Intinti Gruhalakshmi Weekly Roundup: వర్షంలో తులసి, సామ్రాట్.. తప్పు చేస్తారా.. కథలో సూపర్ ట్విస్ట్

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూసేయండి!

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

17వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

17వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఫస్ట్ నైట్ కోసం రూమ్‌లోకి వెళ్లిన అంకిత ఉదయాన్నే వచ్చేయడంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత లాస్య.. అనసూయకు ఫోన్ చేసి ‘అత్తయ్యా.. దేవుడు మా మీద పగబట్టాడు. మా బతుకేదో మేము బతుకుతున్నాం. పాత పగను మనసులో పెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవడం ఏమైనా బాగుందా. మీ అబ్బాయి జాబ్ వదిలేశాడు' అని చెప్పి తులసిపై కోపం పెరిగేలా చేస్తుంది. ఆ తర్వాత పరందామయ్య.. సామ్రాట్‌కు ఫోన్ చేసి ఏదో ఆస్తి గురించి మాట్లాడతాడు. దీంతో అతడు అంతా సిద్ధంగానే ఉందని చెబుతాడు.

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

18వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ ఉద్యోగం మానేశాడని తెలిసిన తర్వాత సామ్రాట్ అతడిపై కోపంగా ఉంటాడు. దీంతో లాస్య ఆ జనరల్ మేనేజర్ పోస్టు తనకు ఇవ్వమని అడుగుతుంది. కానీ, సామ్రాట్ మాత్రం తులసికి ఇస్తున్నట్లు చెప్తాడు. దీంతో లాస్య ఆఫీసులోని వాళ్లందరినీ పిలిచి సామ్రాట్, తులిస మధ్య సన్నిహిత సంబంధం ఉందని చెబుతుంది. దీంతో సామ్రాట్ అదంతా విని లాస్యపై ఫైర్ అవుతూ ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఆ తర్వాత తులసికి జనరల్ మేనేజర్ పోస్టు ఇస్తాడు. దీనికి తులసి ఒప్పుకోకపోయినా బలవంతంగా ఇస్తాడు.

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

19వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

19వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తనను జాబ్‌లో నుంచి తీసేయొద్దని లాస్య.. తులసి, సామ్రాట్‌ను బ్రతిమాలుతుంది. కానీ, వాళ్లిద్దరూ దానికి ఒప్పుకోరు. దీంతో లాస్య వాళ్లకు ఎదురు తిరుగుతుంది. ఆ వెంటనే వాళ్లిద్దరిపై నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తుంది. ఆ తర్వాత తులసి ఇంటికి వెళ్లగానే అనసూయ కూడా ఆమెను నిందిస్తుంది. ఆ సమయంలో తులసి కూడా తన గొంతును వినిపిస్తుంది. తర్వాత నందూను లాస్య రెచ్చగొడుతుంది. ఇక, తులసి కోసం పరందామయ్య ఓ సర్‌ప్రైజ్ గిఫ్టును ఆమె గదిలో ఉంచుతాడు. అది ఏంటా అని అంతా చూస్తుంటారు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

20వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసికి పరందామయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఏముందో అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. కానీ, ఆయన మాత్రం తులసి పాత ఇంటికి అందరినీ తీసుకు వెళ్లి అక్కడ ఓపెన్ చేయమని చెప్తాడు. అది తీసి చూడగా అందులో రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇంటి తాళాలు ఉంటాయి. అవి తీసుకుని కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోకి వెళ్తారు. ఆ సమయంలో అనసూయకు సందేహాల మీద సందేహాలు వస్తుంటాయి. ఇక, చివర్లో తులసి.. అసలు ఇల్లు ఎలా తిరిగి వచ్చిందని పరందామయ్యను ప్రశ్నిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

21వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

21వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పరందామయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అంత ఖర్చు ఎందుకు చేశారంటూ తులసి ఆయనను ప్రశ్నిస్తుంది. దీంతో నీకంటూ ఏమీ లేదనే ఈ ఇల్లు ఇచ్చాను అంటాడు. ఆ తర్వాత ఈ ఇల్లు విషయాన్ని నందూ, లాస్యకు భాగ్య చెప్పి బాగా రెచ్చగొడుతుంది. దీంతో వాళ్లంతా తులసి ఇంటికి వెళ్లి గొడవ చేయాలని అనుకుంటున్నారు. ఇక, ఇంట్లో పూజ సమయానికి సామ్రాట్ వస్తాడు. అప్పుడే నందూ, లాస్య, భాగ్యలు వచ్చి గొడవ చేస్తారు. ఆ సమయంలో సామ్రాట్ వల్లే తను ఈ ఇల్లు కొనగలిగానన్న నిజాన్ని పరందామయ్య చెబుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

22వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ, లాస్య వచ్చి సామ్రాట్‌పై తిరగబడతారు. అంతేకాదు, నందూ అయితే తమ ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సామ్రాట్‌ను వెళ్లిపోమంటాడు. దీంతో తులసి అతడిని ఆపి ఇది తన ఇల్లు.. ఎప్పుడైనా రావొచ్చని చెబుతుంది. అప్పుడు అనసూయ.. తులసికి ఎదురు తిరిగి నందూకు సపోర్ట్ చేస్తుంది. దీంతో తులసి.. సామ్రాట్ తన ఫ్రెండ్ అని, ఇద్దరం కలిసి వరంగల్ వెళ్తున్నాం అని చెబుతుంది. ఆ తర్వాత ఈ విషయం గురించి పరందామయ్య, అనసూయ.. నందూ, లాస్య మధ్యన చర్చలు జరుగుతాయి. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

అక్టోబర్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో తులసికి పరందామయ్య పాత ఇంటిని గిఫ్టుగా ఇవ్వడాన్ని హైలైట్ చేశారు. అదే సమయంలో లాస్య, నందూలు తులసి, సామ్రాట్‌కు శత్రువులుగా మారడాన్ని కూడా చూపించారు. అయితే, వచ్చే వారంలో మాత్రం తులసి, సామ్రాట్ వరంగల్ టూర్‌కు కలిసి వెళ్లడాన్ని చూపిస్తారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదైనా జరగకూడనిది జరిగే అవకాశం ఉంటుందా అని అందరూ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X