Intinti Gruhalakshmi: భర్తను తనవైపు తిప్పుకున్న దివ్య.. అంతలోనే విక్రమ్ అరెస్ట్.. కథలో ఊహించని మలుపు

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.

తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: June 19th to 24th Episodes highlights

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 19వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గొడవ తర్వాత రాజ్యలక్ష్మి వచ్చి దివ్యతో మాట్లాడమని విక్రమ్‌కు చెప్తుంది. అతడు అఇష్టంగానే వెళ్లడంతో దివ్య వెళ్లిపోమని పంపేస్తుంది. ఇక, నందూ దగ్గరకు కాఫీ పట్టుకుని వచ్చిన లాస్య.. తాగమని అడుగుతుంది.

దానికి అతడు ఒప్పుకోకపోవడంతో మీ అమ్మనాన్నలకు విషం కలిపిన టీ ఇచ్చానని చెప్తుంది. దీంతో కంగారు వెళ్లిన నందూ వాళ్లను స్పృహ తప్పి ఉండడం చూసి ఏడుస్తాడు. కానీ, వాళ్లకు మత్తు మందు మాత్రమే ఇచ్చానని అంటుంది. ఇక, తులసి రోడ్డు మీద మాట్లాడే ప్రయత్నం చేయగా విక్రమ్ కోప్పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: June 19th to 24th Episodes highlights

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 20వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన తల్లిదండ్రులను ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో లాస్య కండీషన్లకు నందూ ఒప్పుకుంటాడు. కానీ, వాళ్లను విడిచిపెట్టి రానని చెబుతాడు. అయినా అతడిని లాస్య ఒప్పిస్తుంది. ఇక, రోడ్డు మీద వెళ్తున్న విక్రమ్‌ను తులసి ఆపి ఏదో చెప్పబోతుంది.

కానీ, అతడు అందరిలో పరువు పోతుందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక, నందూ, లాస్య కలిసి వెళ్తున్నది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఏంటని ప్రశ్నించిన వాళ్లపై లాస్య ఫైర్ అవుతుంది. ఇక, విక్రమ్ వాళ్ల తాతయ్య దివ్యకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: June 19th to 24th Episodes highlights

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 21వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను దూరంగా ఉంచి దివ్య తప్పు చేస్తుందని తాతయ్య ఆమెను హెచ్చరిస్తాడు. దీంతో దివ్యకు అసలు విషయం అర్థం అవుతుంది. ఆ వెంటనే విక్రమ్ కోసం టీ తీసుకుని వెళ్లి అతడికి దగ్గర అవ్వాలని చూస్తుంది. కానీ, అంతలోనే రాజ్యలక్ష్మి వచ్చి విక్రమ్‌ను ఇంకా రెచ్చగొడుతుంది.

ఇక, నందూ, లాస్య కోర్టుకు వెళ్లేందుకు రెడీ అవుతారు. అప్పుడు లాస్య మేము అటు నుంచి అటే వెళ్లిపోతాము అని వాళ్లతో అంటుంది. దీంతో అందరూ బాధ పడుతూ ఉంటారు. లాస్య, నందూ వేరే ఉండబోతున్నారని రాజ్యలక్ష్మి.. దివ్యకు చెబుతుంది.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: June 19th to 24th Episodes highlights

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 22వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కోర్టులో నందూ కేసు ఉందని చెప్పినా విక్రమ్ వెళ్లడానికి ఇష్టపడడు. దీంతో రాజ్యలక్ష్మి వాడు ఎప్పటికీ నా కొడుకే అంటూ దివ్య ముందు పొగరుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కోర్టులో విచారణ మొదలైన తర్వాత నందూ విడాకులు కోరుకుంటున్నాడని చెప్పి మోహన్ అందరికీ షాకిస్తాడు.

అంతేకాదు, లాస్య అతడిని బ్లాక్‌మెయిల్ చేసిందని ఆరోపిస్తాడు. అప్పుడే రాములమ్మ వచ్చి లాస్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగా.. తులసి ఓ వీడియోను జడ్జ్‌కు చూపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత నందూకు విడాకులు మంజూరు చేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

23 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 23వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కోర్టు విడాకులు ఇచ్చిన తర్వాత రాములమ్మతో లాస్య గొడవకు దిగుతుంది. దీంతో లాస్య గతంలో చేసిన తప్పులు మొత్తాన్ని ఎత్తి చూపిస్తూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. తర్వాత నందూ కూడా ఆమెకు గెంటేస్తాడు. అనంతరం దివ్య, నందూ, తులసి కలిసి కారులో వెళ్తారు.

అప్పుడు దివ్యను అత్తగారి ఇంటి దగ్గర దించేస్తారు. ఆ సమయంలో తులసికి ఏమైనా సహాయం చేయమని నందూను కోరుతుంది. అంతేకాదు, వీలైతే మీరు మళ్లీ కలవాలని కోరుకుంటుంది. దీంతో నందూ తులసికి అండగా ఉండే ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: June 19th to 24th Episodes highlights

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 24వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రాములమ్మ చేసిన అవమానం తలచుకుంటూ వెళ్తున్న లాస్యకు రాజ్యలక్ష్మి కాల్ చేస్తుంది. అప్పుడు ఇద్దరూ తమ తప్పుల గురించి వాదించుకుంటారు. చివరికి ఒక్కటై దివ్య ఆట కట్టించే ప్లాన్‌ను రెడీ చేసుకుంటారు.

ఇక, తండ్రికి విడాకులు వచ్చాయన్న సంతోషంలో ఉన్న దివ్యకు విక్రమ్ తన మాటలతో షాక్ ఇస్తాడు. మరోవైపు, లాస్యకు భరణం చెల్లించడం గురించి తులసి వాళ్లు మాట్లాడతారు. అప్పుడు కెఫేను మళ్లీ స్టార్ట్ చేయమని తులసి నందూకు సలహా ఇస్తుంది. ఇక, దివ్య భర్తను రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: జూన్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో లాస్య, నందూ కోర్టు కేసును హైలైట్ చేశారు. ముఖ్యంగా జడ్జ్ వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేశారు.

దీంతో తులసి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అదే సమయంలో ఆ ఫ్యామిలీకి రాజ్యలక్ష్మి, లాస్య ఒక్కటై చుక్కలు చూపించాలని ప్లాన్ చేస్తారు. అయితే, దివ్య మాత్రం భర్తను తన వైపు తిప్పుకుంటుంది. అంతలోనే విక్రమ్‌ను అరెస్ట్ చేయించి రాజ్యలక్ష్మి, లాస్య షాకిస్తారు. ఇది వచ్చే వారం చూపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X