Intinti Gruhalakshmi Weekly Roundup: చావు బతుకుల్లో తులసి.. చేదు నిజం చెప్పిన డాక్టర్.. కథలో మలుపు

దాదాపు ఇరవై ముప్పై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

 2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


2వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి వల్లే శృతికి సమస్య వచ్చిందని నందూ ఆరోపించగా.. అందరూ దీన్ని తప్పుబడతారు. కానీ, ఎప్పటికీ తులసి ఈ ఇంటికి చుట్టమే అని అంటాడు. అనంతరం రిపోర్టులను ట్రాన్స్‌లేషన్ ఎలా చేయాలో తులసి దివ్య దగ్గర నేర్చుకుంటుంది. అనంతరం సామ్రాట్ కంపెనీలో మీటింగ్‌కు హాజరు కాకుండా బెనర్జీ అనే వ్యక్తం గురించి తెలుసుకుంటుంది. ఆ తర్వాత అతడితో సామ్రాట్ డీల్ చేసుకుంటూ ఉండగా తులసి ఆపుతుంది. అంతేకాదు, అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టి కాంట్రాక్ట్ చేయకుండా అడ్డుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


3వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బెనర్జీతో డీల్ వద్దని అనగానే అతడు తులసిపై ఫైర్ అవుతాడు. ఆ సమయంలో నీ కాంట్రాక్ట్ ఎక్కడా సెట్ కాకుండా చేస్తానంటూ తులసి ఛాలెంజ్ చేస్తుంది. మరోవైపు, శృతి టెర్రస్ మీద ఉండగా ప్రేమ్ ఆమెకు తల తుడుస్తాడు. అనంతరం అంకిత అక్కడకు రావడంతో గతంలో జరిగిన అబార్షన్ గురించి మాట్లాడుకుంటారు. అదంతా విన్న లాస్య తనకు మరో ఆయుధం దొరికిందని అనుకుంటుంది. ఇక, సామ్రాట్ తులసిని కంపెనీకి సీఈవోను చేస్తానని అంటాడు. ఆ తర్వాత హనీతో తులసి మాట్లాడి ఉత్సాహ పరుస్తుంది.

 4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


4వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతి సరసాలాడుతూ ఉండగా దివ్య, అంకిత, అభిలు వచ్చి వాళ్లను ఆట పట్టిస్తుంటారు. అప్పుడే లాస్య అక్కడకు వచ్చి అంకితకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో అంకిత చాలా బాధ పడుతుంది. మరోవైపు, తులసి, సామ్రాట్, హనీలు గుడికి వెళ్తారు. అదే ఆలయంలో పరందామయ్య, అనసూయలు కూడా ఉంటారు. అప్పుడు పరందామయ్య ప్రసాదం ఎక్కువ కావాలని అడగడంతో ఓ వ్యక్తి ఆయనను అవమానిస్తాడు. మరోవైపు లాస్య మాటలకు అంకిత బాధ పడుతుంటే శృతి ఓదార్చుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


5వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసితో గొడవ పెట్టుకున్న బెనర్జీ లాస్యకు ఫోన్ చేసి ఓ కాంట్రాక్ట్ ఇస్తున్నానని, అందుకోసం తన కంపెనీకి రావాలని చెప్తాడు. దీంతో లాస్య నందూకు అబద్ధం చెప్పి మరీ అతడి ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ ఓ ఫైల్ ఇచ్చి.. ఆమె పేరు మీద ఓ కంపెనీని స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతాడు. ఇక, గుడిలో పరందామయ్య, అనసూయ తమ కష్టాల గురించి మాట్లాడుతుండగా విన్న తులసి.. వాళ్ల కోసం సరుకులు తీసుకుని వెళ్తుంది. దీంతో నందూ ఆమెను ప్రశ్నిస్తాడు. అప్పుడామె లాస్య ఇంట్లో పెట్టిన కండీషన్స్ గురించి బయటపెట్టి షాకిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

6 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

6 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


6వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్య ఇంట్లో చేస్తున్న పనులు అన్నింటిని శృతి, అంకిత, దివ్యలు బయటపెడతారు. ఆ సమయంలో నందూపై తులసి అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో నందూకు పట్టలేని కోపం వస్తుంది. అప్పుడే లాస్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కానీ, లాస్య మాత్రం తనదైన మాటలతో అతడిని కూల్ చేసేస్తుంది. అనంతరం తులసి ఇంటికి వెళ్లగానే సామ్రాట్ ఆమెకు ఫోన్ చేసి బెనర్జీ కాంట్రాక్టును లాస్య, నందూ తీసుకుంటున్నారని చెబుతాడు. దీంతో షాకైపోయిన తులసి వాళ్లు ఆ తప్పు చేయకుండా ఉండేలా చూస్తానని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


7వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బెనర్జీ చేస్తున్న మోసం గురించి లాస్య, నందూకు చెప్పి హెల్ప్ చేయాలని తులసి అనుకుంటుంది. కానీ, వాళ్లు మాత్రం ఆమె మాటను అస్సలు వినరు. దీంతో కోపంగా ఇంటికి వెళ్లిపోతుంది. ఆ సమయంలోనే తులసి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత మేల్కొని కొడుకులకు ఫోన్ చేసినా చూసుకోరు. దీంతో సామ్రాట్‌కు కాల్ చేస్తుంది. అప్పుడు అతడు వెంటనే అక్కడకు వచ్చి తులసిని చూసి ఆస్పత్రిలో చేర్పిస్తాడు. మరోవైపు, లాస్య, నందూ తాము కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నట్లు ఇంట్లో వాళ్లకు చెబుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

జనవరి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో బెనర్జీ చేస్తున్న మోసాన్ని గుర్తించిన తులసి డీల్ చేసుకోకుండా జాగ్రత్త పడితే.. ఆయన లాస్యను పట్టుకుని కాంట్రాక్ట్ అప్పగిస్తాడు. ఈ విషయం తెలిసిన తులసి వాళ్లకు సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ, వాళ్లు మాత్రం పట్టించుకోరు. ఇక, తులసి కింద పడిపోయి ఆస్పత్రిలో చేరుతుంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని, కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ చెబుతారు. దీంతో ఇది ఎమోషనల్‌గా సాగబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X