Intinti Gruhalakshmi: పుట్టింటికి వెళ్లిపోయిన దివ్య.. విక్రమ్ మనసు మార్చేసి.. తులసికి వరుస షాక్‌లు

తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.

తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: May 1st to 6th Episodes highlights

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 01వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రాజ్యలక్ష్మి దగ్గర లాస్య డబ్బులు తీసుకోవడాన్ని చూసిన తులసి ఇంటికొచ్చిన తర్వాత పెద్ద గొడవ చేస్తుంది. అప్పుడు నందూ కూడా ఆమెకు కొట్టబోతాడు. దీంతో లాస్య.. గతంలో నందూ ఇచ్చిన మనీ మొత్తం పోగొట్టేశానని..

ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడం కోసం రాజ్యలక్ష్మి దగ్గర ఆ డబ్బును అప్పుగా తీసుకున్నానని అబద్ధం చెప్తుంది. దీంతో ఆమెపై అందరూ విరుచుకుపడతారు. అనంతరం ఆ డబ్బును తీసుకుని రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తారు. అప్పుడు చాలా డ్రామా నడిచిన తర్వాత వాళ్లు తీసుకొచ్చిన బ్రీఫ్‌కేస్‌ను ఆమెకు అందిస్తారు.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: May 1st to 6th Episodes highlights

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 02వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్‌లను ఫస్ట్ నైట్‌ కోసం రెడీ చేస్తారు. ఆ సమయంలో తనకు సలహాలు చెప్పమని అడిగినా దివ్యకు ఎవరూ సహకరించరు. కానీ, విక్రమ్‌ను మాత్రం వాళ్ల తాతయ్య సరదాగా ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత బిందెలో ఆట పెట్టగా దివ్య కోసం విక్రమ్ ఓడిపోతాడు.

దీంతో రాజ్యలక్ష్మికి కోపం వస్తుంది. అనంతరం వీళ్లిద్దరినీ శోభనం గదిలోకి పంపిస్తారు. అప్పుడే వాళ్లకు ఫస్ట్ నైట్ జరగకుండా చేసేందుకు రాజ్యలక్ష్మి మెట్లపై నుంచి పడిపోయినట్లు నటిస్తుంది. దీంతో విక్రమ్ శోభనం గదిలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: May 1st to 6th Episodes highlights

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 03వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్‌లను ఫస్ట్ నైట్‌‌ను చెడగొట్టేందుకు రాజ్యలక్ష్మి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎవరు ఎంత చెప్పినా విక్రమ్ తన తల్లి గురించే మాట్లాడతాడు. ఇక, ఇంటికి వచ్చిన తర్వాత రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి ప్లాన్ గురించి మాట్లాడి.. తర్వాత తనకు డబ్బులు కావాలని అడుగుతుంది.

అదంతా వెనుక నుంచి విన్న తులసి.. లాస్యను చెంపపై కొడుతుంది. దీంతో ఆమె గొడవ చేయగా.. నందూ వాళ్ల ముందు మళ్లీ కొడుతుంది. దీంతో నందూ తులసిని అపార్థం చేసుకుని తిడతాడు. అప్పుడు తులసి ఎంతగానో బాధ పడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: May 1st to 6th Episodes highlights

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 04వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. లాస్యను కొట్టినందుకు నందూ తిట్టడంతో తులసి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెను ఓదార్చడానికి వెళ్లిన పరందామయ్య, అనసూయకు ఆమె నిజాలు చెబుతుంది. అదంతా విన్న నందూ.. లాస్య మీదకు కోపంతో వెళ్తాడు. ఆ సమయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుంది.

దీంతో డబ్బు ఉందనే కదా మీరు కూడా చదువుకోని వాడిని అల్లుడిని చేసుకున్నారని అంటుంది. దీంతో నందూ.. లాస్యను లాక్కెళ్లి గుమ్మం బయట పెట్టి తలుపులు వేసేస్తాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఆమెను వదిలేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

05 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 05వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనను బయటకు గెంటేసి నందూ తలుపులు వేయడంతో.. లాస్య 'నువ్వు ఇప్పుడు తలుపు తీయకపోయినా.. నేను ఇదే ఇంట్లో అడుగు పెట్టి తీరుతాను. ఇది నా చాలెంజ్' అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాజ్యలక్ష్మి... విక్రమ్, దివ్య గురించి బాధ పడుతున్నట్లు నటిస్తుంది.

అంతేకాదు, వాళ్ల ఫస్ట్ నైట్‌కు ముహూర్తం కూడా ఫిక్స్ చేయిస్తుంది. ఆ తర్వాత సంజయ్.. ప్రియను కొట్టే ప్రయత్నం చేయగా.. దివ్య ఆపుతుంది. అంతేకాదు, ఆమెకు సారీ చెప్పాలని డిమాండ్ చేయడంతో క్షమాపణలు అడుగుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: May 1st to 6th Episodes highlights

06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 06వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రియ తీరుతో అనుమానం వ్యక్తం చేసిన దివ్య.. ఆమెను నిజం చెప్పమని అడుగుతుంది. కానీ, ప్రియ మాత్రం అస్సలు బయటపడదు. అంతేకాదు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ దివ్యకు రిక్వెస్ట్ చేస్తుంది. ఇక, దివ్యను చూడ్డానికి నందూ, తులసి వస్తుండగా.. పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేస్తారు.

మరోవైపు, దివ్యను శోభనం కోసం రెడీ చేస్తూ ఉండగా.. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే లాస్య నందూను అరెస్ట్ చేసిన విషయం దివ్యకు ఫోన్ చేసి చెబుతుంది. దీంతో ఎవరికీ చెప్పకుండానే ఆమె ఇంటికి వచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week Roundup Story: May 1st to 6th Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే : మే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ వాయిదా వేయడాన్ని చూపించారు. అలాగే, లాస్య నిజస్వరూపం తెలుసుకున్న తులసి ఆమెను కొడుతుంది.

ఆ తర్వాత నందూ కూడా ఆమెపై ఫైర్ అవడంతో పాటు ఇంట్లో నుంచి గెంటేస్తాడు. దీంతో లాస్య పోలీస్ కేసు పెట్టడంతో నందూ జైలు పాలవడం చూపించారు. ఇక, వచ్చే వారం దివ్య చెప్పకుండా వెళ్లిపోయిందని విక్రమ్‌ను అందరూ రెచ్చగొడుతూ ఉంటారు. దీంతో ఇది ఆసక్తికరంగా సాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X