twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Weekly Roundup: సామ్రాట్‌తో కలిసి ఆ ఇంట్లోకి తులసి.. పబ్లిక్‌లో పరువు గోవిందా!

    |

    దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి.

    తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరూ చూసేయండి!

    31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    31వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తులసి గురించి నందూ, అభి, లాస్య, అనసూయలు చర్చించుకుంటారు. ఆ సమయంలో లాస్య వాళ్లందరినీ రెచ్చగొడుతుంది. అంతేకాదు, పీడా విరగడ అయిపోయిందని అంటుంది. ఆ తర్వాత పరందామయ్య వచ్చి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తాడు.

    ఆ వెంటనే తులసి దగ్గరకు చిన్న కృష్ణయ్య వెళ్తాడు. అలా ఆమెకు ధైర్యం చెబుతాడు. అనంతరం తులసి వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లిపోతుంది. ఆమె వెనకాలే సామ్రాట్ కూడా వెళ్తాడు. చివర్లో తులసితో మాట్లాడమని ప్రేమ్‌.. సామ్రాట్‌ను కోరుతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

    Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల ఇంటికెళ్లిన తులసి.. కృష్ణుడు ప్రత్యక్షం.. ఆ మాట చెప్పడంతో!Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల ఇంటికెళ్లిన తులసి.. కృష్ణుడు ప్రత్యక్షం.. ఆ మాట చెప్పడంతో!

    1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    1వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    1వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పెద్ద గొడవ జరిగాక తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తులసి.. తల్లి, తమ్ముడు దగ్గరకు వచ్చేస్తుంది. అవమానం తర్వాత తన దగ్గరకు వచ్చిన కూతురికి ఆమె బాసటగా నిలుస్తుంది. ఆ సమయంలో అసలేం జరిగిందో చెప్పమని అడగ్గానే తులసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆమెకు తల్లి ధైర్యం చెబుతుంది. అనంతరం ప్రేమ్.. తన తల్లికి ధైర్యం చెప్పాలని సామ్రాట్‌ను ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. తర్వాత తులసి తన తల్లితో శీల పరీక్ష చేయాలా అని సూటిగా అడగ్గా.. ఆమె తన కూతురిపై నమ్మకం ఉందంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

    Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు షాకిచ్చిన నందూ.. అమ్మ ముందు తులసికి శీల పరీక్ష అంటూ!Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు షాకిచ్చిన నందూ.. అమ్మ ముందు తులసికి శీల పరీక్ష అంటూ!

    2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    2వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    2వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో నుంచి వచ్చేసిన తులసికి ధైర్యం చెప్పేందుకు ప్రేమ్, తల్లి, దీపక్, సామ్రాట్‌లు ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ మోటివేట్ చేస్తారు. అనంతరం తులసికి ఇల్లు ఇస్తానని సామ్రాట్ అంటాడు. కానీ, ఆమె మాత్రం రానని ముఖం మీదనే చెప్పేస్తుంది. ఇక, తులసి ఇంట్లోని వాళ్లంతా దిగాలుగా కనిపిస్తారు. దీంతో లాస్య, అనసూయలు వాళ్లను తిడుతూ తులసిపై మరిన్ని విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే లాస్యతో దివ్య గొడవకు దిగుతుంది. తర్వాత పరందామయ్య బాధ పడతాడు.

    3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    3వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తెల్లారిపోయినా అమ్మగారి ఇంట్లో తులసి నిద్ర లేవదు. ఇది చూసిన అందరూ వింత అని అనుకుంటారు. ఆ తర్వాత ప్రేమ్.. పరందామయ్యలా మాట్లాడి తల్లిని ఆటపట్టిస్తాడు. అనంతరం పరందామయ్య కాఫీ పెట్టుకుంటూ ఉండగా అనసూయ వెళ్లి ‘తులసి తప్పు చేస్తే.. శిక్ష నాకు వేస్తారా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరందామయ్య.. సామ్రాట్‌ను పొగుడుతూ నందూపై విమర్శలు చేస్తాడు. ఇక, చివర్లో టిఫిన్ లేట్ అయిందని అభికి కోపం వస్తుంది. అప్పుడు అంకిత వచ్చి అతడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ క్లాస్ పీకుతుంది.

    4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    4వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కూరగాయలు కొనడానికి వచ్చిన అనసూయను చుట్టు పక్కన వాళ్లంతా తులసి విషయంలో హేళన చేస్తూ మాట్లాడతారు. దీంతో ఆమెకు పట్టరాని కోపం వస్తుంది. అప్పుడు ఆమెకు తులసి కనిపిస్తుంది. దీంతో ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అవడంతో పాటు అందరి ముందర పరువు తీస్తుంది. ఆ తర్వాత లాస్య.. ఇంటిని అనసూయ పేరు మీద రాసినట్లు డాక్యూమెంట్లు తెచ్చి ఇవ్వగా.. తులసి వాటిపై సంతకం చేస్తుంది.

    అనంతరం సామ్రాట్ తన దగ్గరకు వచ్చిన తులసిని.. ఆమెకు ఉన్న బాధలన్నీ మర్చిపోయేలా ప్రోత్సహిస్తూ మాట్లాడతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

    Intinti Gruhalakshmi Today Episode: తులసితో సంతకం పెట్టించుకున్న లాస్య.. బంధం పూర్తిగా పోయినట్లే!Intinti Gruhalakshmi Today Episode: తులసితో సంతకం పెట్టించుకున్న లాస్య.. బంధం పూర్తిగా పోయినట్లే!

    5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

    5వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటి డాక్యూమెంట్లను తీసుకున్న లాస్య చాలా సంతోషంగా ఉంటుంది. వాటిని ఎవరికీ కనిపించకుండా దాచేయాలని అనుకుంటుంది. కానీ, అది నందూ చూస్తాడు. అయితే, అతడికి అవి రెజ్యూమ్ పేపర్లు అని అబద్ధం చెబుతుంది.

    ఇక, తులసి అద్దె ఇంటిలోకి వెళ్లాలని అనుకుంటుంది. ఇందుకోసం చాలా ఇల్లు వెతుకుతుంది. కాకపోతే వాళ్లంతా సింగిల్ అయిన వాళ్లకు రెంట్‌కు ఇవ్వమని చెప్తారు. అప్పుడు సామ్రాట్ ఫోన్ చేయగా అతడిపై తులసి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

    Intinti Gruhalakshmi Today Episode: కొత్త ఇంటికి తులసి.. ఆదిలోనే షాకిచ్చిన ఓనర్.. బలైపోయిన సామ్రాట్‌Intinti Gruhalakshmi Today Episode: కొత్త ఇంటికి తులసి.. ఆదిలోనే షాకిచ్చిన ఓనర్.. బలైపోయిన సామ్రాట్‌

    ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

    ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

    అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో తులసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్న ఆమె.. అద్దె ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మరోవైపు, అనసూయ వాళ్ల ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని లాస్య ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది. ఈ క్రమంలోనే ఇంటి డాక్యూమెంట్లను తన దగ్గర దాచుకుంటుంది. ఇక, వచ్చే వారం ఈ సీరియల్ మరింత ఎమోషనల్‌గా సాగబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Intinti Gruhalakshmi October 31st to November 5th Episodes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X