Intinti Gruhalakshmi Weekly Roundup: తులసి గురించి తెలిసిన నిజం.. ఇంట్లో నుంచి పంపేస్తూ.. కథలో మలుపు
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
23వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రూమ్‌లో దివ్య తనను వదిలేయమని కార్తీక్‌ను బ్రతిమాలుతుంది. కానీ, అతడు మాత్రం అస్సలు వినడు. మరోవైపు, నందూ తన పోలీస్ ఫ్రెండ్ సహాయాన్ని కోరుతాడు. అదే సమయంలో తులసి జీపీఎస్ ఆధారంగా దివ్య ఉన్న ఇంటికి వస్తుంది. అప్పుడు ప్రేమ్, తులసి కలిసి దివ్యను కాపాడతారు. ఆ సమయంలోనే నందూ అక్కడకు వస్తాడు. అప్పుడు ఆ కుర్రాళ్లను ఎన్‌కౌంటర్ చేయమనగా.. వాళ్లు ప్రాధేయపడతారు. అనంతరం తులసి.. దివ్యను ఇంటికి తీసుకెళ్లి.. ఆమెను జాగ్రత్తగా చూడమని అందరికీ చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యకు అన్న తినిపిస్తూ తులసి కొన్ని జాగ్రత్తలు చెబుతుంది. అలాగే, పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎలా భయపడుతూ బతుకుతారు అనేది వివరిస్తుంది. దీంతో దివ్య ఇకపై ఎప్పుడూ తప్పు చేయనని తల్లికి హామీ ఇస్తుంది. అనంతరం తులసిలా మారాలనుకున్న లాస్య ఉదయాన్నే లేపమని రాములమ్మకు చెబుతుంది. దీంతో బకెట్ నీళ్లు కొట్టి లేపుతుంది. మరోవైపు, ఇక నుంచి ఇంట్లో వాళ్లకు ఏం కావాలన్న లాస్య గారే చేస్తారంట అని రాములమ్మ ఇంట్లో వాళ్లకు చెబుతుంది. చివర్లో శృతిని చూసి టెంప్ట్ అయిన ప్రేమ్.. ఆమెను హగ్ చేసుకుంటాడు.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిలా మారేందుకు ప్రయత్నిస్తున్న లాస్యను ఇంట్లో వాళ్లంతా హేళన చేసి మాట్లాడుతుంటారు. అంతేకాదు, నువ్వెందుకు అలా మారాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తారు. దీంతో తనకు పబ్లిసిటీ కావాలని, అందుకే ఇలా చేశానని అంటుంది. ఆ సమయంలోనే నందూ వచ్చి కూడా లాస్యను అవమానిస్తాడు. అనంతరం భాగ్య అక్కడకు ఎంట్రీ ఇస్తుంది. అంతేకాదు, లాస్యకు కొన్ని సలహాలు ఇస్తుంది. ఇక, చివర్లో దివ్య అడ్మీషన్ లెటర్ చూసిన నందూ కోపంతో ఊగిపోతాడు. తనకు చెప్పకుండా ఎందుకు అప్లై చేశారని తులసిపై ఓ రేంజ్‌లో సీరియస్ అయిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అందరూ తన మాటను వ్యతిరేకించడంతో దివ్యను ఢిల్లీ పంపేందుకు నందూ అంగీకరిస్తాడు. ఆ తర్వాత నందూ కారు కావాలని అడిగితే అభి ఇవ్వనంటాడు. ప్రేమ్ బైకును కూడా ఇవ్వనని చెబుతాడు. దీంతో నందూ బాధ పడతాడు. అది చూసిన తులసి అతడికి జాబ్ చూడాలని అనుకుని.. దివాకర్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తుంది. అతడితో సీక్రెట్‌గా మాట్లాడి నందూకు జాబ్ వచ్చేలా చేస్తుంది. అనంతరం దివాకర్.. నందూకు ఫోన్ చేసి ఉదయాన్నే ఇంటర్వ్యూకు రమ్మని చెబుతాడు. నందూకు సాయం చేసినందుకు పరందామయ్య ప్రశ్నించగా.. కుటుంబం కోసమే చేశానని తులసి అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

27 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి రికమెండ్ చేసిన దివాకర్ కంపెనీకి నందూ ఇంటర్వ్యూకు వెళ్లేందుకు బయలుదేరుతాడు. తులసి ఇంట్లో సంక్రాంతి వేడుకల కోసం మాధవి, మోహన్ కూడా వస్తారు. ఇక, నందూ అక్కడకు వెళ్లగానే ఇంటర్వ్యూకు వచ్చిన యంగ్ బ్యాచ్ మొత్తం ఆయనను హేళన చేసి మాట్లాడుతుంది. దీంతో నందూ వాళ్లకు క్లాస్ పీకుతాడు. ఆ వెంటనే దివాకర్ బయటకు వచ్చి.. సీసీ కెమెరాల ద్వారా ఇంటర్వ్యూ జరిగిందని, ఇందులో నందూ సెలెక్ట్ అయ్యాడని చెబుతాడు. ఇక, తులసి ఇంట్లో జరిగిన ముగ్గుల పోటీలో మాధవి గెలిచినట్లు జడ్జ్ మోహన్ ప్రకటిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు ఉద్యోగం వచ్చిందని నందూ తనలో తాను సంతోషపడుతూ ఉంటాడు. కానీ, అక్కడకు వచ్చిన కొందరు మాత్రం తులసి వల్లే వాడికి ఉద్యోగం వచ్చిందంట. టాలెంట్ లేకపోయినా ఆడది రికమెండ్ చేయడంతో ఇచ్చారు అని అంటారు. దీంతో నందూ అపాయింట్‌మెంట్ లెటర్‌ను చించేసి ఇంటికెళ్లి తులసితో గొడవ పెట్టుకుంటాడు. కావాలనే తనను బానిసగా మార్చుకోవడానికి తులసి ప్లాన్ చేసిందని అంటాడు. దీంతో తులసి సమాధానం చెబుతుంది. అయినా వినకపోవడంతో ఇంకెప్పుడూ మీ విషయంలో జోక్యం చేసుకోనని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
జనవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో నందూకు జరుగుతోన్న అవమానాలను చూసి చలించిన తులసి.. అతడికి ఉద్యోగం ఇప్పించాలని అనుకుంటుంది. అలాగే, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం మాధవిని ఇంటికి పిలుస్తుంది. తర్వాత సంక్రాంతి సంబరాలు చేయడంతో అంతా హ్యాపీనే అన్నట్లు చూపించారు. కానీ, చివర్లో ట్విస్ట్ ఇచ్చి నందూకు నిజం తెలిసేలా చేశారు. దీంతో నందూ, తులసి మధ్య మళ్లీ గొడవలు ఉండబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇక, వచ్చే వారం దివ్యను ఢిల్లీ పంపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











