Intinti Gruhalakshmi: లాయర్‌తో రాజ్యలక్ష్మి ప్లాన్.. నందూకు మరింత శిక్ష.. దివ్యతో తులసి తెగదెంపులు
చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.
తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 29వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ ఇమేజ్ పాడు చేసేందుకు లాస్య ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకుంటుంది. అప్పుడతను లాస్యను నందూ కొట్టిన వీడియోను వైరల్ చేస్తాడు. అది చూసిన ఓ కస్టమర్ కెఫేలో ఎవరూ ఉండొద్దని నానా రచ్చ చేస్తుంది.
తర్వాత రాజ్యలక్ష్మి కాలికి కట్టు విప్పేసి ఆమెకు మర్ధనా చేస్తూ దివ్య చుక్కలు చూపిస్తుంది. అంతేకాదు, ఆ కాలు విరిచేస్తానని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇక, భాగ్యను ఇంటికి పిలిచిన తులసి.. ఆమె భర్త సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకునేలా చేస్తుంది. దీంతో లాస్య ఫోన్‌లో ఉన్న వీడియోను భాగ్య డిలీట్ చేసేస్తుంది.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 30వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి తనకు మంచి చేసిందన్న కారణంతో లాస్య ఫోన్‌లో ఉన్న వీడియోను భాగ్య డిలీట్ చేస్తుంది. ఆ వెంటనే ఈ విషయాన్ని తులసికి ఫోన్ చేసి చెప్తుంది. మరోవైపు, రాజ్యలక్ష్మిని ఒక్కరోజులోనే నడిచేలా చేస్తానన్న దివ్య.. ఆమె కాళ్లకు బలంగా మర్ధనా చేస్తుంది.
అంతేకాదు, వెంటనే నడవకపోతే కాళ్లు విరగ్గొడతానని బెదిరిస్తుంది. దీంతో ఆమె నడుచుకుంటూ కొడుకు దగ్గరకు వస్తుంది. అది చూసి విక్రమ్ వాళ్లు సంతోషిస్తారు. ఇక, లాస్య ఇంటికి వచ్చి నందూ వాళ్లను బెదిరిస్తుంది. దీంతో వాళ్లు కూడా ఆమెకు ఎదురు తిరుగుతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 31వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తల్లి నడిచేలా చేసినందుకు దివ్యకు విక్రమ్ గులాబీ పువ్వు ఇవ్వడంతో అతడిపై ఫైర్ అవుతుంది. తర్వాత నందూ, తులసి కోర్టుకు బయలుదేరుతుండగా లాస్య వచ్చి గొడవ పడుతుంది. అప్పుడు అందరూ కలిసి వెళ్తారు. ఆ సమయంలో లాస్య ఫోన్‌లో వీడియో డిలీట్ అయినట్లు తులసి చెప్తుంది.
దీంతో అప్పుడు షాకైనట్లు నటించిన లాస్య.. కోర్టులో మాత్రం ఆ వీడియోను చూపిస్తుంది. దీంతో జడ్జ్ అతడికి జైలు శిక్షను విధిస్తాడు. దీంతో అందరూ షాక్‌కు గురవుతారు. అదే సమయంలో లాస్యకు నందూ గట్టి వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 01వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూను జైలుకు తీసుకు వెళ్లిన వెంటనే ఆ విషయాన్ని రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి చెప్తుంది. దీంతో దివ్య వచ్చిన వెంటనే ఆమెను అవమానించాలని బసవయ్య వాళ్లు ప్లాన్ చేసుకుంటారు. అందుకు తగ్గట్లుగానే ఆమె వచ్చిన వెంటనే తండ్రి గురించి మాట్లాడి ఫీల్ చేస్తారు.
దీంతో దివ్య బాధ పడుతుంది. అప్పుడు విక్రమ్ వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. దీంతో అతడికి క్లాస్ పీకుతుంది. ఇక, లాస్య తీరును ఎండగట్టిన తులసి.. ఆమెపై సీరియస్ అవుతుంది. అంతేకాదు, కేసును రీఓపెన్ చేయిస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
02 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 02వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్ బాగా క్లోజ్ అవుతున్నారని రాజ్యలక్ష్మిని బసవయ్య రెచ్చగొడతాడు. దీంతో ఆమె తండ్రి కోసం ఆమె చేసే పనులతో వాళ్ల మధ్య దూరం పెంచాలని ప్లాన్ చేస్తుంది. ఇక, లాస్య ఏదైనా తప్పు చేసినట్లు కనిపిస్తే కేసును రీ ఓపెన్ చేయించవచ్చని మోహన్ చెప్పడంతో తులసి సంతోషిస్తుంది.
ఇక, రాజ్యలక్ష్మి అనుకున్నట్లుగానే దివ్య.. అందరినీ ఎదురించి మరీ తండ్రిని చూడడానికి వెళ్తుంది. ఇక, దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చిన లాస్య.. ఎవరు ఆపినా ఆగకుండానే తన గదిలోకి వెళ్లి కెఫే డాక్యూమెంట్లను తీసుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో: 03వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఇంటికి వచ్చిన లాస్య.. తన గదిలో ఉన్న కెఫే డాక్యూమెంట్లను దౌర్జన్యంగా తీసుకు వెళ్తుంది. తర్వాత తులసికి ఫోన్ చేసిన రాజ్యలక్ష్మి.. దివ్యపై లేనిపోనివి అన్ని చెప్పి నమ్మిస్తుంది. అంతేకాదు, ఇకపై ఆమె పుట్టింటి ఆలోచన లేకుండా ఉంటేనే కాపురం నిలబడుతుందని చెప్తుంది.
తర్వాత లాయర్‌ను తీసుకు వచ్చి నందూకు మరింత ఎక్కువ కాలం శిక్ష పడేలా చేయమంటుంది. కానీ, విక్రమ్‌కు అబద్దాలు చెప్తుంది. అనంతరం తులసి జైలుకు వెళ్లి నందూను కలుస్తుంది. అప్పుడే దివ్య కూడా అక్కడకు వస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే: మే 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో నందూ, లాస్య కేసును మళ్లీ హైలైట్ చేసి చూపించారు.
చివరకు ఇందులో నందూకు జైలు శిక్షను విధించి పంపించారు. ఇక, రాజ్యలక్ష్మి యాక్సిడెంట్ డ్రామాను తిప్పి కొట్టిన దివ్యను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే తులసికి ఫోన్ చేసి రాజ్యలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. దీంతో నందూ, తులసి తమ గొడవల్లో నుంచి దివ్యను వెళ్లిపోమని సీరియస్‌గా చెబుతారు.


Click it and Unblock the Notifications











