Intinti Gruhalakshmi: హనీమూన్‌తో తులసికి షాక్.. ఆస్పత్రి పెత్తనం దివ్య చేతికి.. కథలో ఊహించని మలుపు

చాలా భాషల్లో వస్తున్నా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:17వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించకుండా వదిలేయమని విక్రమ్‌తో రాజ్యలక్ష్మి చెప్తుంది. తర్వాత పంతులు వచ్చి విక్రమ్, దివ్యల ఫస్ట్ నైట్‌కు మంచి ముహూర్తం ఉందని అంటాడు. అంతేకాదు, కాశీ వెళ్లి మరీ గురువు గారితో ముహూర్తం పెట్టించానని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి వాళ్లు షాక్ అయిపోతారు. తర్వాత ఈ ఫస్ట్ నైట్ జరగకుండా ఆపుతామని లాస్య, రాజ్యలక్ష్మి చాలెంజ్ చేస్తారు. ఇక, కెఫేలో క్వాలిటీ విషయంలో రాజీ పడలేనని, అలా జరిగితే బిజినెస్‌కు దూరంగా ఉంటానని తులసి తేల్చి చెప్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: July 17th to 22nd Episodes highlights

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:18వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య తన ఫస్ట్ నైట్‌ గురించి తులసికి ఫోన్ చేసి చెప్తుంది. అంతేకాదు, శోభనానికి ముందు వచ్చి రెడీ చేయాలని చెబుతుంది. దీంతో నందూ కూడా సంతోషిస్తాడు. లాస్య ఫస్ట్ నైట్ కోసం బెడ్ రెడీ చేస్తుంటే రాజ్యలక్ష్మికి కోపం వస్తుంది. అప్పుడు లాస్య.. నందూ, తులసికి యాక్సిడెంట్ చేయించబోతున్నానని, అనుమానం రాకుండా ఫస్ట్ నైట్ ప్లాన్ చేసినట్లు చెప్తుంది. తర్వాత తులసి వాళ్లకు యాక్సిడెంట్ చేయమని ఓ వ్యాన్ డ్రైవర్‌కు ఫోన్ చేస్తుంది. ఇక, దివ్య తన తల్లి వచ్చి రెడీ చేసే వరకూ ఫస్ట్ నైట్ చేసుకోనని తేల్చి చెప్తుంది.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:19వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ, తులసికి యాక్సిడెంట్ చేయమన్న డ్రైవర్.. అసలు ఏం జరిగిందో చెప్పడంతో లాస్య, రాజ్యలక్ష్మి షాక్ అవుతారు. దీంతో ప్లాన్ మొత్తం నాశనం చేశావంటూ అతడిపై లాస్య ఫైర్ అవుతుంది. ఇక, తులసి రావడంతో దివ్య సంతోషిస్తుంది. తర్వాత దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్‌కు ఏర్పాట్లు చేస్తారు. ఆ వెంటనే వాళ్లిద్దరూ సరసాలు ఆడుకుంటూ ఉండగా రాజ్యలక్ష్మి వాళ్లు రగిలిపోతూ ఉంటారు. ఒకవైపు అందరూ శోభనం పనుల్లో బిజీగా ఉండగా.. లాస్య, రాజ్యలక్ష్మి మాత్రం ఫస్ట్ నైట్ ఆపాలని అనుకుంటూనే ఉంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: July 17th to 22nd Episodes highlights

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:20వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముహూర్తానికి ఇంకా సమయం ఉందని విక్రమ్ వాళ్లను దివ్య ఆపుతుంది. దీంతో అతడు ముందుగా వెళ్లగా.. తర్వాత దివ్యను శోభనం గదిలోకి పంపుతారు. వాళ్లు అలా వెళ్లగానే లాస్యను లాక్కుని వెళ్లిన రాజ్యలక్ష్మి ఎలాగైనా నువ్వు శోభనాన్ని ఆపాల్సిందే అంటూ ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇక, శోభనం గదిలో దివ్య తనను వదలొద్దు అనగా 'నాకు నువ్వంటే ఇష్టం. ఎప్పటికీ నీ చేయి వదిలిపెట్టను' అని ప్రామిస్ చేస్తాడు. దివ్య ఫస్ట్ నైట్ జరుగుతుందని సంతోషంలో ఉన్న తులసిని లాస్య రెచ్చగొట్టగా.. గట్టి వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: July 17th to 22nd Episodes highlights

21 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:21వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి గొప్పదనం గురించి పరందామయ్య నందూకు వివరిస్తాడు. తర్వాత తెల్లారిన తర్వాత కూడా విక్రమ్ వాళ్లు గదిలో నుంచి రాకపోవడంతో రాజ్యలక్ష్మి వాళ్లు టెన్షన్ పడుతుంటారు. అప్పుడే వచ్చిన దివ్య వాళ్లను మరింతగా ఉడికించేలా మాట్లాడుతుంది. తర్వాత దివ్య పాయసం చేసి ఇవ్వగా అది బాగోకపోయినా విక్రమ్ చెప్పడు. అది తెలిసిన దివ్య ఎంతో ఎమోషనల్ అవుతుంది. ఇక, దివ్య వాళ్లను మన ఇంటికి తీసుకు రావాలని నందూతో తులసి చెప్తుంది. అప్పుడు అతడు గతంలో తులసిని తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: July 17th to 22nd Episodes highlights

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:22వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గతంలో తులసి తన కోసం షర్ట్ కుట్టిన విషయాన్ని నందూ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతడు ఆమెను తిట్టినది తలుచుకుని బాధ పడతాడు. అంతేకాదు, తులసి అప్పుడు కుట్టిన షర్ట్‌ను ఇప్పుడు వేసుకుంటాడు. ఇక, దివ్యను ఆస్పత్రికి తీసుకు వెళ్లమని తల్లితో విక్రమ్ చెప్తాడు. కానీ, ఆమె వద్దని అంటుంది. అప్పుడు లాస్య దివ్య, విక్రమ్‌ హనీమూన్ ప్లాన్ చేశామని చెప్తారు. అది అయ్యాక ఆస్పత్రి బాధ్యతను కూడా దివ్యకే ఇస్తానని రాజ్యలక్ష్మి అంటుంది. ఇక, రెండో నైట్ కోసం దివ్య వాళ్లను తులసి ఇంటికి పిలుస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: July 17th to 22nd Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:జూలై 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ ఎపిసోడ్‌ను హైలైట్ చేశారు. దీన్ని ఆపాలని రాజ్యలక్ష్మి వాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతాయి. దీంతో మొత్తానికి వాళ్ల శోభనం జరిగిపోతుంది. ఆ తర్వాత హనీమూన్‌కు పంపేందుకు రాజ్యలక్ష్మి వాళ్లు ప్లాన్ చేస్తారు. ఇక, దివ్య విక్రమ్ తులసి వాళ్ల ఇంటికి వెళ్లకుండా ఉండేందుకు లాస్య కొత్త ప్లాన్‌తో వచ్చింది. దీంతో వచ్చే వారం రాబోయే ఎపిసోడ్‌ కథలో మరిన్ని మలుపులు తిరగబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X