Intinti Gruhalakshmi: దివ్యకు తెలిసిన సంచలన నిజం.. అత్తపై యుద్ధం.. దొంగ సాక్ష్యాలతో నందూకు షాక్

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 08వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ అరెస్ట్ అయిన తర్వాత దివ్య ఇంటికి వచ్చి తులసిని ప్రశ్నిస్తుంది. దీంతో భార్యభర్తల విషయంలో నేను కలుగజేసుకుంటే అందరూ నిందలు వేస్తారని సమాధానం చెప్తుంది. ఇక, దివ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో లాస్య, రాజ్యలక్ష్మి తమ ప్లాన్ వర్కౌట్ అవుతుందని మాట్లాడుకుంటారు. అనంతరం అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. నందూ తప్పు చేశానంటూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడు దివ్య.. లాస్యతో మాట్లాడతానని అనగా.. నందూ వద్దంటాడు. తర్వాత ఇంట్లో చెప్పకుండా వచ్చిన విషయాన్ని దివ్య వాళ్లకు చెప్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

divyanandu

09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 09వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ కోసం అందరూ పోలీస్ స్టేషన్‌లో ఉండగానే మాధవి భర్త వస్తాడు. అప్పుడు లాస్య వచ్చి దివ్య, తులసి, నందూలతో గొడవ పడుతుంది. అంతేకాదు, రాత్రికి మనసు మార్చుకుంటే కేసు వాపసు తీసుకుంటా అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు, చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని దివ్య మీద లేనిపోనివి మాట్లాడి అందరూ విక్రమ్‌ను రెచ్చగొడతారు. అప్పుడతను ఫోన్ చేయగా.. దివ్య కాల్ కట్ చేస్తుంది. తర్వాత తులసికి లాస్య ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆమె సరైన సమాధానం చెప్తుంది.

 iigl

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 10వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మాధవి భర్త మోహన్.. నందూకు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడు. అప్పుడు దివ్య తండ్రిని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. అనంతరం రాజ్యలక్ష్మికి విక్రమ్ క్షమాపణలు చెబుతాడు. అంతలోనే దివ్య అక్కడకు రావడంతో అతడు ఆమెను మనసును ఇబ్బంది పెట్టేలా మాట్లాడతాడు. దీంతో దివ్య.. రాజ్యలక్ష్మి కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. తర్వాత విక్రమ్‌పై అసహనం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, ఇకపైనా తన పుట్టింటికి అలాగే వెళ్లిపోతానని అంటుంది. అనంతరం విక్రమ్.. దివ్యతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.

 iigl

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 11వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తర్వాత నందూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దీంతో అతడిని అనసూయ దగ్గరకు తీసుకుని ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. అప్పుడతను లాస్యకు విడాకులు ఇస్తానని అంటాడు. దీనికి అందరూ సపోర్టుగానే మాట్లాడతారు. కానీ, తులసి మాత్రం అతడి నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకుతుంది. ఇక, తనపై కోపంగా ఉన్న దివ్యను కూల్ చేసేందుకు విక్రమ్ ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఆమె దూరంగా వెళ్లిపోతుంది. చివరకు ఇద్దరూ మాట్లాడుకుంటారు. దీంతో అసలు నిజాలను తెలుసుకుంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 iigl

12 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 12వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ బాధ పడుతుండడంతో రాములమ్మ వచ్చి తులసితో అతడి గురించి మాట్లాడుతుంది. దీంతో తులసి.. అనసూయకు అన్నం తినిపించమని చెప్తుంది. అనంతరం భర్త భుజంపై వాలిన దివ్య.. అసలేం జరిగిందో అతడికి వివరించి చెప్తుంది. దీంతో విక్రమ్ ఆమెకు అండగా నిలుస్తానని అంటాడు. అదంతా విన్న బసవయ్య.. రాజ్యలక్ష్మిని రెచ్చగొడతాడు. ఇక, తనకు అన్యాయం జరుగుతుందని లాస్య.. మహిళా సంఘాలను తీసుకొచ్చి నందూ ఇంటి ముందు ధర్నా చేస్తుంది. వాళ్లకు తులసి సరైన సమాధానం చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 iigl

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో : 13వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ప్రియ తీరుపై అనుమానం వ్యక్తం చేసిన దివ్యకు విక్రమ్ తాతయ్య నిజాలు మొత్తం చెప్పేస్తాడు. ఆ తర్వాత ప్రియ కూడా తొలిసారి పెదవి విప్పి రాజ్యలక్ష్మి గురించి చెబుతుంది. దీంతో దివ్య అత్తగారిపై యుద్దం చేస్తానని అంటుంది. మరోవైపు, నందూ మందు తాగుతూ బాధ పడుతుండగా తులసి వెళ్లి ఆపుతుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాదనలు జరుగుతాయి. దీంతో నందూకు తులసి క్లాస్ పీకుతుంది. ఇక, దివ్య తన అత్తకు బుద్ధి చెప్పాలని అనుకుని ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 iigl

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే : మే 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో దివ్య, విక్రమ్ మధ్య గొడవ పెట్టాలనుకున్న రాజ్యలక్ష్మి ప్లాన్‌ను, నందూను లాస్య అరెస్ట్ చేయించడాన్ని బాగా హైలైట్ చేసి చూపించారు. అలాగే, రాజ్యలక్ష్మి నిజస్వరూపాన్ని తెలుసుకున్న దివ్య.. ఆమెను కంట్రోల్ చేయాలని ప్లాన్లు చేసుకుంటుంది. ఇక, వచ్చే వారం నందూ కోర్టు హియరింగ్‌ను హైలైట్ చేయబోతున్నారు. ఇది ఎంతో ఆసక్తికరంగా సాగబోతున్నట్లు ఈరోజు ప్రోమోలో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X