Intinti Gruhalakshmi Weekly Roundup: మళ్లీ ఒక్కటి కాబోతున్న వాళ్లిద్దరు.. తులసి పని అయిపోయినట్లే!

మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

3వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

3వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్‌కు వార్నింగ్ ఇచ్చిన తర్వాత అనసూయ ఇంట్లో పనులు చేస్తూ తులసి గురించి ఆలోచిస్తుంది. కానీ, తులసి ఏమీ మాట్లాడకుండా ఉండడంతో ఆమెలోని సందేహాలు మరింతగా పెరుగుతాయి. అప్పుడు తనకు ఆఫీసులో పని ఉందని ఆమె అనడంతో సామ్రాట్‌కు మళ్లీ వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది. ఇక, తులసి ఓ ఫైల్‌పై సంతకం చేయడంతో కంపెనీకి పది కోట్లు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నందూ చూడడంతో ఈ విషయం తెలిసి సామ్రాట్ తులసిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

4వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


4వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన దగ్గరకు ఫేక్ ఫైల్ తీసుకు వచ్చిన ఝాన్సీని తులసి ప్రశ్నిస్తుంది. కానీ, ఆమె మాత్రం సమాధానం చెప్పకుండానే వెళ్లిపోతుంది. ఆ తర్వాత సామ్రాట్ బాబాయి వచ్చి తులసిని ఓదార్చుతాడు. అనంతరం ఝాన్సీ రాజీనామా చేయబోగా.. సామ్రాట్ ఆమెను ఆపడంతో పాటు ఆ ఫైల్ ఇచ్చింది తనేనన్న నిజాన్ని బయటపెట్టేస్తాడు. అనంతరం హనీ పుట్టినరోజు వేడుకలకు తులసి ఫ్యామిలీ మొత్తం వస్తుంది. అప్పుడు హనీకి తులసి ఇచ్చిన డ్రెస్‌ను సామ్రాట్ వద్దని అంటాడు. అనంతరం అనసూయ, సామ్రాట్ మధ్య చర్చ జరుగుతుంది.

5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


5వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సాయంత్రం లోపల తులసి గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సామ్రాట్‌ను అనసూయ డిమాండ్ చేస్తుంది. అనంతరం హనీని సామ్రాట్ తెచ్చిన డ్రెస్‌తోనే తులసి రెడీ చేసి తీసుకొస్తుంది. ఆ సమయంలో అతడు డ్రెస్ ఎందుకు వద్దన్నాడు అన్న దానిపై అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి హనీతో కేక్ కట్ చేయిస్తారు. అనంతరం హనీ తులసి కోసం అమ్మ పాటను పాడుతుంది. ఇక, పార్టీ జరుగుతున్నప్పుడే తులసి స్థానంలో నందూను జనరల్ మేనేజర్‌గా నియమిస్తున్నట్లు సామ్రాట్ ప్రకటిస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

6వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

6వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


6వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ తనను జనరల్ మేనేజర్ పోస్టు నుంచి తీసేయడంతో తులసి బాధ పడుతుంది. అయినప్పటికీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత తులసి ఇంట్లో అందరూ బాధగా ఉండగా.. అభి, అనసూయ మాత్రమే సంతోషంగా ఉంటారు. ఇక, సామ్రాట్‌ను వాళ్ల బాబాయి ప్రశ్నిస్తాడు. దీంతో అనసూయ తన ముందు చేసిన డిమాండ్, ప్రేమ్ అరెస్ట్ గురించి ఆయనకు నిజం చెప్పేస్తాడు. తర్వాత తులసిని ఇంట్లో వాళ్లు ఓదార్చే ప్రయత్నం చేయగా.. ఆమె వాళ్లకే ధైర్యం చెప్పేలా మాట్లాడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

7వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


7వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ తప్పు చేశాడని అన్న వాళ్ల బాబాయి వెళ్లి తులసికి సారీ చెప్పమని అంటాడు. దీంతో అతడు వాళ్ల ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడు అనసూయ మాత్రమే కనిపించి.. తులసిని తన వల్లే ఉద్యోగంలో నుంచి తీసేసిన విషయం చెప్పొద్దని అంటుంది. అలాగే, సామ్రాట్‌ను ఇంటికి కూడా రావొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత తులసి వచ్చి ఫైల్ కోసం రావాల్సిన అవసరం లేదు అని అతడితో అంటుంది. ఇక, కాలనీలోని వాళ్లంతా పండుగను కలిసి చేద్దామని అంటారు. దీంతో తులసి ఫ్యామిలీ రెడీ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

8వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో


8వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. తన కోసం వచ్చిన సామ్రాట్‌ను ఎందుకు వచ్చారో చెప్పమని తులసి సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో అతడు నీకోసమే వచ్చానని అంటాడు. అప్పుడు తులసి మీరు నన్ను తీసేసి మంచి పని చేశారు. లేకుంటే నేనే బాధ పడాల్సి వచ్చేది అంటుంది. ఆ తర్వాత తమ ఇంట్లో జరిగే బతుకమ్మ పండుగకు హనీని పంపించమని అడుగుతుంది. మరోవైపు, లాస్య.. అనసూయను బుట్టలో వేసుకుని తులసికి దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ వెంటనే ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. దీనికామె ఒప్పుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే


అక్టోబర్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో అనసూయ వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో సామ్రాట్.. తులసిని కావాలనే ఉద్యోగంలో నుంచి తీసేయడంతో అంతా ఎమోషనల్‌గా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో తులసి, సామ్రాట్‌ను శాశ్వతంగా దూరం చేసేందుకు అనసూయ, లాస్య వేరు వేరుగా ప్రయత్నాలు కొనసాగిస్తారు. దీంతో వచ్చే వారం వీళ్లిద్దరూ చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు చూపించారు. అదే జరిగితే తులసికి మరిన్ని కొత్త కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X