Intinti Gruhalakshmi: లాస్య ప్లాన్ సక్సెస్.. విక్రమ్‌తో విడిపోయిన దివ్య.. వదిలి వెళ్లడంతో ట్విస్ట్

ఇరవై ముప్పై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 24వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి వాళ్లు దివ్య, విక్రమ్‌ను తమ ఇంటికి రమ్మనడంతో లాస్య హనీమూన్ ప్లాన్ చేస్తుంది. అలా అక్కడకు పంపకుండా ఉండాలని అనుకుంటుంది. దీంతో దివ్యకు కోపం వస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేయమని అనగా.. లాస్య అడ్డుపుల్ల వేస్తుంది. దీంతో విక్రమ్ కూడా వాళ్ల మాటకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తన తండ్రి పుట్టినరోజు కోసం వెళ్దామని విక్రమ్‌ను దివ్య అడగ్గా.. అతడు ఒప్పుకుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 25వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో తులసి యమా హడావిడి చేస్తూ ఉంటుంది. అంతేకాదు, అతడి కోసం బట్టలు కొని వాటిని అత్తమామల చేతితో ఇవ్వమని చెబుతుంది. నందూ మాత్రం పొట్ట తగ్గించుకునేందుకు తెగ కష్టపడుతూ ఉంటాడు. అప్పుడే ఓ అమ్మాయి అతడిని అపార్థం చేసుకుని గొడవ చేయబోగా సర్ధి చెప్తాడు. ఇక, లాస్య హనీమూన్ ప్లాన్ వివరిస్తుండగా.. నందూ బర్త్‌డే పార్టీ ఉందని విక్రమ్‌ను దివ్య అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత అందరూ కలిసి నందూ పార్టీ చేస్తారు.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 26వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తండ్రిని కలిసిన దివ్య.. తల్లితో కలిసి ఉండేలా ఫ్యూచర్‌ను మార్చుకోమని చెబుతుంది. ఆ సమయంలోనే నందూ కూడా తులసిపై ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తాడు. ఇక, పుట్టినరోజు పార్టీలో కొందరు నందూ, తులసిని అవమానించేలా మాట్లాడతారు. అప్పుడే అక్కడకు లాస్య కూడా వచ్చి డ్రింక్స్‌లో మత్తు మందు కలిసి ఇప్పించేలా ప్లాన్ చేస్తుంది. అలాగే, తనదైన మాటలతో నందూకు కోపం తెప్పిస్తుంది. దీంతో అతడు లాస్యపై ఎటాక్ చేయడం మొదలు పెడతాడు. దీంతో బర్త్‌డే పార్టీలో రచ్చ రచ్చ జరుగుతుంది.

Intinti Gruhalakshmi

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 27వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పుట్టినరోజు పార్టీలో నందూను లాస్య ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు అనసూయ ఆమెను తిట్టినా ఏమీ పట్టించుకోకుండా కంటిన్యూ చేస్తుంది. తర్వాత దివ్య కూడా అవమానించేలా మాట్లాడుతుంది. ఇక, నందూ కేక్ కట్ చేసిన తర్వాత మొదటి పీస్‌ను దివ్యకు తినిపిస్తాడు. ఆ సమయంలో డ్రామా హైలైట్‌గా ఉంటుంది. ఆ తర్వాత లాస్య ప్లాన్ ప్రకారం మందు కలిపిన డ్రింక్స్‌ను అందరూ తాగుతారు. ఆ సమయంలో అందరూ రచ్చ రచ్చ చేస్తారు. అప్పుడు లాస్య, నందూ మధ్య గొడవ జరుగుతుంది.

28 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 28వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్లాన్ ప్రకారం మందు కలిపిన డ్రింక్స్ ఇవ్వడంతో విక్రమ్, దివ్య నిద్ర లేవకుండా ఉంటారు. దీంతో రాజ్యలక్ష్మి తులసి వాళ్ల ఇంటికి వచ్చి నాటకం మొదలు పెడుతుంది. అప్పుడు విక్రమ్, దివ్య ముందు మందు పంచాయతీ పెడుతుంది. అప్పుడు నందూపై నిందలు వేయడంతో విక్రమ్‌ కూడా నమ్మేస్తాడు. దీంతో తులసి రాజ్యలక్ష్మి కాళ్లు పట్టుకుంటుంది. కానీ, వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఇంట్లో దివ్య పంచాయతీ పెట్టగా.. విక్రమ్ కోపంతో ఆమెను కొట్టబోతాడు. దీంతో దివ్య ఇంటి నుంచి వెళ్లిపోతానంటుంది.

Intinti Gruhalakshmi

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 29వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన తల్లిదండ్రులపై అందరూ నిందలు వేస్తుండడంతో దివ్య సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, రాజ్యలక్ష్మి, బసవయ్య, లాస్య ఆమెపై ఎదురుదాడి చేస్తుంటారు. దీంతో దివ్య కూడా వాళ్లకు ఎదురు తిరిగి మాట్లాడుతుంది. అంతేకాదు, రాజ్యలక్ష్మిని సైతం రెండో పెళ్లి చేసుకున్నావు కదా అంటూ మాట్లాడుతుంది. దీంతో విక్రమ్ ఆమెను కొట్టబోతాడు. అప్పుడు దివ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటుంది. ఆ సమయంలో రాజ్యలక్ష్మి యాక్టింగ్ మొదలు పెడుతుంది. అయినా విక్రమ్ మాత్రం దివ్యను పట్టించుకోడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:జూలై 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో విక్రమ్, దివ్య హనీమూన్‌ ప్లాన్‌తో పాటు నందూ బర్త్‌డేను బాగా హైలైట్ చేశారు. కానీ, ఆ పార్టీలో మందు కలిపిన డ్రింక్స్ తాగించిన లాస్య మొత్తం తనవైపునకు తిప్పుకుంది. దీంతో విక్రమ్, దివ్య మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇక, వచ్చే ఎపిసోడ్‌లో దివ్య తన పుట్టింటికి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది. మరి దీనికి తులసి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కథలో మరో కోణం కనిపించబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X