Intinti Gruhalakshmi Weekly Roundup: సామ్రాట్ మనసులో తులసి.. రెండో పెళ్లిపై నిర్ణయం.. కథలో మరో మలుపు

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


9వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బిజినెస్ ఐడియా గురించి నందూ వాళ్లు చెప్పగానే ఇంట్లో వాళ్లంతా అతడికి షాకిచ్చేలా మాట్లాడతారు. ఆ సమయంలోనే తులసి ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని సామ్రాట్, పరందామయ్యకు ఫోన్ చేసి చెప్తాడు. దీంతో అందరూ అక్కడకు వెళ్తారు. ఆ సమయంలో ఆమెకు నయం కావాలని దేవుడిని కోరుకుంటారు. ఇక, తులసి భర్తగా సామ్రాట్ సంతకం చేశాడని తెలుసుకున్న లాస్య పెద్ద రచ్చనే చేస్తుంది. దీంతో దీపక్ ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో పాటు పరువు తీసేస్తాడు. దీంతో నందూ అతడిని కొడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దీపక్‌ను కొట్టిన నందూపై సరస్వతి సీరియస్ అవుతుంది. అంతేకాదు, లాస్య కూడా నోటికొచ్చినట్లు ఒదురుతుంది ఆమెను కొట్టరా అని దీపక్‌ను పంపుతుంది. కానీ, వద్దులే అని ఆపుతుంది. ఆ తర్వాత వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోమని అనడంతో వెళ్లిపోతారు. ఇక, తులసి, సామ్రాట్ గురించి వాళ్లు అలా మాట్లాడడాన్ని సరస్వతి తప్పుబడుతుంది. మరోవైపు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంటిని తాకట్టు పెడదామని నందూకు లాస్య సలహా ఇస్తుంది. ఇక, తులసిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకు వస్తారు.

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలో గొడవ తర్వాత ఇంటికి వచ్చిన నందూను లాస్య రెచ్చగొడుతుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ వచ్చిన తర్వాత నందూ వాళ్లపై సీరియస్ అవుతాడు. దీంతో అందరూ అతడిపై తిరగబడతారు. ఆ సమయంలో నందూ ఇంటికి తాకట్టు పెట్టి బిజినెస్‌కు పెట్టుబడి పెట్టబోతున్నట్లు చెబుతాడు. ఆ వెంటనే ఈ విషయాన్ని శృతి.. తులసికి ఫోన్ చేసి చెబుతుంది. ఇక, ప్రేమ్ జీతం డబ్బులను లాస్య లాక్కుంటుంది. దీంతో శృతిని ఆస్పత్రిలో చూపించడం కోసం తులసి ప్రేమతో గిఫ్టుగా ఇచ్చిన గిటార్‌ను అతడు తాకట్టు పెట్టేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

12వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య, అనసూయకు అన్నానికి బదులుగా పచ్చి కూరగాయలు కోసుకొచ్చి లాస్య తినమంటుంది. దీంతో వాళ్లు అవి తినలేమని చెబుతారు. మరోవైపు, తులసికి ప్రశాంతతను అందించడం కోసం సామ్రాట్ ఓ పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడకు పరందామయ్య, అనసూయ వచ్చి దొంగతనంగా భోజనం చేయబోతారు. దీంతో సెక్యూరిటీ గార్డు చూసి గొడవ చేస్తాడు. తర్వాత తులసి ఫ్యామిలీ మెంబర్స్ అని తెలిసి ఆమెపైనా గొడవ చేస్తారు. ఇక, వాళ్ల పరిస్థితిని తెలుసుకున్న తులసి శాశ్వతంగా ఆ ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

13 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

13 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

13వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి తన ఇంటికి వెళ్తుందన్న విషయం తెలిసిన సామ్రాట్ ఆమెను ఇంకా ప్రోత్సహిస్తాడు. మరోవైపు, లాస్య, నందూ ఓ సేట్‌ను తీసుకొచ్చి ఇంటిని చూపిస్తారు. అతడికి డాక్యూమెంట్లు ఇచ్చిన సమయంలో తులసి అక్కడకు వెళ్లి అవి రిజిస్ట్రేషన్ కాలేదని అంటుంది. దీంతో సేట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందూ, లాస్యపై తులసి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. అంతేకాదు, ఇకపై ఇంట్లోనే ఉంటానని చెబుతుంది. దీంతో నందూ ఇంట్లో నుంచి వెళ్లిపోడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడు లాస్య అతడిని ఆపుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

14వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తులసి కుటుంబ సభ్యుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా శృతి కోసం పని మనిషి రాములమ్మను మళ్లీ పనిలో పెట్టుకుంటుంది. అప్పుడామె వద్దని చెప్పినా తులసి వినదు. ఇక, ఫ్రిడ్జ్‌కు తాళం వేసి ఉండడంతో లాస్యపై గొడవకు దిగుతుందామె. అనంతరం ఇద్దరూ చాలా సేపు వాగ్వాదానికి దిగుతారు. తర్వాత తులసికి లాస్య ఛాలెంజ్ విసురుతుంది. ఇక, ప్రేమ్ తాకట్టు పెట్టిన గిటారును తులసి తీసుకొచ్చి అతడికే ఇస్తుంది. దీంతో ప్రేమ్ ఏడుస్తూ తల్లికి క్షమాపణలు చెబుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో తులసి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ల కష్టాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటుంది. దీంతో తన ఇంటికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు, సామ్రాట్ తన మనసులో తులసి ఉన్నదని పరోక్షంగా వెల్లడించాడు. కానీ, తాను రెండో పెళ్లి చేసుకోనందని బాబాయితో చెబుతాడు. ఇక, లాస్య ఛాలెంజ్ తర్వాత తులసి ఆమెపై ప్రతీకారం తీర్చుకోబోతుంది. దీంతో వచ్చే వారం ఫన్నీగా సాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X