Intinti Gruhalakshmi: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దివ్య.. నిజం చెప్పిన తులసి.. విషం తాగి చావాలని!

నరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:03వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంత వరకూ శోభనమే జరగలేదు అంటూ విక్రమ్‌ను దివ్య రెచ్చగొడుతుంది. ఆ తర్వాత ఆమె దగ్గరకు లాస్య వచ్చి చాలెంజ్‌లు చేస్తుంది. దీనికి దివ్య కూడా గట్టిగానే బదులు ఇస్తుంది. అనంతరం అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ దివ్య ఎత్తుకోబోయే బోనం కింద పడేయాలని లాస్య, రాజ్యలక్ష్మి కలిసి ప్లాన్ చేస్తారు. అందుకు తగ్గట్లే జరగబోతుండగా రాజ్యలక్ష్మి వెళ్లి బోనం కింద పడకుండా ఆపుతుంది. దీంతో లాస్య ఆమెపై కోప్పడుతుంది. దీంతో దివ్యకు మన ప్లాన్ తెలిసిపోయిందని నిజాన్ని చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 04వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. బోనం కింద పడాలని చేసిన ప్లాన్ తనకు తెలిసిందని రాజ్యలక్ష్మితో దివ్య చెప్తుంది. అంతేకాదు, ఆమెకు కొన్ని వార్నింగ్‌లు కూడా ఇస్తుంది. హోమం ప్రారంభం అయిన తర్వాత లాస్య వచ్చి దివ్యకు ఓ హాని జరగబోతుందని నందూకు చెప్తుంది. దీంతో అతడు తులసిని కలిసి ఆ హోమం ఆపించమని అంటాడు. కానీ, ఆమె గొడవలు జరుగుతాయి వద్దు అంటుంది. హోమం పూర్తైన వెంటనే దివ్య, విక్రమ్‌ను నిప్పులు గుండంలో నడవాలని పంతులు చెప్తాడు. కానీ, తులసి వాళ్లు దీనికి ఒప్పుకోరు. దీంతో రాజ్యలక్ష్మి నేనే నడుస్తా అంటుంది.

05వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 05వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్ కలిసి నిప్పుల గుండంలో నడవడానికి పయనం అవుతారు. అప్పుడు తులసి వాళ్లను ఆపి పసుపు నీళ్లతో స్నానం చేయిస్తుంది. దీంతో వాళ్లు గుండంలో నాలుగైదు రౌండ్లు వేస్తారు. ఆ తర్వాత దివ్య కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో తులసికి కోపం వచ్చి లాస్య జుట్టు పట్టుకుని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత దివ్యతో మాట్లాడి వెళ్లిపోతుంటే.. విక్రమ్ తులసిని ఉండమంటాడు. కానీ, అతడికి కొన్ని సూచనలు చెప్పి వెళ్లిపోతుంది. ఇక, నందూ లాస్యపై పగను పెంచుకోగా.. లాస్య కూడా తులసి వాళ్లపై కోపంగా ఉంటుంది.

Intinti Gruhalakshmi

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 06వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కెఫేను రీఓపెన్ చేయాలని అనుకున్న నందూ, తులసి.. దివ్య వాళ్లను పిలిచేందుకు రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్లను బసవయ్యతో పాటు అందరూ అవమానించేలా మాట్లాడతారు. అంతేకాదు, లాస్య కూడా ఎంట్రీ ఇచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక, విషయం చెప్పగానే సంజయ్ వచ్చి విక్రమ్ రావడం కుదరదు అంటాడు. కానీ, విక్రమ్ వచ్చి నేను వెళ్తా అంటాడు. ఆ తర్వాత అందరూ అక్కడకు వెళ్తారు. అప్పుడు దివ్య, విక్రమ్ కలిసి కెఫేన్ ఓపెన్ చేస్తారు. తర్వాత దివ్య చిన్న కోరిక కోరగా తులసి మందలిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi

07 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 07వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కెఫే రీఓపెనింగ్‌కు వచ్చిన లాస్యను పరందామయ్య, అనసూయ వాళ్లు బాగా అవమానిస్తారు. దీంతో లాస్యలో కోపం రెట్టింపు అవుతుంది. తర్వాత రాజ్యలక్ష్మిని మూడు లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతుంది. అవి తీసుకుని దివ్య జీవితాన్ని నాశనం చేస్తానని హామీ ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఆ డబ్బును తీసుకొచ్చి రాజ్యలక్ష్మికి ఇవ్వబోతుండగా.. ఆమె దివ్యకు ఇవ్వమని చెబుతుంది. విక్రమ్ ఎంత చెప్పినా వినకుండా ఆ డబ్బును దివ్యకు అందిస్తారు. ఇక, తులసి వాళ్లు తృణ ధాన్యాలతో ఫుడ్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 08వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కెఫే రీఓపెన్ చేసిన తల్లిదండ్రులను అర్జెంట్‌గా ఇంటికి రమ్మని దివ్య పిలుస్తుంది. వాళ్లు రాగానే సీక్రెట్‌గా తన గదిలోకి తీసుకు వెళ్లి డబ్బులు ఇస్తుంది. ఆ సమయంలోనే బసవయ్య.. విక్రమ్‌ను తీసుకు వచ్చి చూపిస్తాడు. కానీ, అతడు లైట్ తీసుకుంటాడు. ఇక దివ్య ఇచ్చిన డబ్బులను నందూ వాళ్లు తీసుకోరు. పైగా ఆమెకు కొన్ని సూచనలు చేస్తారు. తర్వాతి రోజు ఉదయాన్నే లాస్య ఇచ్చిన డబ్బులో కొంత కనిపించదు. వాటిని బసవయ్య కొట్టేసి ఆ నిందను దివ్యపై మోపుతాడు. దీంతో అందరి ముందు ఆమె దోషిలా నిలబడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: జూలై 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో నందూ, తులసి కలిసి కెఫేను రీఓపెన్ చేయించడం, దివ్యను లాస్య, రాజ్యలక్ష్మి టార్గెట్ చేయడం వంటివి చూపించారు. ఇక, మూడు లక్షల రూపాయల విషయంలో దివ్యను విక్రమ్ ముందు దోషిగా చేయడంలో అత్త వాళ్లు సక్సెస్ అయ్యారు. వచ్చే వారంలో విక్రమ్ డబ్బులను తులసి వాళ్లకు తీసుకెళ్లి ఇవ్వబోవడం.. ఆ విషయాన్ని తులసి దివ్యకు చెప్పడం.. దీంతో ఆమె భర్తతో విషం తాగుతానని బెదిరించడాన్ని చూపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X