Intinti Gruhalakshmi Weekly Roundup: తులసికి మంచి రోజులు.. వాళ్లంతా ఒక చోటుకే.. ఆసక్తిగా మారిన కథ

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూసేయండి!

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


21వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. జరిగిన దానిని చూసి తలుచుకుంటూ పరందామయ్య కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. దీంతో తులసి, సామ్రాట్ ఆయనకు సర్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ తర్వాత కాసేపటికి ఆయన కోలుకుంటాడు. మరోవైపు, అనసూయ మాత్రం ఇంటికి వెళ్లినప్పటి నుంచి పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తిస్తూ రచ్చ రచ్చ చేస్తుంటుంది. దీంతో అందరూ ఆమెను భయంతో చూస్తుంటారు. ఆ సమయంలో శృతి ఆమెకు సర్ధి చెప్పాలని చూస్తుంది. కానీ, అనసూయ మాత్రం అస్సలు వినదు. దీంతో లాస్యలో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంటుంది.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


22వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. దీంతో తులసి అతడిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ సమయంలో ఆమె లోపలికి వెళ్లగా.. పరందామయ్య తప్పించుకుని వెళ్లిపోతాడు. దీంతో సామ్రాట్‌ను పిలిచి ఆయనను వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు పరందామయ్య సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కావాలని ఒకరిని అడుగుతుంటాడు. అది చూసి తులసి బాధ పడుతుంది. మరోవైపు అనసూయ ఏమీ జరగనట్లు మాట్లాడుతుంది. ఆ సమయంలో పరందామయ్యను తీసుకు రమ్మని లాస్య రిక్వెస్ట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

23వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య తన బాధను మర్చిపోకుండా ఉండడంతో తులసి, సామ్రాట్, వాళ్ల బాబాయి కలిసి ఆయనను బయటకు తీసుకు వెళ్తారు. అక్కడ వాళ్లంతా ఆయనను నవ్వించే ప్రయత్నం చేసినా కూల్ అవడు. మరోవైపు, ప్రేమ్, శృతి ఇల్లు వదిలి వెళ్లిపోతారు. దీంతో అనసూయ కుప్పకూలిపోతుంది. అనంతరం పరందామయ్యను తీసుకొచ్చేందుకు తులసి ఇంటికి వెళ్తుంది. కానీ, ఆమె మాత్రం రానని పట్టుబడతాడు. అంతేకాదు, ఆమెను బయటకు పంపించి తలుపులు మూసేస్తాడు. దీంతో అనసూయ చనిపోతానని వార్నింగ్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


24వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య తన మాట వినకపోవడంతో అనసూయ దారిలోకి వచ్చి బ్రతిమాలడం మొదలు పెడుతుంది. కానీ, ఆయన మాట్లాడడు. దీంతో తులసిని నిందిస్తుంటుంది. అప్పుడు పరందామయ్యకు కోపం వచ్చి బయటకు వస్తాడు. అంతేకాదు, ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. అలాగే, తనను ప్రశాంతంగా వదిలి వెళ్లకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తాడు. మరోవైపు, ఎవరూ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో డౌట్ వచ్చిన నందూ.. ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు అభి ప్రవర్తన చూసి అతడికి డౌట్లు పెరుగుతాయి. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


25వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య వెళ్లిపోమని వేడుకోవడంతో చేసేందేం లేక అనసూయ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లిపోతోంది. దీంతో ఆమెను తులసి కాపాడుతుంది. అంతేకాదు, అసలు గొడవ ఎందుకు వచ్చింది అనేది అనసూయకు వివరించి చెబుతుంది. దీంతో ఆమె తులసికి క్షమాపణలు చెప్పడంతో తన భర్తను పంపించమని కోరుతుంది. మరోవైపు, లాస్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న నందూ.. అందరిపై అరుస్తుంటాడు. అప్పుడు తులసి, అనసూయ అక్కడికెళ్తారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


26వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసితో కలిసి ఇంటికి వచ్చిన అనసూయను నందూ ఇంట్లోకి రానివ్వకుండా ఆపుతాడు. అంతేకాదు, తన తండ్రిని ఇంతలా అవమానించిన తల్లిపై విరుచుకుపడతాడు. ఆ స్థానంలో మరొకరు ఉంటే చంపేసేవాడిని అని అంటాడు. అంతేకాదు, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ.. నాకు నా తండ్రి కావాలి అంటూ నందూ ఎమోషనల్ అవుతాడు. దీంతో తులసి అతడికి ఎదురు తిరుగుతుంది. దీంతో లాస్య, నందూలు ఆమెపై నిందలు వేస్తారు. అప్పుడామె వాళ్లకు ధీటుగా సమాధానం చెబుతుంది. మరోవైపు, తులసికి ఏమైందా అని సామ్రాట్ టెన్షన్ పడుతుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


నవంబర్ 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో పరందామయ్య అనసూయను వదిలేసి తులసి దగ్గరకు రావడాన్ని హైలైట్ చేశారు. ఈ క్రమంలోనే అనసూయ పిచ్చిపట్టినట్లుగా వ్యవహరించడం, ప్రయత్నాలు విఫలం అవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం.. నందూ తన తల్లికే ఎదురు తిరగడంతో ఈ వారం సీరియల్ ఆసక్తికరంగా సాగింది. ఇక, ఈ పరిణామం వల్ల మళ్లీ తులసి, అనసూయ మరోసారి కలిసిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X