Intinti Gruhalakshmi Weekly Roundup: తులసి లైఫ్‌లోకి కొత్త విలన్.. విడిపోతున్న కుటుంబం.. కథలో మలుపు

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


30వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిపై నందూ కోప్పడిన విషయాన్ని గుర్తు చేసుకుని ఇంట్లో వాళ్లంతా బాధ పడుతూ ఉంటారు. అప్పుడామె వచ్చి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఎప్పటికీ నందూకు లొంగిపోయే ఉంటావా అన్నట్లుగా వాళ్లు ప్రశ్నిస్తారు. దీంతో తులసి వాళ్లకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత నందూ తన కోసం రాడని దివ్య బాధపడుతుంది. దీంతో తులసి వెళ్లి అతడిని బ్రతిమాలుతుంది. అప్పటికే లాస్య నందూను రెచ్చగొడుతుంది. దీంతో నందూ తప్పక ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఏడుస్తూ ఆమెను ఢిల్లీకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తారు.

 31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


31వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఎంతో బాధను దిగమింగుకుని దివ్యను ఢిల్లీకి పంపిస్తారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత తులసి ఫోన్‌లో ఫొటో చూసి బాధ పడుతూ ఉంటుంది. అదే సమయంలో నందూ గార్డెన్ ఏరియాలో గునపంతో తవ్వుతూ ఉంటాడు. ఇది చూసి షాకైన తులసి అతడిని ప్రశ్నించగా.. కోపంతోనే ఇలా చేస్తున్నానని చెప్తాడు. దీంతో అతడికి క్లాస్ పీకుతుంది. ఇక, అందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే పరందామయ్య భూమి కబ్జాకు గురైన భూమి విషయంలో కోర్టులో గెలిచినట్లు లెటర్ వస్తుంది. అది చూసిన నందూ, లాస్య దానిపై కన్నేస్తారు. కానీ, ఆయన తులసి సలహాలు అడుగుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


01వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు దక్కిన ఆస్తిని ఏం చేయాలని పరందామయ్య.. తులసిని అడగ్గా.. ఆమె తన పిల్లల పేరు మీద పంచమని సలహా ఇస్తుంది. కానీ, అప్పుడు నందూ వచ్చి తనకు ఆస్తి కావాలని అంటాడు. దీనికి పరందామయ్య కుదరదని అనడంతో తులసిని అడుగుతాడు. అప్పుడామె పిల్లలనే అడగమని అతడికి చెప్తుంది. దీంతో నందూ వాళ్లను అడగ్గా ఒప్పుకోరు. అంతేకాదు, ప్రేమ్ మరీ దారుణంగా అవమానిస్తూ మాట్లాడతాడు. దీంతో నందూకు కోపం వస్తుంది. ఆ వెంటనే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి గులాబీ మొక్కను చేతికి గుచ్చుకుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద క్లిక్ చేయండి.

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


02వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ గాయం చేసుకుని బాధ పడుతుంటే తులసి అతడికి క్లాస్ పీకుడుతుంది. అంతేకాదు, కెఫే పెట్టుకోమని అతడికి సలహా కూడా ఇస్తుంది. దీంతో నందూ ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. కానీ, లాస్య మాత్రం నందూ కెఫే పెట్టడం తనకు ఇష్టం లేదని చెబుతుంది. ఆ తర్వాత ప్రేమ్‌కు పరందామయ్య ఇచ్చిన స్థలంలో నందూ కెఫే పెట్టుకోడానికి కొంచెం ఇవ్వమని తులసి అంటుంది. దీంతో అతడు ఎంతగానో నిరాశ చెందుతాడు. అప్పుడు తులసి తన కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

03 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

03 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


03వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూకు స్థలం ఇవ్వడానికి ప్రేమ్ అంగీకరించకపోవడంతో తులసి అతడిని సముదాయించే ప్రయత్నం చేస్తుంది. చాలా సేపు మంచిగా వివరించి చెప్పిన తర్వాత అతడు ఒప్పుకుంటాడు. కానీ, తనకు ఎవరూ సహకరించడం లేదని నందూ కెఫే పెట్టనంటాడు. దీంతో తులసి అందరి ముందే ప్రేమ్ ఒప్పుకున్నట్లు చెబుతుంది. అంతేకాదు, ఆ కెఫేకు లక్కీ పేరును పెడదామని కూడా అంటుంది. ఇక, గాయత్రి ఇంటికి వెళ్లిన అభితో అంకితను తన ఇంటికి తీసుకొచ్చేలా రెచ్చగొడుతుంది. అలాగే, ఓ అదిరిపోయే ప్లాన్‌ను కూడా వివరిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


04వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గాయత్రి.. అభిని ఎంతగానో అవమానించి ప్లాన్ అమలు చేయమని పంపుతుంది. ఆ వెంటనే అతడు అంకిత కూడా తాను పని చేస్తున్న ఆస్పత్రికే రావాలని గొడవ చేస్తాడు. చివరకు ఎలాగోలా ఒప్పిస్తాడు. మరోవైపు తులసి ద్వారా నందూ కెఫే ఐడియా గురించి తెలుసుకున్న సామ్రాట్ తన స్నేహితుడి పాత కెఫే ఉందని చెబుతాడు. దీనికి నందూ కూడా ఓకే అంటాడు. ఇక, కెఫేకు కావాల్సిన పెట్టుబడి గురించి చర్చ జరుగుతుంది. అప్పుడు గాయత్రి.. మేము వేరు కాపురం పెడితే డబ్బులు ఇస్తుంది అని అభి చెప్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో పరందామయ్యకు పాత ఫ్లాట్ చేతికి రావడం.. దాన్ని తన మనవళ్లు, మనవరాలు పేరు మీద రాయడం హైలైట్ చేశారు. అదే సమయంలో తులసి సలహాతో నందూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడాన్ని కూడా చూపించారు. అంతేకాదు, నందూ కోసం సామ్రాట్ కూడా రంగంలోకి దిగాడు. అయితే, గాయత్రి ఎంట్రీతో అభిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇది తులసికి కొత్త తలనొప్పులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X