Intinti Gruhalakshmi: తులసి, నందూకు మళ్లీ పెళ్లి.. విక్రమ్‌ను పడేసిన దివ్య.. అలా జరగడంతో అంతా హ్యాపీ
ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!
31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 31వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌తో గొడవ పెట్టుకున్న దివ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి నేరుగా పుట్టింటికి వెళ్లగా.. అందరూ షాక్ అవుతారు. కానీ, ఆమెను ఎవరూ ప్రశ్నించరు. దీంతో సైలెంట్‌గానే ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇక, దివ్య ఫ్యామిలీని దెబ్బ మీద దెబ్బ కొట్టాలని లాస్య, రాజ్యలక్ష్మి అనుకుంటారు. భార్య వెళ్లిపోవడంతో బాధ పడుతున్న విక్రమ్‌కు తాతయ్య క్లాస్ పీకుతాడు. అదే సమయంలో దివ్య గొప్పదనం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ, విక్రమ్ మాత్రం తల్లికే సపోర్టు చేస్తూ మాట్లాడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 01వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య బాధను చూసిన నందూ.. రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి విషయం తెలుసుకోమని తులసికి చెప్తాడు. ఆమె మాత్రం విక్రమ్‌కు చెప్తే బాగుంటుందని అతడికి కాల్ చేస్తుంది. కానీ, ఆ ఫోన్ తీసుకున్న రాజ్యలక్ష్మి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. దీంతో తులసి వాళ్లు టెన్షన్ పడుతుంటారు. తర్వాత లాస్య వచ్చి విడాకుల డ్రామా మొదలు పెడుతుంది. దివ్య పంపినట్లుగా విక్రమ్‌కు నోటీసులు పంపిస్తుంది. అప్పుడు విక్రమ్ అది నిజమే అనుకుని దివ్యకు కూడా నోటీసులు పంపిస్తాడు. అది చూసిన తులసి వాళ్లు గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు.
02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 02వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య బాధను చూడలేక విడాకుల నోటీసులు తీసుకుని తులసి రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తుంది. అక్కడ విక్రమ్‌ను అడగ్గా.. నిజం తెలియని అతడు తల్లి వాళ్లకు సపోర్టు చేసి మాట్లాడతాడు. అంతేకాదు, దివ్య కోరిక మేరకు విడాకులకు సిద్ధం అంటాడు. అప్పుడు లాస్య వచ్చి మొత్తం తనే చేశానని చెప్పి షాకిస్తుంది. అంతేకాదు, నందూకు తనకు మళ్లీ పెళ్లి చేయమని అడుగుతుంది. ఇక, బాధ పడుతున్న దివ్యకు నందూ ధైర్యం చెబుతాడు. అలాగే, తులసిలా సైలెంట్‌గా ఉండొద్దని హితవు పలుకుతాడు. ఇదంతా తులసి చాటుగా వింటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 03వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన కూతురికి నందూ విలువైన మాటలు చెబుతాడు. అంతేకాదు, అత్తగారి ఇంట్లోనే ఉండి కాపురాన్ని నిలబెట్టుకోమని సలహా ఇస్తాడు. దీంతో దివ్య తన ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. మరోవైపు, విక్రమ్ బాధ పడుతూ ఉన్న సమయంలోనే లాస్య, రాజ్యలక్ష్మి వెళ్లి అతడిని మరింతగా రెచ్చగొడతారు. అంతేకాదు, రెండో పెళ్లి చేస్తామని అనడంతో అతడికి కోపం వస్తుంది. ఇక, దివ్య ఇంటికి రావడంతో విక్రమ్ కోప్పడతాడు. ఆ సమయంలోనే నోటీసుల గురించి చెప్తాడు. అప్పుడామెకు దాని గురించి నిజం తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

04 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 04వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి తులసి ఆలోచిస్తుండగా నందూ వెళ్లి ఆమెతో మాట్లాడతాడు. అప్పుడు తులసి.. నందూ తనకు విడాకులు ఇచ్చిన విషయంపై క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత తన అనుభవాన్ని దివ్య కోసం వాడతానని అంటుంది. ఇక, ఇంటికి వెళ్లిన దివ్య అత్తగారితో చాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత నందూ ఇంట్లో మందు తాగుతూ ఉండగా.. లాస్య వస్తుంది. అప్పుడు నందూ రెచ్చిపోతాడు. అంతేకాదు, తులసిని మళ్లీ పెళ్లి చేసుకుంటాను అంటూ వంకర మాటలు మాట్లాడతాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 05వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బెడ్‌రూంలో విక్రమ్‌ను దివ్య ఓ రేంజ్‌లో రెచ్చగొడుతుంది. కానీ, అతడు మాత్రం నిగ్రహంగా ఉంటూ ఆమెకు షాక్ ఇస్తాడు. ఇక, ఉదయాన్నే పనిమనిషి అనారోగ్యానికి సంబంధించి సహాయం అడగ్గా.. తమ ఆస్పత్రికి రమ్మని చెప్తుంది. దీంతో రాజ్యలక్ష్మి వచ్చి ఆమెతో గొడవ పడుతుంది. అప్పుడు దివ్య తనకు ఆస్పత్రిలో హక్కు ఉందని అత్తతో గొడవ పడుతుంది. అంతేకాదు, విక్రమ్ నోటితోనే తనకు ఆస్పత్రికి రానివ్వు అనేలా చేస్తానని రాజ్యలక్ష్మితో ఛాలెంజ్ చేస్తుంది. లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో విక్రమ్‌ను వదిలేసి దివ్య తన పుట్టింటికి వెళ్లిపోవడం.. అక్కడ నందూ ఆమెకు కొన్ని విలువైన సలహాలు ఇవ్వడం.. నందూ మందు తాగి తులసిని పెళ్లి చేసుకుంటానని అనడం.. చివరకు దివ్య తన మెట్టినింటికి వచ్చేయడాన్ని చూపించారు. రాబోయే ఎపిసోడ్లలో తులసి కూడా దివ్యకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా విక్రమ్‌ను దివ్య రెచ్చగొట్టి తనకు నచ్చిన పనులను చేయించుకుంటుంది.


Click it and Unblock the Notifications











