Intinti Gruhalakshmi: దివ్య దెబ్బకు రాజ్యలక్ష్మి మైండ్ బ్లాక్.. లాస్య వీడియో మిస్ అవడంతో ట్విస్ట్
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.
తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 22వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్ తనను తిట్టడంతో రాజ్యలక్ష్మి ముందు బసవయ్య ఫీల్ అవుతుంటాడు. అప్పుడామె ఆస్తి కోసం కొన్ని ఇబ్బందులు తప్పవు అని సర్థి చెప్తుంది. అప్పుడే విక్రమ్ వచ్చి పంట డబ్బులు ఆమెకు ఇస్తాడు. ఆమె మాత్రం నటిస్తూ ఆ డబ్బు దివ్యకు ఇవ్వమంటుంది.
కానీ, దానికి విక్రమ్ ఒప్పుకోడు. తర్వాత అతడు వెళ్లగానే రాజ్యలక్ష్మితో దివ్య ఛాలెంజ్ చేస్తుంది. మరోవైపు, నందూను మోహన్ మందలించగా.. తులసిని అంటే తట్టుకోలేనని అంటాడు. ఇక, విక్రమ్‌ను కొత్తగా మార్చేసిన దివ్యను రాజ్యలక్ష్మి అందరి ముందే మందలిస్తుంది.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 23వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య సలహా మేరకు స్టైలిష్‌గా మారిన విక్రమ్‌ను రాజ్యలక్ష్మి కోప్పడుతుంది. దీంతో అతడు ఆమె కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. దీంతో దివ్యపై గెలిచినట్లు రాజ్యలక్ష్మి గర్వంగా ఫీల్ అవుతుంది. అనంతరం విక్రమ్‌ను తాతయ్య రెచ్చగొడతాడు.
దీంతో దివ్య వెనుకాలే వెళ్తుంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి చూసి అతడిని ఆపుతుంది. ఇక, లాస్య దగ్గరకు తులసి వచ్చి రాయభారం చేయబోగ.. ఆమె కొన్ని డిమాండ్లను ఉంచుతుంది. దీంతో చేసేదేం లేక తులసి వెళ్లిపోతుంది. తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకూ వివరిస్తుంది.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 24వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనకు తెలియకుండా లాస్య దగ్గరకు వెళ్లినందుకు తులసిపై నందూ సీరియస్ అవుతాడు. అంతేకాదు, ఆమెను తన విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తాడు. దీంతో తప్పు అయిపోందని తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత విక్రమ్ వేరే గదిలో ఉండగా.. తన దగ్గరకు తెచ్చుకునేందుకు దివ్య ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం అతడికి సైగలు చేయడంతో ఆమెతో వచ్చేస్తాడు. అప్పుడు చూసిన బసవయ్య తీసుకెళ్లి తన దగ్గర పడుకోబెట్టుకోవడంతో పాటు విక్రమ్ కాళ్లను తాళ్లతో కట్టేస్తాడు.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 25వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసికి సారీ చెప్పేందుకు నందూ ఎంతగా ప్రయత్నించినా ఆమె ఒప్పుకోదు. దీంతో అత్తమామలు వచ్చి ఆమెను బ్రతిమాలుతారు. దీంతో తులసి కూడా నందూ మంచి కోసమే మాట్లాడుతుంది. ఇక, దివ్య వచ్చి అత్తగారి ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చోగా.. రాజ్యలక్ష్మి మాత్రం ఎంతో పొగరుగా మాట్లాడుతుంది.
అంతలో విక్రమ్ వచ్చి దివ్య గురించే మాట్లాడుతుంటాడు. దీంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. ఇక, లాస్యకు వ్యతిరేకంగా సాక్షులను తులసి తీసుకు వస్తుంది. అప్పుడు లాస్య.. నందూ తనను కొట్టిన వీడియో చూపిస్తుంది.

26 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 26వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కోర్టులో నందూకు సపోర్టుగా కొందరు సాక్ష్యం చెప్పగా.. వాళ్లు గతంలో చీటింగ్ కేసులో ఇరుక్కున్నట్లు లాస్య తరపు లాయర్ చెప్తాడు. దీంతో ఆ సాక్ష్యాలు చెల్లవని జడ్జ్ అంటాడు. దీంతో విచారణను మళ్లీ వాయిదా వేస్తారు. బయటకు వచ్చిన తర్వాత లాస్య అందరితో గొడవకు దిగుతుంది.
ఇక, కోర్టులో గొడవ తర్వాత రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి దివ్య మీద కంప్లైంట్ ఇస్తుంది. దీంతో ఆమె యాక్సిడెంట్ అయినట్లు నాటకం ఆడుతుంది. ఆ విషయాన్ని దివ్య గ్రహించి అత్తకు సరైన బుద్ది చెప్పేలా మాట్లాడడంతో ఆమె షాక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 27వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ కేసు గురించి అందరూ మాట్లాడుతుండగా.. తులసి వచ్చి కాంప్రమైజ్ అయితేనే మంచిది అంటాడు. కానీ, నందూ మాత్రం దానికి ఒప్పుకోడు. విక్రమ్ ముందర ఆమె తల్లి గురించి దివ్య మాట్లాడుతుంది. అది నచ్చక అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక, నందూ జైలుకు వెళ్లిపోవడం ఖాయం అనుకుని అందరినీ జాగ్రత్తగా చూసుకోమని తులసికి చెబుతాడు. దీంతో తులసి అతడిని ఓదార్చుతుంది. ఇక, దివ్య వచ్చి రాజ్యలక్ష్మి కాలు విరగలేదని అందరి ముందే నిరూపిస్తుంది. దీంతో అంతా సంతోషిస్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: మే 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో నందూ, లాస్య కేసును మళ్లీ హైలైట్ చేసి చూపించారు. కానీ, ఈ విషయంలో లాస్య వైపే మొగ్గు ఉన్నట్లు అర్థం అయింది.
మరోవైపు, దివ్య అత్తగారి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉండగా.. ఆమె యాక్సిడెంట్ డ్రామా ఆడి ఇరుక్కుపోతుంది. వచ్చే వారంలో దీన్ని హైలైట్ చేయబోతున్నారు. అలాగే, లాస్య దగ్గర ఉన్న వీడియోను తులసి మాయం చేసినట్లుగా వచ్చే వారం ప్రోమోలో చూపించి ఆసక్తి పెంచారు.


Click it and Unblock the Notifications











