Intinti Gruhalakshmi Weekly Roundup: తులసి శీలంపై మచ్చ.. సామ్రాట్ కఠిన నిర్ణయం.. కథలో సూపర్ ట్విస్ట్

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


7వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య పుట్టినరోజు చేయాలని నందూ, లాస్య ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని అందరూ ఉండగానే చెప్తారు. ఆ సమయంలో అనసూయ మాత్రం తులసిని ఈ పార్టీకి పిలిచేది లేదని అంటుంది. దీంతో పరందామయ్యతో పాటు అందరూ అన్నం తినకుండా వెళ్లిపోతారు. ఇక, తులసి తన తల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరే ఇల్లు చూసుకోవాలని అనుకుంటుంది. ఈ విషయం ఆమెకు చెప్పగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కానీ, తులసి ఒప్పిస్తుంది. అప్పటికే తులసి కోసం సామ్రాట్ ఓ ఇల్లు చూసి పెడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


8వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి బయటకు వెళ్లిపోయిన తర్వాత మాధవి పుట్టింటికి వస్తుంది. వచ్చీ రావడమే నందూ, లాస్య, అనసూయలతో ఆమె గొడవలు పెట్టుకుంటుంది. ఆ సమయంలో తులసిని వెనకేసుకు వస్తూ మాట్లాడడంతో నందూ తన రుణం తీర్చుకోమని మాధవిపై ఫైర్ అవుతాడు. దీంతో ఆమె తన దగ్గర ఉన్న డబ్బులను అతడి అకౌంట్‌లోకి వేసేస్తుంది. మరోవైపు, సామ్రాట్, తులసిని తీసుకుని ఓ ఇంటికి వెళ్తాడు. అది ఆమెకు బాగా నచ్చుతుంది. అలాగే, ఓనర్ మాటలు కూడా నచ్చుతాయి. దీంతో ఆ ఇంట్లోకి వస్తానని తులసి చెబుతుంది.

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

9వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


9వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇల్లు చూసుకున్న తర్వాత తులసి సంతోషంగా ఉంటుంది. అప్పుడు సామ్రాట్ ఆమెకు ఓ గిఫ్ట్ ఇస్తాడు. కానీ, తులసి అది వద్దు అంటుంది. అలా బ్రతిమాలిన తర్వాత ఆమె గిఫ్ట్ చూడగా.. అందులో కీ చైన్ ఉంటుంది. అది చూసి తులసి సంతోషిస్తుంది. ఆ తర్వాత సామ్రాట్‌తో కలిసి తులసి షాపింగ్‌కు వెళ్తుంది. అక్కడ ప్రమిదలు కొనే సమయంలో ఓ కస్టమర్‌కు ఆమె క్లాస్ పీకుతుంది. ఇక, మాధవితో జరిగిన గొడవ వల్ల నందూ బాధగా ఉంటాడు. కానీ, లాస్య, అనసూయ మాత్రం తులసి వల్లే ఇలా జరిగిందని అంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


10వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చే సరికి తులసి కోసం వాళ్ల పిల్లలు వేచి చూస్తుంటారు. ఆ తర్వాత వాళ్ల సహాయంతో ఇల్లు మొత్తం సర్ధుకుంటారు. అనంతరం పాలు పొంగించిన తులసి అందరి కోసం పాయసం చేసి ఇస్తుంది. ఆ వెంటనే అందరూ వెళ్లిపోగా తులసి, సామ్రాట్ మాత్రమే ఉంటారు. వాళ్లిద్దరూ పూజా చేస్తుంటారు. ఆ సమయంలో సామ్రాట్ తన మనసులోని మాట చెప్పాలనుకుని ఆగిపోతాడు. ఇక, బాధలో ఉన్న నందూకు ధైర్యం చెప్పిన లాస్య.. పరందామయ్య పుట్టినరోజును ప్లాన్ చేస్తుంది. కానీ, ఇంట్లో వాళ్లు ఎవరూ కనిపించరు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి ఆయనకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని నందూ బ్యాచ్ ప్లాన్ చేస్తుంది. కానీ, ఆయనతో పాటు ప్రేమ్, శృతి, దివ్య, అంకితలు కనిపించకుండా వెళ్లిపోతారు. ఆ తర్వాత అందరూ కలిసి తులసి ఇంటికి చేరుకుంటారు. అక్కడే పరందామయ్య పుట్టినరోజు సెలెబ్రేషన్స్‌ చేసుకుంటారు. అదంతా అభి చాటుగా చూస్తుంటాడు. తులసికి ఎప్పటికి అండగా ఉంటానని సామ్రాట్.. పరందామయ్యకు హామీ ఇస్తాడు. వాళ్లంతా వెళ్లిపోగానే అభి ఆ ఇంట్లోకి కోపంగా వెళ్లి గొడవ పెట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


12వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పుట్టినరోజు సెలెబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన అభి.. తన తల్లిపై విరుచుకుపడతాడు. తనకు, అంకితను దూరం చేసిందరి, వివాహ బంధాన్ని నిలుపుకోవడం చేతకాదని, సామ్రాట్‌ లాంటి బాయ్‌ఫ్రెండ్‌ను సెట్ చేసుకుందని, వరంగల్ వెళ్లిన రోజు రాత్రే చెడిపోయిందని నోటికొచ్చినట్లు తిడతాడు. దీంతో తులసి అతడి చెంప పగలగొడుతుంది. మరోవైపు నందూ.. తన తండ్రి పుట్టినరోజు చేయాలని అనుకున్నా.. పరందామయ్య మాత్రం దానికి అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


నవంబర్ 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో పరందామయ్య పుట్టినరోజును బాగా హైలైట్ చేశారు. ఆయన బర్త్‌డేను ఘనంగా చేయాలని నందూ వాళ్లు భావిస్తారు. కానీ, ఆయన మాత్రం తులసి వాళ్లతో జరుపుకుంటాడు. దీంతో అభి తన ఉక్రోషాన్ని మొత్తం బయటకు తెచ్చి సీరియల్‌లో కొత్త విలన్‌గా మారతాడు. దీంతో సామ్రాట్‌ కఠిన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమోలో చూపించారు. దీంతో సీరియల్ కొత్త మలుపు తిరగబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X