Intinti Gruhalakshmi: అత్తకు షాక్‌లు ఇచ్చిన దివ్య.. నందూకు ఇబ్బందులు.. విక్రమ్ కీలక నిర్ణయం

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 15వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రాజ్యలక్ష్మికి సరైన బుద్ధి చెప్పాలని అనుకున్న దివ్య.. ఫస్ట్ నైట్‌ జరగకుండా చేసేది ఆమె అని అంటుంది. అలాగే, విక్రమ్ తన మాట వింటే మాత్రం ఎవరూ ఆపలేరని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. దీంతో బసవయ్య రాజ్యలక్ష్మిని రెచ్చగొడతాడు. అప్పుడు తాను రంగంలోకి దిగితే వాళ్ల ఆటలు సాగవు అంటుంది. ఇక, నందూకు వ్యతిరేకంగా లాస్య దొంగ సాక్ష్యాలు రెడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ తర్వాత తులసికి ఫోన్ చేసి రాజీ పడితే కేసు వాపసు తీసుకుంటానని చెప్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 16వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కోర్టుకు బయలుదేరుతున్న దివ్య, విక్రమ్‌ను ఆపిన రాజ్యలక్ష్మి పూజ ఉందని అంటుంది. అప్పుడే పంతులు కూడా అక్కడకు వచ్చి ఈరోజే లాస్ట్ అని అంటాడు. దీంతో దివ్య అత్తగారి ప్లాన్ అని గ్రహించి.. అందుకు తగ్గట్లుగానే ప్రవర్తిస్తుంది. తర్వాత కోర్టులో లాస్య తరపు లాయర్ తులసిని విచారిస్తాడు. అప్పుడామె సరైన సమాధానాలు చెప్తుంది. తర్వాత మోహన్ కూడా తులసి నుంచి కొన్ని నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ, లాస్య మాత్రం తనదైన యాక్టింగ్‌తో నందూదే తప్పు అన్నట్లుగా కోర్టులో చెబుతుంది.

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 17వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కోర్టులో విచారణ జరుగుతోన్న సమయంలోనే నందూపై లాస్య, ఆమె తరపు లాయరు ఎన్నో ఆరోపణలు చేస్తారు. కానీ, వాటిని తులసి తిప్పి కొడుతుంది. కానీ, అప్పుడే లాస్య సెట్ చేసిన మంగమ్మ వచ్చి నందూకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను చెబుతుంది. దీంతో అవి తప్పు అని నిరూపించుకునేందుకు జడ్జ్ నందూ వాళ్లకు మూడు రోజులు గడువు ఇస్తారు. ఇక, రాజ్యలక్ష్మి దొంగ పూజల గురించి తెలుసుకున్న దివ్య.. పంతులును తన వైపు తిప్పుకునేలా ఓ వీడియోను చూపిస్తోంది. దీంతో భయపడిన అతడు దివ్యకు సపోర్ట్ చేస్తానంటాడు.

Intinti Gruhalakshmi:

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 18వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పంతులును బ్లాక్ మెయిల్ చేయడంతో అతడు దివ్యకు అనుకూలంగా మారిపోతాడు. దీంతో కింద కూర్చుని టిఫిన్ చేయబోతున్న విక్రమ్‌తో 'మీ అమ్మగారి దోషం పోయింది. ఇకపై నువ్వు కూడా పైన కూర్చోవచ్చు' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మికి దివ్య ప్లాన్లు అర్థం అవుతాయి. ఆ తర్వాత అత్తగారికి అసలు భయం అంటే ఏంటో చూపిస్తానని దివ్య ప్రియకు చెబుతుంది. ఇక, దివ్యను చూడ్డానికి వస్తున్న తులసి, నందూను లాస్య అడ్డుకుంటుంది. అంతేకాదు, వాళ్లతో గొడవకు కూడా దిగుతుంది. అలాగే, వాళ్లపై నిందలు కూడా వేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

19 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 19వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ ఇంటికి వచ్చిన లాస్య కెఫే తాళాలను ఇవ్వమని అడుగుతుంది. కానీ, దానికి అతడు ఒప్పుకోడు. దీంతో లాస్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత నందూను తులసి కూల్ చేసే ప్రయత్నం చేయగా.. అతడు మాత్రం దివ్య ఇంటికి వెళ్దామని అంటాడు. దీంతో తులసి కూడా అతడితో వెళ్తుంది. అలా వెళ్తుండగా.. కెఫే మేనేజర్ ఫోన్ చేసి లాస్య వచ్చిందని చెప్తాడు. దీంతో ఆమెను బయటకు గెంటేయమంటాడు. ఆ తర్వాత నందూ, తులసి కలిసి దివ్య ఇంటికి వెళ్లగా.. రాజ్యలక్ష్మి తనకు పని ఉందని వాళ్లతో అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 20వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి, నందూను డోర్ దగ్గరే నిల్చోపెట్టి మాట్లాడుతుండడంతో విక్రమ్ ప్రశ్నిస్తాడు. అప్పుడు దివ్య.. బసవయ్య గురించి చెప్తుంది. దీంతో విక్రమ్ అతడిపై ఫైర్ అవుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి మాట్లాడుతుండగా.. కెఫే మేనేజర్ ఫోన్ చేసి లాస్య గొడవ చేస్తుందని నందూకు చెప్తాడు. అప్పుడతను కోపంగా అక్కడికి వెళ్తాడు. అప్పుడు మహిళా సంఘాలు వాళ్ల ముందు లాస్య నిందలు వేస్తుండగా.. నందూ ఆమెను కొట్టి బయటకు గెంటేస్తాడు. తర్వాత అందరికీ వార్నింగ్ ఇస్తాడు. దీంతో అందరూ వెళ్లిపోతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: మే 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్యకు నిజం తెలియడంతో అత్తగారి మీద పగ తీర్చుకోడానికి ప్రయత్నాలను ప్రారంభించడాన్ని చూపించారు. అలాగే, నందూపై లాస్య కేసు విషయంలో పట్టుబట్టడం, మహిళా సంఘాల వాళ్లను పిలిచి గొడవ చేయించడం వంటి వాటిని కూడా చూపించారు. ఇక, వచ్చే వారంలో రాజ్యలక్ష్మిపై డైరెక్టుగా మాటల దాడికి దిగుతుందని ప్రోమోలో చూపించారు. దీంతో వచ్చే వారం నుంచి మరింత ఆసక్తికరంగా మారబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X