Intinti Gruhalakshmi Weekly Roundup: సామ్రాట్‌తో తులసికి ఫస్ట్ నైట్.. నిందలు నిజం కాబోతున్నాయా?
తరాలు మారుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరూ ఓ లుక్కేయండి!

24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. వరంగల్ వెళ్లేందుకు బయటకు వచ్చిన తులసిని లాస్య, నందూ అవమానించేలా మాట్లాడతారు. అదే సమయంలో సామ్రాట్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తారు. దీంతో తులసి వాళ్లకు సరైన సమాధానాలు చెబుతుంది. ఆ వెంటనే అతడితో కారులో వరంగల్ బయలుదేరుతుంది. అలా కారులో వెళ్తోన్న సమయంలో తన మనసులోని మాటలను సామ్రాట్, తులసికి చెబుతాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఓ గుడి దగ్గర ఆగుతారు. అప్పుడు కూర్చుని మాట్లాడుతుండగా.. సామ్రాట్‌కు అమ్మాయిలు సైట్ కొట్టడంతో అతడు సిగ్గు పడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గుడిలో మాట్లాడుకుంటోన్న సమయంలో సామ్రాట్‌ను మళ్లీ పెళ్లి చేసుకోమని తులసి కోరుతుంది. అదే సమయంలో అసలెందుకు పెళ్లి చేసుకోలేని ప్రశ్నిస్తుంది. దీనికతడు హనీ వల్లే చేసుకోలేదని అంటాడు. అంతేకాదు, తులసిని రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. కానీ, ఆమె మాత్రం జీవితంలో తగిలిన దెబ్బలు చాలని, మళ్లీ అలాంటి ఆలోచన పెట్టుకోనని చెబుతుంది. ఇక, తులసి వాళ్లు తిరిగి రాకపోయే సరికి ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే నందూ.. తులసిపై నిందలు వేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కారుకు బ్రేక్ ఫెయిల్ అవడంతో సామ్రాట్, తులసి అక్కడే ఉన్న ఓ గెస్టు హౌస్‌లోకి వెళ్తారు. అప్పటికే అక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంత ఎక్వైరీ చేశాక అక్కడి వాళ్లు.. వీళ్లిద్దరినీ లోపలికి రమ్మంటారు. అనంతరం ఇద్దరూ డ్రెస్‌లు మార్చుకుని వచ్చి పార్టీలో పాల్గొంటారు. ఇక, ఆ పార్టీలో ఓ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు. అది చూసిన తులసి ఎంతగానో సంతోషిస్తుంది. ఆ తర్వాత అక్కడి వాళ్లతో కలిసి తులసి, సామ్రాట్ డ్యాన్స్ చేస్తారు. అప్పుడే తులసి ఇంటికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసి ఎంతకూ రాకపోవడంతో నందూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత గెస్ట్ హౌస్‌లోని ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తాడు. దీంతో సామ్రాట్, తులసి రెస్ట్ తీసుకుంటున్నారని ఓ కుర్రాడు చెబుతాడు. దీంతో నందూకు కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అనంతరం తులసి ఇంటికి రాగానే పంచాయతీ మొదలు పెడతారు. ఆ సమయంలో పార్టీలో వాళ్లు డ్యాన్స్ చేసిన వీడియోను చూపించి తులసిపై నిందలు వేస్తారు. దీంతో తులసి చాలా బాధ పడుతుంది. అయినా అనసూయ, అభి, లాస్య, నందూలు తులసిని నోటికొచ్చినట్లు అంటారు.

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తులసిని ఒంటరి దాన్ని చేసి అనసూయ, నందూ, అభి, లాస్యలు నిందలు వేస్తూ ఉంటారు. కానీ, ఆమె అందరికీ సమాధానాలు చెబుతూనే ఉంటుంది. దీంతో వాళ్లు ఆమెపై మాటలతో దాడి చేస్తారు. అప్పుడు తులసి ఎమోషనల్ అవుతుంది. అంతేకాదు, అసలు పార్టీలో ఏం జరిగిందో చెప్పినా కూడా వాళ్లెవరూ వినరు. ఒక సమయంలో అభి, ప్రేమ్ కొట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక, తనపై నిందలు వేయడంతో మనస్థాపం చెందిన తులసి.. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటుంది. మరోవైపు, సామ్రాట్ ఆమె గురించి బాధ పడుతుంటాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

29వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
29వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూ, లాస్య, అనసూయ, అభి తనపై వేసిన నిందలకు తులసి తట్టుకోలేక బాగా బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్లకు ఎదురు తిరిగి అందరికీ పేరు పేరునా సరైన సమాధానాలను చెబుతుంది. అనంతరం ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని అంటుంది. అప్పుడు కూడా తులసిని నిందిస్తుంటారు. ఆ తర్వాత పరందామయ్య వచ్చి తులసికి వీర తిలకం దిద్ది మరీ వెళ్లిపోమని పంపిస్తాడు. ఆ తర్వాత ఆమెతో పాటు ప్రేమ్ కూడా బయలుదేరుతాడు. కానీ, అతడిని వెనక్కి వెళ్లిపోమని చెప్పిన తులసి.. ఒంటరిగా వెళ్లిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
అక్టోబర్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో తులసి, సామ్రాట్‌తో కలిసి వెళ్లొచ్చిన తర్వాత ఆమెపై నందూ, లాస్య, అనసూయ, అభిలు ఎన్నో నిందలు వేసి ఇబ్బంది పెడతారు. దీంతో తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆమె సామ్రాట్ ఇంటికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే ఆమెపై నిందలకు బలం చేకూరినట్లు అవుతుంది. దీంతో ఆమె ప్రయాణం ఎటు వెళ్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











