Intinti Gruhalakshmi: విలన్‌లా మారిపోయిన విక్రమ్.. తులసి, దివ్యకు కష్టాలు.. కథలో ఊహించని ట్విస్ట్
చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!
12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:12వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పూజ చేసిన తర్వాత తన దగ్గరకు వచ్చిన విక్రమ్‌ను రెచ్చగొట్టేలా దివ్య మాట్లాడుతుంది. కానీ, అతడు మాత్రం తన తల్లి మంచిదనే అంటాడు. ఆ తర్వాత భార్యతో సన్నిహితంగా ఉంటాడు. అది చూసి రాజ్యలక్ష్మి రగిలిపోతుంది. ఇక, కోర్టు నుంచి నేరుగా నందూతో కలిసి ఇంటికి వచ్చిన లాస్యను చూసి ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. అందుకు తగ్గట్లుగానే ఆమె కూడా వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఇక, దివ్యను విక్రమ్‌కు శాశ్వతంగా దూరం చేయాలని రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. ఈ విషయం చెప్పి బసవయ్యలో ధైర్యాన్ని నింపుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:13వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ అన్నం తినడానికి ఇబ్బంది పడుతుండగా లాస్య అందరినీ జైలుకు పంపిస్తా అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో అతడు తినకుండానే వెళ్లిపోతాడు. తర్వాత పరందామయ్య, అనసూయ బాధపడుతూ తులసిని ప్రశ్నిస్తారు. కానీ, ఆమె మాత్రం లాస్యను కెలక్కూడదని చెప్తుంది. ఇక, దివ్య తన పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. నందూ ఫోన్ చేసి తన దగ్గరకు రావొద్దని చెబుతాడు. దీంతో దివ్య బాధ పడుతుంది. అదే సమయంలో రాజ్యలక్ష్మి ప్లాన్ చేసిందని గ్రహిస్తుంది. దీంతో ఆమెకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:14వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసికి ఫోన్ చేసిన రాజ్యలక్ష్మి.. దివ్య గురించి లేనిపోనివి అన్నీ చెబుతుంది. అంతేకాదు, ఆమెను జాగ్రత్తగా ఉండేలా చూడండి అంటూ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆ తర్వాత దివ్య దగ్గరకు వచ్చి పొగరుగా మాట్లాడుతుంది. దీంతో ఆమె కూడా అత్తగారికి ధీటుగానే మాట్లాడడంతో పాటు ఛాలెంజ్ చేస్తుంది. ఇక, రాములమ్మ తెచ్చినట్లు కొన్ని ఆహార పదార్థాలను నందూకు వడ్డిస్తుంది తులసి. అది తెలిసిన అతడు కడుపు నిండా తినేస్తాడు. ఇక, విక్రమ్ తండ్రికి స్లో పాయిజన్ టాబ్లెట్లు ఇస్తున్నారని తెలుసుకున్న దివ్య గొడవ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:15వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నర్స్ చేతిలో ఉన్న టాబ్లెట్లు స్టో పాయిజన్‌లా పని చేస్తాయని, వాటిని మామయ్య గారికి ఇస్తున్నారని విక్రమ్‌తో దివ్య చెప్తుంది. కానీ, ఆ నర్స్ మాత్రం దివ్యకు వ్యతిరేకంగా చెప్తుంది. దీంతో విక్రమ్ ఆమెను అసహ్యించుకుంటాడు. మరోవైపు, తాను చెప్పినట్లు వినకపోతే మీ అమ్మానాన్నలకు ఏదైనా అవుతుందని నందూను లాస్య బెదిరిస్తుంది. దీంతో తులసి భయపడిపోతుంది. ఆ తర్వాత దివ్య వెళ్లి విక్రమ్‌కు నిజం చెప్పే ప్రయత్నం చేయగా అతడు పట్టించుకోడు. పైగా వేరే ఎవరైనా అయితే చెంప పగలగొట్టేవాడిని అని అంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

16 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:16వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అత్త పర్మీషన్ లేకుండానే దివ్య తన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెను చూసి తులసి వాళ్లు బాధ పడతారు. అప్పుడు నందూ.. గతంలో తులసికి రాజ్యలక్ష్మి ఫోన్ చేసిన విషయాన్ని దివ్యకు చెప్పేస్తాడు. దీంతో దివ్య ఆమె సంగతి చూసుకుంటానని వచ్చేస్తుంది. అప్పటికే దివ్య తనపైకి కత్తి విసిరేసిందని విక్రమ్‌కు రాజ్యలక్ష్మి కంప్లైంట్ చేస్తుంది. దీంతో అతడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు, నందూను తన వైపు తిప్పుకునేందుకు లాస్య ప్రయత్నిస్తుంది. చెప్పినట్లు వినకపోతే గృహ హింస కేసు పెడతానని అందరినీ బెదిరిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:17వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్య మాటలకు రాములమ్మ సపోర్ట్ చేస్తుంది. దీంతో అనసూయ ఆమెను అరవడంతో వెళ్లిపోతుంది. తర్వాత రాజ్యలక్ష్మిని చేయి ఎలా ఉందని విక్రమ్ అడగ్గా.. దివ్యతో గొడవ పెట్టుకోమని పరోక్షంగా రెచ్చగొడుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన దివ్యపై విక్రమ్ కోప్పడడంతో పాటు కొట్టేందుకు చేయి లేపుతాడు. దీంతో ఆమె ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాత ప్రియ జరిగిందంతా తులసికి ఫోన్ చేసి చెప్పగా.. ఆమె దివ్యకు కాల్ చేసి ధైర్యం చెప్తుంది. దీంతో నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:జూన్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో రాజ్యలక్ష్మి, దివ్య మధ్యన గొడవలను హైలైట్ చేశారు. ఇందులో మాత్రం అత్తగారిదే పైచేయి అవగా.. భర్త ముందు దివ్య దోషిలా మిగిలిపోయింది. ఇక, తిరిగి ఇంటికి వచ్చిన లాస్య.. నందూ ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. దీంతో అటు తులసి.. ఇటు దివ్యకు కొత్త కొత్త చిక్కులు వచ్చినట్లు అయింది. దీనికితోడు తులసికి కూడా విక్రమ్ ఎదురు తిరగడాన్ని వచ్చే వారం చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











