Intinti Gruhalakshmi Weekly Roundup: తులసి ఇంట్లో రొమాంటిక్ సీన్స్.. కొత్త శత్రువు వల్ల కథలో మలుపు

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది.

ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూసేయండి మరి!

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

10వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తుంది. అక్కడకు లాస్య, నందూ, లక్కీలు వస్తారు. దీంతో వాళ్లు తన కోసమే వచ్చారని అనసూయ చెప్తుంది. ఆ తర్వాత లాస్య.. అత్తమామలకు అర్చన చేయిస్తుంది. అనంతరం శృతి, అంకిత తల్లులు కావాలని కోరుకుంటూ చెట్టుకు ముడుపులు కడతారు. అనంతరం తులసి వాళ్ల కాలనీలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతాయి.

ఆ సమయంలో హనీని వాడుకుని సామ్రాట్‌ను అక్కడకు రప్పించాలని లాస్య ప్లాన్ చేస్తుంది. అందుకు తగ్గట్లుగానే హనీని రెచ్చగొట్టి సామ్రాట్‌కు ఫోన్ చేయిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

11వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఫ్యామిలీ మొత్తం బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో సామ్రాట్ వాళ్ల బాబాయితో కలిసి అక్కడకు వస్తాడు. దీంతో అనసూయ, లాస్య, నందూలు ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటారు. అనంతరం హనీ చెప్పిన అబద్ధం వల్లే సామ్రాట్ అక్కడకు వచ్చాడని తెలుసుకుంటారు. తర్వాత సామ్రాట్, తులసి కలిసి దాండియా ఆడి విజయం సాధిస్తారు. ఇక, చివర్లో తులసి అమ్మవారికి దీపం వెలిగించేందుకు వెళ్తుండగా.. కాలనీ వాళ్లు ఆపడంతో పాటు ఆమెను నోటికొచ్చినట్లు తిడతారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

12వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి, సామ్రాట్ అందరి ముందే దాండియా ఆడి విజయం సాధించడంపై కాలనీ వాళ్లంతా అసహనంగా ఉంటారు. ఆ సమయంలో అనసూయ కూడా తులసిని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. అంతేకాదు, సామ్రాట్‌తో చేసుకున్న ఒప్పందం గురించి కూడా బయట పెడుతుంది. దీంతో తులసికి పట్టరాని కోపం వస్తుంది. ఆ వెంటనే తాను ఎదుర్కొంటోన్న సమస్యకు ఆడవారి కష్టాన్ని జోడిస్తూ అందరికీ క్లాస్ పీకుతుంది. అలాగే, సామ్రాట్‌తో తన ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని తేల్చి చెప్పేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

13వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. అంత గొడవ జరిగిన తర్వాత తులసి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు పరందామయ్య కూడా బయట కూర్చుని ఏడుస్తుంటారు. దీంతో ప్రేమ్ వెళ్లి ఆయనను ఓదార్చుతాడు. అప్పుడు తులసి కోసం ఓ పని చేస్తానని పరందామయ్య అంటాడు. ఉదయాన్నే తులసి టాబ్లెట్స్ ఇవ్వగా.. అనసూయ వేసుకోనంటుంది. అనంతరం తులసి ఆఫీస్‌కు వెళ్తానని చెప్తే ఆమెకు కోపం వస్తుంది. తర్వాత పరందామయ్య.. సామ్రాట్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఓ ప్రాపర్టీ గురించి సామ్రాట్‌కు చెప్పి దానికి సంబంధించిన డాక్యూమెంట్లు అందిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


14వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి మ్యూజిక్ స్కూల్ ఫైల్‌ను తీసుకున్న నందూ.. దాన్ని లాస్యకు అప్పగిస్తాడు. ఆ సమయంలో సామ్రాట్ వచ్చి నందూకు క్లాస్ పీకుతాడు. దీంతో అతడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ్, శృతి మరోసారి గొడవ పడతారు. దీంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటాడు. అప్పుడు శృతి వెళ్లిపోతుండగా.. తులసి చూసి ఆపుతుంది. అలా నిజం తెలుసుకున్న తులసి.. ప్రేమ్‌ను పిలిచి చెంపపై కొడుతుంది. అనంతరం నందూ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చి, లాస్య ముందరే సామ్రాట్‌పై ఉన్న కోపాన్ని బయటపెడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

15వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

15వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. శృతి తన బాధను చెప్పడంతో తులసి.. ప్రేమ్‌ను నిలదీస్తుంది. అంతేకాదు, అతడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. దీంతో ప్రేమ్ సారీ చెప్పడంతో పాటు శృతి కాళ్లు పట్టుకోడానికి వెళ్తాడు. అనంతరం శృతి అతడి బుగ్గపై అందరి ముందే ముద్దు పెడుతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరూ ప్రేమ్ - శృతి, అభి - అంకితకు మరోసారి ఫస్ట్ నైట్ చేయాలని నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగానే వాళ్లను రెడీ చేసి ఎవరి గదిలోకి వాళ్లను పంపుతారు. ఆ తర్వాత ఈ రెండు జంటలూ తమదైన శైలిలో రొమాన్స్‌ను పండిస్తాయి. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

అక్టోబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో అనసూయ అందరి ముందే సామ్రాట్‌ను అవమానించాలని చూడడం, ఆ సమయంలోనే నిజం చెప్పడంతో తులసి ఎదురు తిరుగుతుంది. అలాగే, సామ్రాట్ ఎప్పటికీ తన స్నేహితుడే అని అందరికీ తేల్చి చెబుతుంది. దీంతో అనసూయకు ఆమెపై అనుమానం పెరుగుతుంది. దీన్ని క్యాష్ చేసుకుని ఆమెను, తులసిని వేరే చేయాలని లాస్య అనుకుంటుంది. దీంతో అనసూయ.. తులసికి కొత్త శత్రువులా మారుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X