Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్ పెళ్లికి ఓకే.. పెళ్లి చూపుల్లో ఊహించని ఘటన.. కథలో బిగ్ ట్విస్ట్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.

తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

27వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ నిజం చెప్పగానే వాసుదేవ్ కోప్పడకుండానే మాట్లాడతాడు. అంతేకాదు, ఈ విషయాన్ని తులసి తనకు ముందే చెప్పేసిందని అంటాడు. ఆ తర్వాత ఇద్దరినీ పొగుడుతూ మాట్లాడి వెళ్లిపోతారు. మరోవైపు, దివ్య ఆస్పత్రి ముందు ధర్నాకు దిగుతుంది. దీంతో రాజ్యలక్ష్మి అక్కడకు వచ్చి అడగ్గా అసలు నిజం చెబుతుంది. అంతేకాదు, సంజయ్ ప్రియను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. దీంతో చేసేదేం లేక వాళ్లిద్దరికీ రాజ్యలక్ష్మి పెళ్లి జరిపిస్తుంది. మరోవైపు, క్యారమ్స్ ఆడుతూ నందూ, లాస్య ఒకరినొకరు దెప్పిపొడుకుంటారు.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


28వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సంజయ్, ప్రియకు పెళ్లి జరిపించడంతో దివ్యపై రాజ్యలక్ష్మి పగబడుతుంది. ఎలాగైనా ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. అంతలోనే ప్రియను తీసుకుని సంజయ్ ఇంటికి రావడంతో రాజ్యలక్ష్మి కొత్త నాటకం ఆడి ఆమెను ఔట్ హౌస్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తుంది. ఇక, లాస్యకు భాగ్య ఈ విషయం గురించి వివరించడంతో ఇద్దరూ కలిసి దివ్యను ఇరికించే ప్లాన్లు చేస్తుంటారు. ఇక, విక్రమ్‌కు ఏం జరుగుతుందో తెలియకపోవడంతో దివ్యకు బొకే ఇవ్వమని దేవుడికి చెప్తాడు. అది ఇవ్వగానే దివ్య ఎంతగానో సంతోషిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

29వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య పెళ్లి బాధ్యతను తాను తీసుకుంటానని నందూ అనడంతో పరందామయ్య, తులసి అతడికి కొన్ని సూచనలు చేస్తారు. మరోవైపు, ప్రియకు రాజ్యలక్ష్మి నిజస్వరూపం గురించి పని మనిషి వివరించి చెబుతుంది. అయినా ఆమె ఇల్లు వదిలి వెళ్లనని అంటుంది. అప్పుడే ఆమె వచ్చి ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది. ఇక, నందూకు తెలియకుండా లాస్య డబ్బు దాచుకోవాలని చూస్తుంది. అనుమానం వచ్చి అడగ్గా అబద్దాలు చెబుతుంది. ఇక, ఇంటికి తిరిగి వచ్చిన విక్రమ్.. తమ ఇంట్లో ప్రియను చూసి షాకై.. ఆమె ఎందుకు గురి ఆరా తీస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో ప్రియను చూసి షాకైన విక్రమ్.. ఆమె ఇక్కడెందుకు ఉందని ప్రశ్నిస్తాడు. దీంతో వాళ్ల తాతయ్య వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. దీంతో ప్రియతో పాటే సంజయ్ కూడా దోషం అయ్యే వరకూ ఔట్ హౌస్‌లోనే ఉండాలని చెప్తాడు. ఇక, విక్రమ్ పంపిన బొకేను తీసుకున్న లాస్య.. దాన్ని తులసికి ఇస్తుంది. కానీ, దాని మీద పేరు లేకపోవడంతో దివ్య ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత విక్రమ్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాస్య చూస్తుంది. చివర్లో లాస్యకు రాజ్యలక్ష్మి ఫోన్ చేసి తనకు ఒక పని చేయాలని డబ్బులు ఆఫర్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

31 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

31 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

31వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన మీద తరచూ చిరాకు పడుతున్న సంజయ్‌ను ప్రియ ప్రశ్నిస్తుంది. అప్పుడే రాజ్యలక్ష్మి రావడంతో సంజయ్ తనకు సహాయం చేయాలని తల్లిని అడుగుతాడు. అంతలో అక్కడకు విక్రమ్ రావడంతో లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రియ, సంజయ్ ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది. ఇక, రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లిన లాస్యకు ఆమె డబ్బు ఆఫర్ చేస్తుంది. దీంతో దివ్యకు, విక్రమ్‌కు పెళ్లి చేయమని రాజ్యలక్ష్మికి సలహా ఇస్తుంది. అలా చేస్తే దివ్య చెప్పినట్లు పడి ఉంటుందని అంటుంది. అలాగే, వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


01వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలో విక్రమ్ చెక్కులు పంచుతూ ఉండగా దివ్య చూసి షాక్ అవుతుంది. నిజం తెలుసుకున్న తర్వాత విక్రమ్‌ తనను నమ్మించి మోసం చేశాడంటూ గొడవకు దిగుతుంది. దీంతో విక్రమ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఎలాగోలా ఆమెను కూల్ చేసి ప్రేమిస్తున్నట్లు కన్ఫార్మ్ చేసుకుంటాడు. మరోవైపు, రాజ్యలక్ష్మితో డీల్ కుదుర్చుకున్న తర్వాత లాస్య.. దివ్యకు విక్రమ్ సంబంధం చూసినట్లు తులసి వాళ్లకు చెప్తుంది. వాళ్లు ఒప్పుకోకపోవడంతో దివ్య, విక్రమ్ ప్రేమించుకుంటున్నట్లు అందరికీ నిజం చెప్పేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో ప్రియ వ్యవహారంలో దివ్య చేసిన పనికి రాజ్యలక్ష్మి పగబడుతుంది. దీంతో ఆమెపై పగ తీర్చుకునేందుకు లాస్యతో డీల్ కుదుర్చుకుంటుంది. అంతేకాదు, విక్రమ్, దివ్యకు పెళ్లి చేయాలని రాజ్యలక్ష్మికి సలహా కూడా ఇస్తుంది. మరోవైపు, విక్రమ్ బ్యాగ్రౌండ్ గురించి దివ్య నిజం తెలుసుకోవడంతో కాస్త గొడవ జరిగినా వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఇక, వచ్చే వారం వీళ్ల పెళ్లి చూపులు జరగనున్నాయి. అందులో విక్రమ్ షాకివ్వబోతున్నట్లు ప్రోమోలో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X