Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్‌కు విడాకులు.. ట్విస్ట్ ఇచ్చిన రాజ్యలక్ష్మి.. లాస్య మరో ప్లాన్‌

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 26వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: June 26th to July 1st Episodes highlights

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 26వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను దివ్య ఎలాగోలా తన వైపునకు తిప్పుకుంటుంది. తర్వాత మేనేజర్ మోసం చేశాడని నిందిస్తూ ఇంట్లో రాజ్యలక్ష్మి గొడవ చేస్తుంది. అంతేకాదు, అతడి స్థానంలో లాస్యను తీసుకొచ్చి పెడతానని అంటుంది. కానీ, దీనికి విక్రమ్ ఒప్పుకోడు. పైగా దివ్య కూడా ఇష్టం లేదంటూ ఆమెకు సపోర్టుగా మాట్లాడతాడు. దీంతో దివ్య అత్తకు బుద్ది చెబుతుంది. తర్వాత ఈ విషయం తులసికి ఫోన్ చేసి చెప్తుంది. అదంతా విన్న నందూ.. లాస్య దగ్గరకు కోపంగా వెళ్తాడు. అంతేకాదు, ఆమెను చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 27వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య చొరవ తీసుకుని మందులు ఇవ్వడం వల్ల విక్రమ్ తండ్రి కోలుకుంటాడు. మాటలు కూడా వస్తాయి. కానీ, ఆయనను దివ్య బయటకు తీసుకు వెళ్లడానికి మాత్రం రాజ్యలక్ష్మి వాళ్లు అడ్డుపడతారు. దీంతో వాళ్లతో దివ్య గొడవ పడుతుంది. అంతలోనే విక్రమ్ రావడంతో రాజ్యలక్ష్మి తప్పు మొత్తం దివ్యదే అన్నట్లుగా నమ్మిస్తుంది. దీంతో అతడు కూడా తల్లి వైపే మాట్లాడతాడు. అంతేకాదు, దివ్యపై ఫైర్ అవుతూ అసహ్యించుకుంటాడు. దీంతో ప్రకాశం బాధ పడుతుంటాడు. ఆయనను దివ్య ఓదార్చుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 28వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఎలాగైనా అత్తకు బుద్ది చెబుతానని మామయ్యకు దివ్య ధైర్యం చెబుతుంది. అనంతరం రాజ్యలక్ష్మి, బసవయ్య, సంజయ్‌లు కలిసి దివ్యపై దొంగతనం అభియోగం చేయాలని ప్లాన్ చేస్తారు. అది విన్న దివ్య.. వాళ్లు డబ్బు తీసుకెళ్తుండగా విక్రమ్‌ను తీసుకు వెళ్తుంది. కానీ, అక్కడ వాళ్లు ఫ్లేట్ ఫిరాయించి దివ్యనే బుక్ చేస్తారు. దీంతో విక్రమ్ భార్యపై కోప్పడుతూ తల్లికి సపోర్టు చేస్తాడు. మరోవైపు, తులసి, నందూ కలిసి కెఫేను రీ ఓపెన్ చేస్తారు. కానీ, అక్కడకు ఎవరూ రారు. అప్పుడు లాస్య ఎంట్రీ ఇచ్చి వాళ్లిద్దరికీ బిగ్ షాక్‌ను ఇచ్చేస్తుంది.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 29వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌కు మాయ మాటలు చెప్పి దివ్యను దోషిగా నిలబెట్టిన తర్వాత ఆ రూ. 20 లక్షలను సంజయ్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఎవరు ఎంత చెప్పినా అతడు మాత్రం పట్టించుకోడు. పైగా విక్రమ్‌నే తీసుకెళ్లి ఇవ్వమంటాడు. అతడు ఆ డబ్బుతో కారులో వెళ్తుండగా పోలీసులు ఆపి గొడవ చేస్తారు. అప్పటికే రాజ్యలక్ష్మి తన ప్లాన్‌ను దివ్యకు వివరిస్తుంది. అందుకు తగ్గట్లుగానే విక్రమ్‌ ఆమెకు ఫోన్ చేసి పోలీసుల విషయం చెప్తాడు. దీంతో రాజ్యలక్ష్మి పోలీసులతో మాట్లాడుతుంది. తర్వాత లాస్యకు ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 30వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కెఫే ఓపెన్ చేయగానే నెలరోజుల పాటు గిరాకీ తగులుతుంది. దీంతో నందూ, తులసి ఎంతో సంతోషంగా ఉంటారు. అంతా మంచిగా ఉండడంతో దివ్య కాపురం చక్కగా నడవాలని ఆమెతో బోనం ఎత్తించాలని తులసి అనుకుంటుంది. అందుకోసం ఆమెను పిలవడానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే, దివ్య ఇంట్లో మాత్రం లాస్య టాపిక్ నడుస్తుంది. ఆమెను జాబ్‌లోకి తీసుకోకపోతే ఆస్పత్రి నష్టాలపాలు అవుతుందని విక్రమ్‌ను అందరూ నమ్మిస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడు కూడా ఒప్పుకుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 01వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్యకు ఉద్యోగం ఇవ్వాలని విక్రమ్ తీసుకున్న నిర్ణయంపై దివ్య అసంతృప్తిగా ఉంటుంది. కానీ, అతడు మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా మాట్లాడతాడు. దీంతో తనకు విలువ ఇవ్వడం లేదని దివ్య కోప్పడుతుంది. తర్వాత అక్కడకు నందూ, తులసి వచ్చి దివ్య వాళ్లను పంపించమని అడుగుతారు. దీంతో రాజ్యలక్ష్మి, బసవయ్య కలిసి వాళ్లను అవమానిస్తారు. తర్వాత లాస్య అక్కడకు రావడంతో నందూ గొడవ చేస్తాడు. దీంతో విక్రమ్ ఆమె వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తాడు. కానీ, లాస్య మాత్రం దివ్య, విక్రమ్‌ను విడదీస్తానని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: జూన్ 26వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో లాస్యకు తమ ఆస్పత్రిలో ఉద్యోగం ఇవ్వాలని రాజ్యలక్ష్మి వాళ్లు చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. అంతేకాదు, విక్రమ్ కూడా తన భార్యను అసహ్యించుకునే పరిస్థితులు వచ్చాయి. ఇక, లాస్య ఎంట్రీతో దివ్య కాపురంలో చిచ్చు రేగే ప్రమాదం కనిపిస్తుంది. దీనికితోడు ఆమె దివ్య, విక్రమ్‌ విడాకులు తీసుకునేలా చేస్తానని అంటుంది. ఇక, రాజ్యలక్ష్మి వాళ్లు తులసి ఇంటికి వెళ్లడం వల్ల ఏం జరుగుతుందో అన్న టెన్షన్ క్రియేట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X