Intinti Gruhalakshmi Weekly Roundup: వాళ్లకు తులసి షాక్.. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన మామ.. కథలో మలుపు
ఇండియాలోని మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
14వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఇంట్లో అభి గొడవ చేయడంతో సామ్రాట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే నందూ ఇంటికి నేరుగా వెళ్లి.. వాళ్లతో గొడవకు దిగుతాడు. ఆ సమయంలో నందూ కాస్త ఓవర్ చేసినా.. సామ్రాట్ మాత్రం తాను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్తాడు. అంతేకాదు, తులసికి ఒక స్నేహితుడిలా ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేస్తాడు. కానీ, వాళ్ల మధ్య ప్రేమ ఉందని నందూ అంటాడు. దీంతో సామ్రాట్‌కు కోపం వచ్చి వెళ్లిపోతాడు. అదంతా చూసిన తులసి మాత్రం ఎవరికీ కనిపించకుండానే వెళ్లిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
15వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూతో గొడవ పడి వెళ్లిపోయిన సామ్రాట్ ఒంటరిగా కూర్చుని బాధ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో వాళ్ల బాబాయి వచ్చి అతడిని ఓదార్చే ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు, తులసిని ప్రేమ్ ఓదార్చడానికి చూస్తుంటాడు. మొదట్లో మొరాయించిన ఆమె.. ఆ తర్వాత కూల్ అవుతుంది. దీంతో సామ్రాట్ గారు నీకు సపోర్టు చేస్తున్నారు.. ఆయనను అర్థం చేసుకో అని చెబుతాడు. ఇక, సామ్రాట్ మాటలతో నందూ ఆలోచనలో పడిపోతాడు. ఆ సమయంలో లాస్య వచ్చి అతడిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ గొడవ పెట్టుకుని వెళ్లిన తర్వాత తులసి విషయంలో తాను తప్పుచేశానని నందూ పశ్చాత్తాప పడుతుంటాడు. ఇంతలో లాస్య వచ్చి తులసిపై నిందలు వేసే ప్రయత్నం చేయగా అతడు సీరియస్ అవుతాడు. అంతేకాదు, తాను ముంబై వెళ్తున్నానని, వచ్చే వరకూ గొడవలు చేయొద్దని చెప్తాడు. అనంతరం సామ్రాట్, తులసి కలుసుకుంటారు. ఆ సమయంలో సామ్రాట్‌ను తులసి చాలా ప్రశ్నలు అడుగుతుంది. దానికతడు సమాధానాలు చెప్తాడు. దీంతో ఒకరికొకరు సారీ చెప్పుకుని.. మళ్లీ ఇద్దరూ కలిసిపోతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
17వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన అనసూయ.. అతడితో మనసు విప్పి మాట్లాడి నందూ బాధను వివరించి చెప్తుంది. ఆ తర్వాత నందూ కొనిచ్చిన బట్టలను ఆయనకు అందిస్తుంది. దీంతో లాస్య ఈ విషయం చెప్పడానికి నందూకు ఫోన్ చేయగా.. అతడు మాత్రం లిఫ్ట్ చేయడు. అంతేకాదు, ఇంకా తులసి ఆలోచనలోనే ఉంటాడు. ఇక, చివర్లో పరందామయ్య కోసం తులసి పూజ చేయించాలని అనుకుంటుంది. అలాగే వస్తుండగా అనసూయ, లాస్య ఆపుతారు. కానీ, పరందామయ్య మాత్రం తులసికే జై కొడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
18వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఇంటికి వచ్చిన పరందామయ్య ‘అన్నింటికీ తెగించి నేను ఇక నా మనసుకు నచ్చిన పని చేస్తున్నాను. అందుకే నా వాళ్ల మధ్య పుట్టినరోజు జరుపుకోవాలని వచ్చాను' అని చెప్తాడు. దీంతో అందరూ సంతోషంగా పూజ జరుపుకుని ఎంజాయ్ చేస్తుంటారు. దీంతో కోపంతో ఉన్న అనసూయ అక్కడకు వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. తులసిని తిడుతుంది. దీంతో పరందామయ్య ఆమెపై ఫైర్ అవుతాడు. అప్పుడు అనసూయ భర్తను కూడా తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. చివరికి అక్కడ వస్తువులన్నీ కింద పడేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
19వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కోపంతో వచ్చిన అనసూయ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో పరందామయ్య ఆమెను ఎదురించి మాట్లాడడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. కానీ, అనసూయ మాత్రం అస్సలు వినదు. అంతేకాదు, భర్తగా, తండ్రిగా పరందామయ్య ఫెయిల్ అయ్యాడని ఆరోపిస్తుంది. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు మాట్లాడినా ఆమె అందరిపై చిందులు వేస్తుంది. దీంతో పరందామయ్యకు స్పృహ తప్పుతుంది. అప్పుడు తులసి.. అనసూయకు మాస్ వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు, మామయ్యను తన దగ్గరే ఉంచుకుంటానని అంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
నవంబర్ 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో పరందామయ్య పుట్టినరోజును బాగా హైలైట్ చేశారు. ఆయన బర్త్‌డే రోజునే తులసి ఇంటికి రావడం.. దీంతో అనసూయను అభి, లాస్య రెచ్చగొట్టడం వంటి వాటితో ఆమె తులసి వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ నానా రచ్చ చేస్తుంది. దీంతో ఇకపై పరందామయ్యను తన దగ్గరే ఉంచుకోవాలని తులసి డిసైడ్ అయింది. మొత్తానికి మామను కోడలికి దగ్గర చేశారు. అలాగే తులసిలోని మరో కోణాన్ని బయటకు తీసుకు వచ్చారు. ఇక, వచ్చే వారం ఎపిసోడ్‌లో పరందామయ్య ఆమె ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయినట్లు చూపించారు.


Click it and Unblock the Notifications











