Intinti Gruhalakshmi: విక్రమ్ మారడంతో దివ్య హ్యాపీ.. అంతలోనే తులసి, నందూకు యాక్సిడెంట్.. కథలో మలుపు

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 10వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ వాళ్ల ఇంటికి వెళ్లిన లాస్యను అనసూయ వాళ్లు అవమానించే ప్రయత్నం చేస్తారు. అప్పుడామె వాళ్లపై తిరగబడడంతో పాటు భరణం ఇవ్వమని గొడవ చేస్తుంది. దీంతో కెఫే కోసం దాచుకున్న డబ్బును ఆమెకు తులసి ఇప్పిస్తుంది. తర్వాత దివ్యను ఓదార్చిన విక్రమ్.. తులసి వాళ్లకు ఇచ్చేందుకు డబ్బులు పట్టుకుని వస్తాడు. కానీ, వాళ్లు మాత్రం దాన్ని తీసుకోరు. అయినప్పటికీ అతడు మాత్రం దివ్య తప్పు చేసిందని అనుకుంటాడు. తర్వాత రాజ్యలక్ష్మి వచ్చి దివ్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi:

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 11వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ వచ్చిన వెళ్లిన తర్వాత వెంటనే తులసి దివ్యకు ఫోన్ చేస్తుంది. అంతేకాదు, తమ పరువు తీసినందుకు కూతురిని చెడామడా తిట్టేస్తుంది. అలాగే, తమ గురించి ఆలోచించవద్దని, ఇంకెప్పుడూ ఫోన్ కూడా చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. దీంతో విక్రమ్ వచ్చిన వెంటనే దివ్య పెద్ద గొడవ చేస్తుంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా రాజ్యలక్ష్మి వాళ్లు నటిస్తూ ఆమెను విక్రమ్‌కు ఇంకా విలన్‌ను చేస్తారు. దీని తర్వాత నందూ బిజినెస్‌కు పెట్టుబడి కోసం తులసి తాళిబొట్టును తీసి అతడికి ఇస్తుంది. ఈ సీన్ అంతా ఎంతో ఎమోషనల్‌గా సాగింది.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 12వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ బిజినెస్ కోసం తన మెడలోని తాళిని తీసి ఇస్తుంది తులసి. అది తీసుకోవడం ఇష్టం లేకపోయినా అతడు తప్పక తీసుకుంటాడు. మరోవైపు దివ్య ఇంట్లో ఒంటరిగా ఏడుస్తూ ఉండగా లాస్య, రాజ్యలక్ష్మి సంతోషిస్తారు. అంతేకాదు, విక్రమ్ ఆస్తిని కొట్టేసే వరకూ యాక్టింగ్ చేస్తానని రాజ్యలక్ష్మి లాస్యతో అంటుంది. తర్వాత లాస్య వచ్చి విక్రమ్‌ను బ్లాక్‌మెయిల్ చేయమని దివ్యతో చెప్తుంది. కానీ, ఒప్పుకోదు. అప్పుడు లాస్య.. దివ్య ఆత్మహత్య చేసుకోబోతుందని విక్రమ్‌కు చెప్తుంది. దీంతో అతడు కంగారుగా వచ్చి ఆమె తాగే పాలను పడేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi:

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 13వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య సూసైడ్ చేసుకోబోతుందని లాస్య అందరినీ నమ్మిస్తుంది. దీంతో బసవయ్య ఇంకా ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అది తట్టుకోలేకపోయి దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత విక్రమ్ అక్కడకు రావడంతో అతడికి వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక, మంగళసూత్రాలను తాకట్టు పెట్టేందుకు నందూ, తులసి వెళ్లగా బేరం కుదరక వచ్చేస్తుంటారు. అప్పుడు వాళ్ల దగ్గర ఉన్న తాళిని ఓ వ్యక్తి దొంగిలించి పారిపోతాడు. అదంతా చూసిన విక్రమ్.. దివ్య వాళ్లకు డబ్బులు నిజంగానే ఇవ్వలేదన్న నిజాన్ని తెలుసుకుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

14 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 14వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి తాళిని దొంగ లాక్కెళ్లిపోయిన తర్వాత విక్రమ్ అత్తమామల దగ్గరకు వెళ్తాడు. అప్పటికే నిజం తెలుసుకుని బాధ పడుతున్న అతడు వాళ్ల కాళ్లపై క్షమించమని అడుగుతాడు. అనంతరం ఇంటికి వచ్చి లక్ష రూపాయలు దొంగతనం ఎవరు చేశారో తనకు తెలియాలని అంటాడు. కానీ, ఎవరూ మాట్లాడరు. అప్పుడు అందరి ముందే దివ్య తప్పు చేయలేదని ఆమెకు సారీ చెప్తాడు. కానీ, ఆమె మాత్రం తనకు సారీ వద్దని వెళ్లిపోతుంది. ఇక, తులసి.. విక్రమ్‌లో వచ్చిన మార్పును చూసి నందూ ముందర సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi:

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 15వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్యకు ఫోన్ చేసిన రాములమ్మ.. విక్రమ్‌ నిజం తెలుసుకున్నాడని, మారిపోయాడని అంటుంది. దీంతో ఆమె వెళ్లి భర్తను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది. తర్వాత ఇద్దరూ సరసాలు ఆడుకుంటారు. ఇక, తమ దొంగతనం బయట పడకుండా ఉండడం కోసం ఇంట్లో పని చేసే వ్యక్తిని లాస్య బుక్ చేస్తుంది. దీంతో అతడే దొంగ అని విక్రమ్ ముందర నిరూపిస్తుంది. మరోవైపు, తులసి మంగళసూత్రం దొరికిందని ఎస్సై ఫోన్ చేసి చెప్తాడు. దీంతో నందూతో కలిసి ఆమె బైక్‌పై వెళ్తుంది. ఆ సమయంలో నందూ చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్యను దొంగను చేసి రాజ్యలక్ష్మి వాళ్లు రాక్షసానందం పొందుతారు. కానీ, తులసి మంగళసూత్రం పోగొట్టుకోవడం వల్ల దివ్య గురించిన నిజం విక్రమ్ రాజ్యలక్ష్మి వాళ్లకు షాక్ ఇస్తాడు. కానీ, దొంగతనం బయటపడకుండా లాస్య మరొకరిని ఇరికించింది. ఇక, వచ్చే వారంలో దివ్య వాళ్లకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి.. నందూ, తులసికి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తారు. దీంతో కథలో పెద్ద మలుపులు రాబోతున్నాయి,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X