిజం తెలుసుకున్న నందూ.. దివ్య పార్టీకి వెళ్లిందన్న నిజాన్ని ఇంట్లో వాళ్లకు చెబుతాడు. దీంతో లాస్యపై తులసి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. ఆ తర్వాత దివ్య తనకు లొకేషన్ పంపించిందని లాస్య ఇంట్లోని వాళ్లకు చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

21వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి నిజం తెలుసుకున్న తర్వాత ప్రేమ్, తులసి, నందూలు ఆమెను వెతుక్కుంటూ వెళ్తారు. అదే సమయంలో తన స్నేహితులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటారు. ఇక, లాస్యకు పంపిన లొకేషన్‌ ఆధారంగా తులసి, ప్రేమ్ అక్కడకు వెళ్లగా ఆమెను కారులో తీసుకెళ్లిన విషయం వాచ్‌మన్ చెప్తాడు.

అనంతరం దివ్యను ఓ రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు, జీపీఎస్ ఆధారంగా దివ్య ఫోన్‌ను కనిపెట్టవచ్చని తులసి అనడంతో ప్రేమ్.. ఆ దిశగా ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

జనవరి 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో దివ్య తులసిని ఎదిరించడం, దీన్ని అదునుగా చేసుకుని లాస్య ఆమెను బుట్టలో వేసుకోవడాన్ని ప్రధానంగా చూపించారు. అంతేకాదు, చివర్లో దివ్యను ఫ్రెండ్స్ కిడ్నాప్ చేయడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. ఇక, తులసి ప్లాన్ చేసి దివ్య ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడం కూడా ప్రోమోలో చూపించారు. అయితే, నందూ పోలీసుతో మాట్లాడడం, తులసి వాళ్లు వచ్చింది కార్తీక్ ఫ్రెండ్ చూడడంతో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X