Intinti Gruhalakshmi Weekly Roundup: లాస్య ఖేల్ ఖతం.. సామ్రాట్‌కు కొత్త కష్టం.. ఆమె రాకతో ట్విస్ట్!

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూసేయండి మరి!

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


28వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అనసూయ, పరందామయ్య మధ్య గొడవ జరగడానికి కారణం తులసే అని లాస్య నిందలు వేస్తుంది. దీంతో తులసి ఆమెకు ఎదురు తిరుగుతుంది. అంతేకాదు, ఓ రేంజ్‌లో క్లాస్ కూడా పీకుతుంది. అప్పుడు అనసూయ.. తులసి వల్ల గొడవ జరగలేదని అంటుంది. అయినప్పటికీ నందూ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఎలాగైనా తన తండ్రిని ఇంటికి తీసుకు రమ్మని డిమాండ్ చేస్తాడు. అంతేకాదు, తులసి, అనసూయను బయటకు పంపేసి తలుపులు వేస్తాడు. అంతలోనే అక్కడకు పరందామయ్య ఎంట్రీ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


29వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ చేతిలో ఇంటి డాక్యూమెంట్లను పెట్టిన లాస్య.. తులసి తన పేరిట రాసిచ్చిందని చెబుతుంది. దీంతో అందరూ ఆ ఇంట్లో ఉండమని అంటారు. అప్పుడు నందూ తన తండ్రితో పాటు అందరినీ బ్రతిమాలతాడు. అదే సమయంలో తులసి కూడా వాళ్లకు సర్ధి చెబుతుంది. దీంతో అందరూ ఇంట్లోకి వెళ్తారు.. కానీ, అనసూయ, పరందామయ్య వెళ్లరు. అప్పుడు వాళ్లను కూడా తులసి ఒప్పిస్తుంది. అనంతరం సామ్రాట్‌, తులసి కారులో వెళ్తుంటారు. ఆ సమయంలోనే ఇద్దరూ సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


30వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్, తులసి నడుచుకుంటూ వెళ్తుండగా ఐస్ బండి కనిపించడంతో కుల్ఫీలు కొనుక్కొని తింటారు. ఆ తర్వాత చిన్ననాటివి గుర్తు చేసుకుని సంతోషిస్తారు. అనంతరం పరందామయ్యకు అనసూయ క్షమాపణ చెప్పడంతో పాటు చాలా బాధ పడుతుంది. కానీ, ఆయన మాత్రం ఇష్టం లేకుండానే మాట్లాడి వెళ్లిపోవాలని అనుకుంటాడు. దీంతో అనసూయ కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు ప్రేమ్.. తులసికి ఫోన్ చేయగా వెంటనే అక్కడకు వస్తుంది. ఆ తర్వాత లాస్యను వెళ్లిపోమని తులసితో అనసూయ మాట్లాడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


1వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన అనసూయ.. పశ్చాత్తపపడుతూ ఉంటుంది. అంతేకాదు, ఆ సమయంలో తులసిని తన ఇంటికి వచ్చి పోతూ ఉండమని కోరుతుంది. దీనికి తులసి మాత్రం ఒప్పుకోదు. దీంతో చాలా సేపు బ్రతిమాలిన తర్వాత ఓకే అంటుంది. మరోవైపు, తనను బయటకు పంపడంపై లాస్య గుర్రుగా ఉంటుంది. ఆ తర్వాత తులసి బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగుతుంది. అప్పుడు లాస్యకు తులసి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. అనంతరం ఆమెకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


2వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఉదయాన్నే లేచి వచ్చిన లాస్య అందరినీ తన వైపు తిప్పుకోవాలని అనుకుంటుంది. ఇందుకోసం అత్తయ్య అది కావాలా? ఇది కావాలా? అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. దీంతో ఆమెకు పరందామయ్య ఓ రేంజ్‌లో క్లాస్ పీకి షాకిస్తాడు. మరోవైపు, తులసికి సామ్రాట్ ఫస్ట్ శాలరీని హనీ చేత్తో ఇప్పిస్తాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ సరదాగా ఓ ఛాలెంజ్ చేసుకుంటారు. ఇక, ఇంట్లో సరుకుల విషయంలో లాస్య, నందూను అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్, అభి తండ్రికి బాసటగా నిలుస్తారు. దీంతో తాత వాళ్లను మెచ్చుకుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


3వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ మధ్య తరగతి గృహిణిగా మారతానని చెప్పిన తర్వాత అతడు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తాడు. దీంతో తులసి అతడి అనుమానాలను తీర్చుతుంది. అనంతరం ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లాలని అనుకుంటారు. అయితే, ఇందుకోసం బస్‌లో వెళ్లాని అనుకుంటారు. కానీ, సామ్రాట్ మాత్రం బయట తిరిగేందుకు ఇబ్బంది పడతాడు. ఇక, వంట చేస్తానని వచ్చిన లాస్యకు అంకిత, శృతి కోలుకోలేని షాక్ ఇస్తారు. దీంతో ఆమె తోకముడుచుకుని పారిపోతుంది. ఇదంతా భాగ్య చూసి షాక్‌కు గురవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

 ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో పరందామయ్య కోసం నందూ తన తల్లికి ఎదురు తిరిగిన దాన్ని బాగా హైలైట్ చేశారు. ఆ సమయంలో సీరియల్ ఎంతో రసవత్తరంగా సాగింది. దీని తర్వాత లాస్యను ఒంటరిని చేసి అందరూ ఒక్కటవడంతో తులసికి కష్టాలు పోయినట్లే అనిపించింది. ఇక, ఇప్పుడు సామ్రాట్, తులసి మధ్య సరదా సన్నివేశాలు వస్తున్నాయి. శనివారం ఎపిసోడ్‌లో భాగ్య ఎంట్రీ ఇవ్వడంతో కథలో మలుపులు వచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X