Intinti Gruhalakshmi: బెడిసి కొట్టిన రాజ్యలక్ష్మి ప్లాన్.. జానూకు తెలిసిన నిజం.. కథలో సూపర్ ట్విస్ట్

పోటీ పెరుగుతన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి మరి!

11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
11వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ ఇంటికి వచ్చిన రత్నప్రభ, ధనుంజయ్ ఓపికగా డీల్ చేసి ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం హనీని ట్రాప్ చేయాలని అనుకుంటే.. ఆ చిన్నారి మాత్రం తనకు తులసినే కావాలని పట్టుబడుతుంది. దీంతో వాళ్లే తులసి ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక, విక్రమ్‌తో జాహ్నవి చిలిపి పనులు మరింతగా పెంచేస్తుంది. బలవంతంగా అతడితో అన్నం తినిపించుకుంటుంది. ఇక, రత్నప్రభ వాళ్లు అవమానించినట్లు మాట్లాడడంతో నందూకు కోపం వచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi:

12వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
12వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. జాహ్నవిని నీకు సవతిగా చేయడానికే ఇక్కడికి పిలిపించాను అని దివ్యతో రాజ్యలక్ష్మి అంటుంది. దీంతో ఆమె మొదట ప్రతిఘటించినా.. ఆ తర్వాత మాత్రం ఆలోచనలో పడిపోతుంది. అనంతరం జాహ్నవి వెళ్లి విక్రమ్‌ను హగ్ చేసుకోగా.. దివ్య అనుకుని సీరియస్ అవుతాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఏదో జరిగిందని జాహ్నవి అనుకుంటుంది. ఆ వెంటనే వెళ్లి రాజ్యలక్ష్మిని ప్రశ్నించగా.. దివ్యపై లేనిపోనివి అన్నీ చెప్తుంది. అంతేకాదు, విక్రమ్‌ను నీకు పెళ్లి చేయాలనుకున్నా అంటుంది. దీంతో జాహ్నవికి దివ్యపై కోపం పెరిగిపోతుంది.

Intinti Gruhalakshmi:

13వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
13వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను యోగా చేయడానికి దివ్య రమ్మని పిలవగా అతడు మాత్రం రానని అంటాడు. కానీ, జాహ్నవి పిలవగానే వెళ్తాడు. అలా వాళ్లిద్దరూ కలిసి యోగాసనాలు చేస్తుండగా చూసి సంతోషించిన రాజ్యలక్ష్మి.. దివ్యను తీసుకొచ్చి చూపిస్తుంది. మరోవైపు, నందూ కెఫేకు కాంట్రాక్టు రావడంతో తులసిని తీసుకుని ప్రజంటేషన్ ఇవ్వడానికి వెళ్తారు. ఆమె కాంట్రాక్టు వివరాలు చెప్తుండగా.. సామ్రాట్ బాబాయి కాల్ చేసి రమ్మంటాడు. దీంతో మధ్యలోనే ఆమె వెళ్లిపోతుంది. దీంతో నందూ కాంట్రాక్టు పోవడంతో కోపం కూడా వస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi:

14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

14వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. జాహ్నవి పిలవడంతో విక్రమ్ దొంగతనంగా ఆమె గదిలోకి వెళ్తాడు. ఆ వెంటనే దివ్య కూడా అతడి వెనకాలే వెళ్తుంది. అప్పుడు జాహ్నవి.. విక్రమ్‌కు గిఫ్టులు ఇస్తుంది. అది చూసిన దివ్య అతడు గదిలోకి రాగానే పెద్ద గొడవ చేస్తుంది. ఇక, హనీ విషయంలో తులసి జాగ్రత్తగా ఉండాలని నందూ ఆమెకు సూచిస్తాడు. దీంతో తులసి సానుకూలంగా స్పందిస్తుంది. అనంతరం హనీ తనకు తులసి వచ్చి కృష్ణుడి వేషం వేయాలని పట్టుబడుతుంది. దీనికా చిన్నారి వినకపోయే సరికి ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోతుంది.ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

15 తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
15వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గాయాలతోనే హనీ తులసి ఇంటికి వస్తుంది. దీంతో ఆ చిన్నారిని చూసి అందరూ షాక్ అవగా.. కృష్ణుడి వేషం వేయనన్నావని వచ్చాను అని హనీ చెప్తుంది. దీంతో తులసి హనీకి సర్ధి చెప్పి గాయానికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి తీసుకు వెళ్తుంది. అప్పటికే అక్కడ అందరూ హనీ గురించి కంగారు పడుతుంటారు. అప్పుడే తులసి వాళ్లు వెళ్లగా రత్నప్రభ సీరియస్ అవుతుంది. దీంతో హనీ ఆమెను ఆపుతుంది. ఇక, దివ్య, జాహ్నవి తన కోసం పోటీ పడుతుండగా.. విక్రమ్ మాత్రం భార్యను కాదని మరదలికే సపోర్టు చేసేస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

16వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
16వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ తన బట్టలే వేసుకోవాలని అటు దివ్య, ఇటు జాహ్నవి పట్టుబడతారు. దీంతో రాజ్యలక్ష్మి వచ్చి కాయిన్ వేయమని చెప్తుంది. అందులో జానూ గెలవడంతో ఆమె ఇచ్చిన బట్టలనే విక్రమ్ వేసుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి తులసి ఇంటికి వెళ్లగా.. అక్కడ జానూ ఆమెకు దండం పెడుతుంది. ఆ తర్వాత విక్రమ్‌కు మొదట జాహ్నవిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నామని బసవయ్య వాళ్లు చెప్తారు. దీంతో తులసి వాళ్లు షాక్ అవుతారు. అనంతరం జానూ ఓవర్ చేస్తుండడంతో ఆమెను పక్కకు తీసుకెళ్లిన దివ్య వార్నింగ్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Latest Week

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సాగిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ఆసక్తికర సంఘటనలతో సాగింది. ముఖ్యంగా ఈ వారంలో జాహ్నవి.. దివ్యను డామినేట్ చేయడాన్ని హైలైట్ చేసి చూపించారు. ఆమె వ్యవహారం రోజురోజుకూ ఎక్కువ అవడంతో దివ్యలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇక, తులసి మాత్రం హనీ గురించి ఆలోచిస్తుంటుంది. అదే సమయంలో రత్నప్రభ వాళ్లు కూడా సామ్రాట్ ఆస్తిని కాజేసే పనిలో ఒక అడుగు వేస్తారు. ఇక, వచ్చే వారంలో దివ్య గురించి జాహ్నవిపై విక్రమ్ సీరియస్ అవడాన్ని చూపించారు. దీంతో దీనిపై ఆసక్తి పెరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X