Intinti Gruhalakshmi: మళ్లీ ఒక్కటవబోతున్న తులసి, నందూ.. విక్రమ్ పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్

కొత్త కొత్తవి వస్తున్నా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది.

దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

06వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన తర్వాత ఏదైనా తప్పు చేశానా అని దివ్య.. తులసిని అడుగుతుంది. దీంతో ఆమె కూతురు నిర్ణయాన్ని గౌరవించడంతో పాటు ఆమె తెగువను కొనియాడుతుంది. అదే సమయంలో నందూ ముందు లాస్య తులసిని తిడుతుంది.

దీంతో నందూ ఆమెకు క్లాస్ పీకుతాడు. మరోవైపు, విక్రమ్ తన మనసులోని మాటను మామయ్య చెప్పుకుంటాడు. ఇక, దివ్యను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు తనకు గతంలో పెళ్లి అయిందని, లాస్య బలవంతం చేయడంతోనే పెళ్లి చూపులకు వచ్చానని చెప్పి షాకిస్తాడు. దీంతో తులసి లాస్యతో గొడవ పడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

07వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్య మోసాన్ని తులసి నిలదీయడంతో ఆమె ఏదేదో చెప్పుకొస్తుంది. దీంతో తులసికి కోపం వచ్చి ఆమెను కొట్టబోతుంది. అప్పుడు నందూకు కంప్లైట్ చేయగా.. అతడు కూడా కొట్టమంటాడు. చివరకు లాస్యకు తులసి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక, విక్రమ్‌కు పెళ్లి చేయాలని అనుకున్న రాజ్యలక్ష్మి అతడి కోసం ఓ మధ్య తరగతి సంబంధం చూస్తుంది.

ఆ సమయంలో అతడి ప్రేమ గురించి అడగ్గా ఎవరినీ లవ్ చేయడం లేదని చెప్తాడు. ఇక, నందూ మరోసారి లాస్యకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. అలాగే, విక్రమ్‌ గురించి దివ్య తులసికి చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

08వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ గురించి దివ్య చెప్పగానే తులసి ఏదేదో ఊహించుకుని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ రెండు లక్షల రూపాయలను విక్రమ్‌కు ఇచ్చేయమని సలహా ఇస్తుంది. దీంతో విక్రమ్‌కు దివ్య ఫోన్ చేసి ఒక చోట కలుద్దామని అడ్రెస్ పంపుతుంది. దీంతో విక్రమ్ అక్కడకు వెళ్లగా.. తన ఫ్రెండ్ కనిపిస్తుంది. ఆమెకు ఓ విషయంలో క్లాస్ పీకుతుండగా దివ్య చూసి అతడిని అపార్థం చేసుకుంటుంది.

మరోవైపు, నందూ ఇంటికి అతడి ఫ్రెండ్ వస్తానని కాల్ చేస్తాడు. అలాగే, తులసిని మంచి వంటలు చేయమని చెప్పడంతో నందూ టెన్షన్ పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద క్లిక్ చేయండి.

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

09వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను అపార్థం చేసుకున్న తర్వాత తల్లి మాటలతో దివ్య రియలైజ్ అవుతుంది. అప్పుడే విక్రమ్‌కు రాజ్యలక్ష్మి పెళ్లి సంబంధం చూశానని, రేపే పెళ్లి చూపులు అని చెబుతుంది. మరోవైపు, వాసుదేవ్ కోరిక మేరకు తులసిని కాకా పట్టేందుకు నందూ ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు లాస్య అతడిని అపార్థం చేసుకోగా... జరిగిన విషయం మొత్తం ఆమెకు వివరిస్తాడు.

దీంతో లాస్య కూడా నందూకు సపోర్ట్ చేస్తుంది. ఇక, విక్రమ్‌కు పేదింటి అమ్మాయితో పెళ్లి చేస్తాననడంతో వాళ్ల తాత కోప్పడతాడు. దీంతో విక్రమ్ బాధ పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

10 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్య ప్లాన్ ప్రకారం తులసిని తన భార్యగా నటించేలా అడగడానికి నందూ.. పరందామయ్య, అనసూయకు ఈ విషయం చెప్తాడు. దీంతో వాళ్లిద్దరూ అతడికి గట్టిగానే క్లాస్ పీకుతారు. ఇక, హాస్పిటల్‌లో ఫైల్‌పై సంతకం చేయించడం కోసం సంజయ్ రూమ్‌కు వెళ్లిన దివ్యకు.. అక్కడ అతడు ఓ నర్స్‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోతాడు. దీంతో ఇద్దిరి మధ్య వాదన జరుగుతుంది.

ఆ తర్వాత లాస్య వచ్చి కాసేపు కాకా పట్టి తులసికి విషయం చెప్తుంది. దీంతో ఆమె గట్టిగానే సీరియస్ అవుతుంది. ఇక, విక్రమ్‌ను దివ్య మళ్లీ అపార్థం చేసుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శిరీషను మోసం చేసింది విక్రమ్ అనుకుని అతడిపై కేసు పెట్టేందుకు దివ్య సిద్ధం అవుతుంది. అప్పుడు శిరీష.. విక్రమ్ మంచోడని, అతడికి అమ్మాయిలంటే గౌరవం అని గొప్పదనం గురించి చెబుతుంది. దీంతో దివ్య పశ్చాత్తపపడడంతో పాటు అతడి గురించి సంతోషిస్తుంది. మరోవైపు, నందూకు భార్యగా నటించేందుకు తులసి అంగీకరిస్తుంది.

కానీ, త్వరగా నిజం చెప్పమని అంటుంది. దీంతో అతడు వాసుదేవ్ ముందర టెన్షన్ పడుతుంటాడు. ఇక, విక్రమ్‌ను చూడడానికి వచ్చిన అమ్మాయి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

మార్చి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో విక్రమ్ పెళ్లి చూపులు, దివ్య అతడిని అపార్థం చేసుకోవడం, వాసుదేవ్ రావడంతో తులసి, నందూ భార్య భర్తలుగా నటించడం వంటి వాటిని హైలైట్ చేశారు.

అంటే.. నందూ, తులసి మళ్లీ దగ్గర కావడంతో పాటు దివ్య, విక్రమ్ మధ్య ప్రేమ చిగురించేలా పరిస్థితులను చూపించారు. అంతేకాదు, వచ్చే వారంలో లాస్యను వాసుదేవ్ అమానించడాన్ని కూడా ఈ ఎపిసోడ్‌లో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X